సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్ 2016లో విడుదలైన తెలుగు చిత్రం. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రానికి ఇది కొనసాగింపు చిత్రం. నటుడు పవన్ కళ్యాణ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తూ కథను అందించడమే కాక ఈచిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

సర్దార్ గబ్బర్ సింగ్
దర్శకత్వంకె.ఎస్.రవీంద్ర
స్క్రీన్ ప్లేపవన్ కళ్యాణ్
కథపవన్ కళ్యాణ్
నిర్మాతపవన్ కళ్యాణ్,
శరద్ మరార్
తారాగణంపవన్ కళ్యాణ్,
కాజల్ అగర్వాల్,
శరద్ కేల్కర్
ఛాయాగ్రహణంఆర్థర్ ఎ. విల్సన్
కూర్పుగౌతంరాజు
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్
నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
ఈరోస్ ఇంటర్నేషనల్
దేశంభారత్
భాషతెలుగు

కథ మార్చు

తల్లిదండ్రులు లేని అనాథ కావటం వలన తన పేరును తానే గబ్బర్ సింగ్ అని పెట్టుకొన్న ఒక కుర్రాడు, అతని లాంటి ఇంకో అనాథ బాలుడికి సాంబ అనే పేరు పెడతాడు. దొంగను పట్టించటంతో ప్రాణాలకి తెగించి పోలీసు ఆఫీసర్ (తనికెళ్ళ భరణి)కి గబ్బర్ సింగ్ సహాయపడటంతో అతను వారిద్దరినీ చేరదీసి పోలీసులను చేస్తాడు.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు అయిన రత్తన్ పూర్ రాజ్యానికి రాకుమారి అర్షి. చిన్న నాటనే తల్లిదండ్రులను పోగొట్టుకొన్న అర్షి, మధుమతి పెంపకంలో పెరిగి యువరాణి అవుతుంది. దళపతి అయిన హరినారాయణ (ముఖేష్ రిషి) రాజ ప్రాసాదాన్ని, రాచరికపు వ్యవహారాలని, రాకుమారి బాగోగులను చూసుకొంటుంటాడు. ఇదే రత్తన్ పూర్ లో జమీందారీ వంశానికి చెందిన భైరోన్ సింఘ్ (శరత్ కేల్కర్) ఊళ్ళకు ఊళ్ళను కబ్జా చేసుకొని అక్కడ మైనింగ్ పరిశ్రమలు నెలకొల్పుతుంటాడు. ఎదురు తిరిగిన గ్రామస్తులను అడ్డు తొలగించుకోవటానికి వారి ప్రాణాలను సైతం లెక్క చేయడు.

భైరోన్, అతని అనుచర గణాల మితిమీరిన ఆగడాలను అరికట్టటానికి హరినారాయణ ఒక పోలీసు అధికారిని పంపమని కోరటంతో, తనికెళ్ళ భరణి గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్), సాంబ (ఆలీ లను అక్కడికి పంపుతాడు. అయితే అక్కడి పోలీసు కార్యాలయం శిథిలావస్థలో ఉండటం తొలిరోజునే గమనించిన గబ్బర్, దానికి ఎదురుగా ఉన్న ఒక క్షురకుని వద్ద నుండి ఒక కుర్చీ తీసుకొని, నడిరోడ్డునే పోలీసు కార్యాలయంగా మలచుకొంటాడు. భైరోన్ పేరు చెప్పుకు తిరిగే ఒక ఆకు రౌడీకి భయపడినట్లు నటించిన గబ్బర్ ను చూచి హరినారాయణ నిరుత్సాహపడతాడు. ఒక స్కూలును బారుగా మలచి, అక్కడి విద్యార్థులకు విద్య అందకుండా అడ్డుకొంటున్న ఆ ఆకురౌడీ, అతని అనుచరులకు గబ్బర్ దేహశుద్ధి చేసి, వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టి, తిరిగి ఆ పాఠశాలను విద్యార్థులకు అందించటంతో హరినారాయణ గబ్బర్ గురించి అర్థం చేసుకొంటాడు.

