సహారన్‌పూర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సహారన్‌పూర్ జిల్లా (హిందీ:सहारनपुर ज़िला) (ఉర్దూ: ضلع سهارنپور) ఒకటి. సహారన్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. సహారన్‌పూర్ జిల్లా సహారన్‌పూర్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లాలో దేహత్, దేవ్బంద్, గంగో, రాంపూర్ మనిహరన్ మొదలైన ముఖ్యపట్టణాలు ఉన్నాయి. జిల్లా సరిహద్దులో హర్యానా, ఉత్తరాఖండ్ ఉన్నాయి. జిల్లాకు సమీపంలో శివాలిక్ పర్వతాలు ఉన్నాయి. ఇది గంగాయమునా ఉత్తర భూభాగంలో ఉంది. ఇది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం.

సహారన్‌పూర్ జిల్లా
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లా స్థానం
సహారన్‌పూర్ జిల్లా
सहारनपुर ज़िला
ضلع سهارنپور
ఉత్తర ప్రదేశ్ పటంలో సహారన్‌పూర్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో సహారన్‌పూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుసహారన్‌పూర్
ముఖ్య పట్టణంసహారన్‌పూర్
Government
 • లోకసభ నియోజకవర్గాలుసహారన్‌పూర్
Area
 • మొత్తం3,860 km2 (1,490 sq mi)
Population
 (2011)
 • మొత్తం34,64,228
 • Density900/km2 (2,300/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత62.61[1]
Websiteఅధికారిక జాలస్థలి

చరిత్ర మార్చు

పురాతన చరిత్ర మార్చు

సహారన్‌పూర్ జిల్లా మొత్తం గంగా- యమునా మైదానంలో ఉంది. జిల్లా భౌగోళికంకా మానవనివాసానికి అనుగుణంగా ఉంటుంది. పురాతత్వ పరిశోధనలు పురాతనకాలం నుండి ఇక్కడ మానవనివాసాలు ఉన్నట్లు ఆధారాలతో తెలియజేస్తున్నాయి. జిల్లాలో పలు ప్రాంతాలలో (అంబఖేరి, బార్గావ్, హులాస్, నశీర్పూర్) త్రవ్వకాలు కొనసాగుతున్నాయి. అలాగే హరిద్వార్ జిల్లాలోని బహద్రాబాద్ వద్ద కూడా త్రవ్వకాలు కొనసాగుతున్నాయి. త్రవ్వకాలలో లభించిన కళాఖండాలు క్రీ.పూ 2000 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లు ౠజువుచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో సింధూలోయ నాగరికత, ఆరంభకాల సంస్కృతి విలసిల్లినట్లు భావిస్తున్నారు. పురాతత్వ పరిశోధనలు అంబాఖేరి, బర్గావ్, నసీర్పూర్, హులాస్ హరప్పన్ నాగరికతకు కేంద్రాలుగా ఉన్నాయి. ప్రస్తుత ముజఫర్ నగర్ జిల్లా ప్రాతంతో ఈ జిల్లా ప్రాంతం కూడా మహాభారత యుద్ధానికి సాక్ష్యంగా ఉన్నాయి. రెండూ ప్రాంతాలు కురు, మహాజనపదంలో భాగంగా ఉన్నాయి. ఉసినర, పాంచాల జనపదాలు వాటికి తూర్పు ప్రాంత జనపదాలుగా ఉన్నాయి. కనుక ఈ ప్రాంతపు చరిత్ర వేదకాలం నాటిదని తెలుస్తుంది. అదనపు పరిశోధనల ద్వారా ఈ ప్రాంతపు ప్రజల సంస్కృతి సంప్రదాయాలు, జీవనసరళి, అలాగే ఈ ప్రాంతపు రాజుల కచ్చితమైన పాలనా విధానం తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది.

