సరోష్ హోమీ కపాడియా

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సరోష్ హోమీ కపాడియా (ఎస్.హెచ్.కపాడియా) (29 సెప్టెంబరు 1947 – 4 జనవరి 2016) భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి.[2][3][4][5]

సరోష్ హోమీ కపాడియా
సరోష్ హోమీ కపాడియా

జస్టిస్ సరోష్ హోమీ కపాడియా


పదవీ కాలం
12 మే 2010 – 28 సెప్టెంబరు 2012
ముందు కె.జి.బాలకృష్ణన్
తరువాత ఆల్టామస్ కబీర్

ప్రధాన న్యాయమూర్తి, ఉత్తరాఖండ్ హైకోర్టు
పదవీ కాలం
5 ఆగష్టు 2003 – 17 డిసెంబరు 2003

వ్యక్తిగత వివరాలు

జననం (1947-09-29)1947 సెప్టెంబరు 29
ముంబై, భారతదేశం
మరణం 2016 జనవరి 4(2016-01-04) (వయసు 68)
ముంబై, భారతదేశం
జీవిత భాగస్వామి షహనాజ్
మతం జొరాస్ట్రియన్ మతము[1]

జివిత విశేషాలు మార్చు

ఎస్.హెచ్.కపాడియా ముంబైలో 1947లో జన్మించారు.[6] ఆసియా ఖండంలో ప్రాచీన న్యాయకళాశాల అయిన ప్రభుత్వ న్యాయ కళాశాల, ముంబైలో గ్రాడ్యుయేషన్ చేసారు. నగరంలోని ప్రభుత్వ లా కళాశాలలో పట్టా పొందాక కొంతకాలం క్లర్కుగా పనిచేశారు. క్లాస్‌-4 ఉద్యోగిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ప్రముఖ కార్మిక న్యాయవాది అయిన ఫిరోజ్ దమానియా వద్ద చేరారు. తరువాత 1974 సెప్టెంబరు 10 న బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా చేరారు.

కపాడియా అక్టోబరు 8, 1991, మార్చి 23, 1993 లలో బొంబాయి హైకోర్టులో అదనపు జడ్జిగా నియమింపబడ్డారు. ఆగష్టు 5, 2003 న ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్దారు. డిసెంబరు 18, 2003 న ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.[6] మే 8, 2010 న భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఆయనను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన సెప్టెంబరు 29, 2012 న పదవీవిరమణ చేసారు. ఈ కాలంలో ఆయన గుజరాత్ న్యాయ విశ్వవిద్యాలయంలో జనరల్ కౌన్సిల్ కు చైర్మన్ గా కూడా వ్యవహరించారు.[7]

వ్యక్తిగత జీవితం మార్చు

ఆయన సెర్నాజ్ ను వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి కుమారుడు ఛార్టెడ్ అకౌంటెంత్ గా పనిచేస్తున్నారు. కపాడియాకు ఆర్థికశాస్త్రం, పబ్లిక్ ఫైనాన్స్, ప్రాయోగిక భౌతిక శాస్త్రం, హిందూ, భౌద్ధ తత్వాల పై మక్కువ ఎక్కువ.[6] ఆయన జనవరి 4, 2016 న మరణించారు.[8]

ప్రముఖ తీర్పులు మార్చు

సరోష్ హోమీ కపాడియా భారత ప్రధాన న్యాయమూర్తిగా విలువలున్న సిద్ధాంతాలకు కట్టుబడి, క్రమశిక్షణతో ఉండేవారు.

వోడాఫోన్ కేసు తీర్పు, మీడియా విచారణ విషయంలో ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం తీర్పు లాంటివి జస్టిస్ కపాడియా హయాంలోనే వెలువడ్డాయి.[9]

జడ్జిగా ఎలాంటి శషభిషలకు తావులేకుం డా ఆయన అనేక కీలక తీర్పులు వెలువరించారు. యూపీఏ హయాంలో 2011 లో సీవీసీగా పీజే థామస్‌ నియామకం చెల్లదని పేర్కొంటూ జస్టిస్‌ కపాడియా తీర్పు చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ బెయిల్‌ రద్దు కేసులో ధర్మాసనంలోని మెజారిటీ జడ్జీలతో విభేదిస్తూ.... తీర్పు వెలువరించిన సాహసి.[10]

3207 రోజుల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన 834 తీర్పులు, ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నో ముఖ్యమైన తీర్పులను వెలువరించి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్న పేరు పొందారు.[11]

మూలాలు మార్చు

  1. "Minorities can rise to top jobs only in India: Chief Justice of India". The Times of India. 16 August 2012. Archived from the original on 17 ఆగస్టు 2012. Retrieved 16 August 2012.
  2. Agencies (Apr 30, 2010). "Justice S H Kapadia appointed as new CJI". The Indian Express. Archived from the original on 5 అక్టోబరు 2012. Retrieved 19 June 2012.
  3. Aditi Phadnis (May 14, 2010). "Newsmaker: S H Kapadia". Business Standard. Retrieved 19 June 2012.
  4. "Sarosh Homi Kapadia Appointed Chief Justice of India". Parsi Khabar. April 30, 2010. Retrieved 19 June 2012.
  5. "Honourable Mr. Justice S. H. Kapadia". Bombay High Court. Retrieved 19 June 2012.
  6. 6.0 6.1 6.2 "CJ & Sitting Judges - Hon'ble Mr. Justice S.H. Kapadia". Supreme Court of India website. Archived from the original on 30 నవంబరు 2010. Retrieved 30 April 2010.
  7. "Justice S H Kapadia sworn in as new Chief Justice of India". The Times of India. 12 May 2010. Archived from the original on 26 మే 2013. Retrieved 12 May 2010.
  8. "Former chief justice of India SH Kapadia passes away". The Economic Times. 5 January 2015. Retrieved 5 January 2016. Top legal luminary and former Supreme Court chief justice Sarosh Homi Kapadia passed away late on Monday, a family member said.
  9. "The Man Who Ruled in Vodafone's Favor". Wall Street Journal. Retrieved February 18, 2013.
  10. సుప్రీం కోర్టు విశ్రాంత చీఫ్‌ జస్టిస్‌ కపాడియా కన్నుమూత[permanent dead link]
  11. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా కన్నుమూత[permanent dead link]

ఇతర లింకులు మార్చు