మధుమతి రాకుమారి అని, అర్షి రాకుమారి చెలికత్తె అని పొరబడిన గబ్బర్, అర్షిని ప్రేమిస్తాడు. నిజం తెలిసిన తర్వాత అర్షికి దూరమవ్వాలని ప్రయత్నించిన గబ్బర్ ను అర్షి తనపైన పెంచుకొన్న ప్రేమ ముగ్ధుణ్ని చేస్తుంది. పన్నెండేళ్ళకు ఒకసారి జరిగే ఉత్సవాలలో భైరోన్ అర్షిని చూసి, ముచ్చట పడతాడు. అప్పటికే తనకి గాయత్రి (సంజన)తో వివాహం అయి ఉన్ననూ, రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొంటాడు.

భైరోన్ అనుచర గణం చేసిన ఒక రోడ్డు ప్రమాదంలో పసిపిల్లలు గాయపడతారు. విషయం తెలిసిన గబ్బర్ రత్తన్ పూర్ కు నాకా బందీ విధిస్తాడు. భైరోన్ గబ్బర్ పైకి తన మనుషులను పంపుతాడు. అందరినీ మట్టి కరిపిస్తాడు గబ్బర్.

అర్షి/గబ్బర్ ల ప్రేమ వ్యవహారం హరినారాయణకు తెలిసేలా చేస్తాడు భైరోన్. గబ్బర్ ను దూరం చేసి, అర్షిని తాను చేసుకోవాలని అతని పన్నాగం. మొదట హరినారాయణ ఆగ్రహించినా, తర్వాత వారి ప్రేమను అంగీకరిస్తాడు. పోలీసు అధికారిగా ఉంటూనే భైరోన్ అడుగులకు మడుగులోత్తే బ్రహ్మాజీ సహాయంతో గబ్బర్ ఉద్యోగం ఊడేలా చేస్తాడు భైరోన్. తన ఉద్యోగాన్ని తిరిగి సంపాదించుకోవటానికి, అర్షిని పొందటానికి గబ్బర్ ఏం చేశాడు, ఎలా చేశాడన్నదే కథ చివరి ఘట్టం. సర్దార్ గబ్బర్ సింగ్ కాస్తా రాజా సర్దార్ గబ్బర్ సింగ్ అవుతాడు.

ఈ సినిమాలో పేలిన డైలాగులు మార్చు

  • తూ హం సే డర్ కీ బాత్ కర్తారే గూట్లే, హం డర్ కా డేఫినిసన్ హై బే (నువ్వు నాతో భయం గురించి మాట్లాడుతున్నావా రా గూట్లే, నేను భయానికి నిర్వచనాన్ని రా (డేఫినిసన్ అని హిందీవారు పలికినట్లు))
  • మనం ఏసే ప్రతి కౌంటర్ కి ఒక మీనింగ్ ఉంటది, చేసే ప్రతి ఎన్ కౌంటర్ కి ఒక టైమింగ్ ఉంటది
  • నాకు అరెస్ట్ అంటే ఎలర్జీ రా, ఎన్ కౌంటర్ అంటే ఎనర్జీ రా
  • పుట్టిన ప్రతి ఎదవ ఈ భూమి తన సొంతం అనుకొంటాడు, కానీ పుట్టిన ప్రతి వాడు ఈ భూమికే సొంతం
  • ఒక్కణ్ణే ఉంటా... ఒక్కడిలా ఉంటా... జనంతో నే ఉంటా... జనం లానే ఉంటా...
  • గెలవటానికి వచ్చిన ప్రతి వాడు వీరుడు కాలేడు అబ్బా...గెలిచిన వాడే వీరుడు
  • రాజు కులంలో నుంచి పుట్టడు, జనంలో నుంచి పుడతాడు.
  • రాజు అంటే శాసించేవాడు కాదు, రక్షించేవాడు.
  • రాజసం బ్లడ్ షేరింగ్‌లో ఉండదు, బ్లడ్ ఫైరింగ్‌లో ఉంటది.
  • భైరోన్: నేను రాజును, పాలించటానికే పుట్టాను
సర్దార్: నేను పోలీసును, శిక్షించటానికే పుట్టాను
  • భైరోన్: టీ ఎలా ఉంది?
సర్దార్: (అసహనంగా, లెక్కలేనితనంతో) టీ లానే ఉంది!