మధ్యకాలం మార్చు

షంసుద్దీన్ ఈత్మిష్ (1211-36) పాలనాకాలంలో జిల్లా ప్రాంతం ఢిల్లీ సుల్తానేటులో భాగంగా మారింది. ఆ కాలంలో పాంధోయి, గండా నలా నదుల ప్రవాహం కారణంగా ఈ ప్రాంతం అరణ్యం, చిత్తడినేలలు అధికంగా ఉన్నాయి. వాతావరణంలో తడి కారణంగా మలేరియా అధికంగా సోకుతుండేది. 1340లో ఢిల్లీ సుల్తాన్ (1325-1351) ముహమ్మద్ బీన్ తుగ్లక్ ఉత్తర నదీ మైదానంలో ఉన్న శివాలిక్ కొండల తిరుగుబాటును అణచడానికి ఈ ప్రాంతం మీద యుద్ధం సాగించాడు. తరువాత ఈ ప్రాంతంలో పాంధోయి నదీ తీరంలో ఉన్న సూఫీ సన్యాసి స్గాహ్ హరూన్ చిష్టి గురించి తెలుసుకున్నాడు. ఆ ప్రదేశం సందర్శించిన తరువాత మహమ్మద్ బీన్ తుగ్లక్ ఆ ప్రాంతానికి సూఫీ సన్యాసి స్మారకార్ధం " షాహ్ - హార్‌పూర్ " అని మార్చాలని ఆఙ జారీ చేసాడు. [2] షరాన్‌పూర్ పురాతన ప్రాంతంలో మాలి గేట్- దీనానాథ్ బజార్ - హల్వాయ్‌హట్టా మధ్య నిరాడంబరంగా అలాగే చక్కగా సరక్షించబడిన సూఫీ సన్యాసి సమాధి ఉంది. 14వ శతాబ్ధపు చివరి భాగంలో సుల్తానేట్ అధికారం పతనావస్థకు చేరుకుంది. తరువాత ఈ ప్రాంతం మీద మధ్య ఆసియాకు చెందిన తిమూర్ (1336-1405) దండయాత్ర చేసాడు. తిమూర్ సైన్యాలు షహరంపూర్ మీదుగా ప్రయాణించి 1399 లో ఈ ప్రాంతం మీద దాడిచేసాయి. అయినప్పటికీ దండయాత్ర నిష్ఫలంగా ముగిసింది. బలహీనపడిన సుల్తానేటును తరువాత బాబర్ (1483-1531) స్వాధీనపరచుకుని ముగల్ సామ్రాజ్యస్థాపన చేసాడు.

పవార్లు మార్చు

గుర్జర్/పవార్/పర్మర/ పుంవర్ సామ్రాజ్యం పాలనలో సహారన్‌పూర్ జిల్లా భూభాగం ఉండేది. 1800 వరకు సహరన్‌పూర్ పూర్వం గుజర్‌గర్/గుజర్‌దేశ్/గుజరాతాగా పిలువబడేది. [3] ఈ ప్రాంతానికి చివరిసారిగా మహారాజా హరి సింగ్ పాలకుడుగా ఉన్నాడు. 1857లో బ్రిటిష్ప్రభుత్వానికి వ్యరేకంగా జరిగిన తిరుగుబాటులో ముఖ్యపాత్ర వహించినందుకు ఆయన కట్టిబంధించి ఫిరంగితో కాల్చి వేయబడ్డాడు. నాలుగు మూలల ధ్వంసం చేయబడిన హరిసింగ్ కోట ఇప్పటికీ గ్రామంలో జరిగిన సంఘట్స్నలకు సాక్ష్యంగా ఉంది. ఆయన కుమారుడు 6 సంవత్సరాల చౌదరీ ఆశారాం మాత్రం సురక్షితంగా రక్షించబడ్డాడు. ఆయన సహారన్‌పూర్ మొదటి మెజిస్ట్రేట్‌గా నియమించబడ్డాడు. అలాగే హాస్యాస్పదంగా బ్రిటిష్ ప్రభుత్వం చేత " రాయ్ సాహెబ్ " బిరుదు పొందడం విశేషం. విస్తరించిన వారి కుటుంబం లంధుయారా, పీర్నగర్, సంథార్ పాలకులుగా ఉండేవారు.