విశేషాలు మార్చు

  • రత్తన్ పూర్ లో మొట్టమొదటి రోజు డ్యూటీ చేయటానికి వెళ్ళిన సర్దార్ గబ్బర్ సింగ్, చిన్న ఆకు రౌడీకి భయపడినట్లు నటిస్తూ అతను పాట పాడమంటే క్షత్రియపుత్రుడు లోని సన్నా జాజి పాడక పాట అందుకోవటం. నాట్యం చేయమంటే మీ ఆటలిక సాగవు సాగవు లే అనే పాటకు నాట్యం చేయటం. ఒక ప్రక్క ఆడంగి స్టెప్పులతో వినోదాన్ని అందిస్తూనే, మరొక ప్రక్క రౌడీలను నర్మగర్భంగా హెచ్చరించటం.
  • చమేలీ పరాఠా సెంటర్ లో పని చేసే మహిళలను ఓరగా చూస్తూ, సిగ్గు పడుతూ పవన్ బృందం ముందుకు నడుచుకెళ్ళటం. నేపథ్యంలో ఖల్ నాయక్ చిత్రంలోని ఛోళీ కే పీఛే క్యా హై పాట వినబడటం
  • విరామం ముందు వచ్చే పోరాట సన్నివేశం. "అసురాంతక రణపుంగవ" అని సంస్కృత పద్యంలో అప్పుడు మొదలయ్యే గీతం
  • చిట్టచివరన జరిగే నాట్యపోటీలలో పవన్ కళ్యాణ్ వేసే వీణ స్టెప్పు, శంకర్ దాదా ఎం బీ బీ ఎస్ స్టెప్పులలో చిరంజీవే పవన్ లోకి పరకాయ ప్రవేశం చేశాడా అన్నంతగా లీనమై పవన్ నాట్యం చేయటం. నవ్వించటం ఒక ఎత్తు అయితే, అన్నయ్యను అనుకరించటం మరొక ఎత్తు
  • చిత్రంలోని ఒక్కొక్క పోరాట సన్నివేశం విశేషమే. ప్రత్యేకించి రావూ రమేష్ కు రక్షణ నివ్వటంలో కేవలం తుపాకులను ఉపయోగించి చేసిన పోరాట సన్నివేశం. అంతంలో కూడా పవన్ బ్రూస్ లీ వలె కరాటే పోజులిచ్చి ప్రతినాయకుడిని ఓడించటం

తారాగణం మార్చు

పాటలు మార్చు

  • సర్ధార , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.బెన్నీ దయాళ్
  • ఓ పిల్లా సుబానల్లా , రచన: అనంత్ శ్రీరామ్, గానం. విజయ్ ప్రకాష్, శ్రేయా ఘోషల్
  • టౌబా తోబా , రచన: అనంత్ శ్రీరామ్, గానం.నాకాష్ అజీజ్ , ఎం ఎం.మానసి
  • అదే వద్దన్న ఇదే వద్దన్న, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. ఎం. ఎల్. ఆర్ . కార్తీ కేయర్
  • నీచేప కళ్లు రచన: రామజోగయ్యశాస్త్రి, గానం.సాగర్, చిన్మయి
  • ఖాకీ చొక్కా, రచన: దేవీశ్రీ ప్రసాద్ , గానం.సింహా, మమత శర్మ

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. EENADU (25 July 2021). "కుంచె ఇస్తారనుకుంటే... చీపురిచ్చారు! - Sunday Magazine". EENADU. Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.

బాహ్య లింకులు మార్చు