మొఘల్ కాలం మార్చు

16వ శతబ్ధంలో తైమూర్ రాజవంశానికి చెందిన వాడు జెంగిస్ఖాన్ వారసుడు అయిన బాబర్ ఫెర్గనలోయ (ప్రస్తుత ఉజ్బెకిస్థాన్) నుండి ఖైబర్ పాస్‌ను దాటి వచ్చి ముగల్ దాంరాజ్యాన్ని స్థాపించాడు. ముగల్ సామ్రాజ్యంలో భారతదేశంలోని ప్రాంతాలు, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లు భాగంగా ఉండేవి. [4] ముగల్ ప్రజల మధ్య ఆసియా లోని పర్షియాలోని టర్కీ ప్రజలని భావిస్తున్నారు. (ఇది ప్రత్యేకమైన మంగోల్ మిక్చర్).

ముగల్ పాలనా సమయంలో (1542-1605) సహారన్‌పూర్‌ ఢిల్లీ భూభాగంలో పాలనా విభాగంగ ఉండేది. అక్బర్ చక్రవర్తి ముగల్ కోశాధికారి సహ్ రణవీర్ సింగ్ (ఒక అగర్వాల్) కు సహారన్‌పూర్‌ను జాగీరుగా బహూకరించాడు.[5] సహ్ రణవీర్ సింగ్ ప్రస్తుత సహారన్‌పూర్‌ను సైనికశిక్షణా స్థావరంగా స్థాపించాడు. ఆ సమయంలో దీనికి సమీపంలో షేఖ్పురా, మల్హిపూర్ నివాసప్రాంతాలు ఉండేవి. సహారన్‌పూర్ ఒక ప్రాకరణావృత నగరం. నగరానికి 4 ద్వారాలు (సరై ద్వారం, మాలి ద్వారం, బురియా ద్వారం, లఖి ద్వారం ఉండేవి. నగరంలో నఖాసా బజారు, షాహ్ బెహ్లోల్, రాణి బజార్, లఖి ద్వారం మొదలైన ప్రాంతాలు ఉన్న్నాయి. సహారన్‌పూర్‌లోని చౌదారియన్ ప్రాంతంలో సహ్ రణవీర్ సింగ్ కోట శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆయన తన మొహల్లాలో (టోలి చోలిచౌధారియన్) జైన ఆలయం ఒకటి నిర్మించాడు.[6] ఇది ఇప్పుడు " దిగంబర్ జైన్ పంచాయితీ మందిర్ " అని పిలువబడుతుంది.

సయ్యాదులు , రొహిల్లాలు మార్చు

ముగల్ చక్రవర్తులు అక్బర్ - షాజహాన్ (1592-1666) సర్వత్ పరగణాను ముస్లిం సయ్యది కుటుంబానికి బహుమతిగా ఇచ్చాడు. 1633లో వారిలో ఒకరు అక్కడ ఒక నగరాన్ని స్థాపించి దానికి ఆయన తండ్రి సయ్యద్ ముజాఫర్ ఖాన్ స్మారకార్ధం " ముజఫర్ నగర్ " నానకరణం చేసాడు. ఈ ప్రాంతాన్ని సయ్యదుకు 1739లో నాదిర్ షా దండయాత్ర చేసేవరకు పాలించారు. నాదిర్ షా ఈ ప్రాంతాన్ని వదిలిన తరువాత ప్రాంతంలో అరాచకం చోటు చేసుకుంది. తరువాత ఈ ప్రాంతాన్ని రాజపుత్రులు, త్యాగీలు, బ్రాహ్మణులు, జాట్లు స్వాధీనం చేసుకున్నారు. తరువాత అరాజకాన్ని ఆసరాగ చేసుకుని రొహిల్లాలు గంగా - యమునా మైదానమంతటినీ ఆక్రమించుకున్నారు.

అహమ్మద్ షా దుర్రానీ మార్చు

1750లో ఈశాన్య, ఉత్తర భారతం మీద ఆఫ్ఘన్ పాలకుడు అహమ్మద్ షా దుర్రానీ దండయాత్ర చేసాడు. ఆయన సహరన్‌పూర్‌ను జాగీరుగా చేసి దానికి రొహిల్లా రాజప్రతినిధిని నియమించాడు. రాజప్రతినిధి నజాఫ్ ఖాన్‌కు " నవాబు నజీబ్ - ఉద్ - దౌలా " అనే బిరుదు ఇవ్వబడింది. 1754లో నజాఫ్ ఖాన్‌ సహారన్‌పూర్‌లో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆయన గౌంస్‌గర్‌ను తన రాజధానిగా చేసుకున్నాడు. తరువాత ఆయన హిందూ గుజర్ రాజప్రతినిధి మనోహర్ సింగ్‌తో సఖ్యత ఏర్పరచుకుని మరాఠీ రాజప్రతినిధుల దాడులను ఎదిరించాడు. 1759లో నజీబ్ - ఉద్ - దుల్లా " ఒక ఒప్పందం తరువాత 500 గ్రామాలను మనోహర్ సింగ్ స్వాధీనం చేసాడు. మనోహర్ సింగ్ లదుయారా రాజా అయ్యాడు. అలా రొహిల్లాలు, గుజార్లు సహరన్‌పూర్ ప్రాంతం మీద ఆధిక్యత సాధించారు.

మరాఠీలు మార్చు

1757లో మరాఠ సైన్యాలు సహారన్‌పూర్ ప్రాంతం మీద దండయాత్ర సాగించారు. ఫలితంగా నజీబ్- ఉద్- దుల్లా సహారన్‌పూర్ మీద ఆధిపత్యం కోల్పోయాడు. మరాఠీ పాలకులు రఘునాథ్‌రావు, మల్హోత్రా సహారన్‌పూర్ మీద ఆధిపత్యం సాధించారు. 1788 డిసెంబరు 18 న గులాం ఖాదిర్ ఖైదుతో సహారన్‌పూర్ ప్రాంతం మీద రొహిల్లాలు, మరాఠీల ఆధిపత్యం ముగింపుకు వచ్చింది. నహీబ్- ఉద్- దుల్లా మనుమడు మహాద్జీ సిధియా చేతిలో ఓడిపోయాడు. నవాబ్ గులాం ఖాదిర్ పాలనకు గుర్తుగా సహారన్‌పూర్‌లో నవాబ్‌గంజ్ ప్రాంతంలో అహమదాబాది కోట ఉంది. గులాం ఖాఫిర్ మరణంతో సహారన్‌పూర్‌లో రొహిల్లాల పాలనకు ముగింపు వచ్చింది. సహారన్‌పూర్ మరాఠీ సామ్రాజ్యంలో భాగం అయింది. ఘనీ బహదూర్ బండా మొదటి మరాఠా గవర్నర్‌గా నియమించబడ్డాడు. మరాఠీ పాలనలో సహారన్‌పూర్‌లో భుటేశ్వరాలయం నిర్మించబడింది. 1803లో రెండవ మరాఠీ యుద్ధం తరువాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ మరాఠీ పాలకులను ఓడించింది. తరువాత సహారన్‌పూర్ బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం అయింది. .[7]

బ్రిటిష్ కాలం మార్చు

1803లో ఈస్టిండియా కంపెనీ సహారన్‌పూర్ మీద దాడిచేసారు. 1816లో బ్రిటిష్ - గుర్కా యుద్ధం తరువాత గ్రేటర్ నేపాల్ లోని డెహ్రాడూన్ను చేర్చిన తరువాత సహారన్‌పూర్ అతి పెద్ద జిల్లాగా రూపుదిద్దుకుంది. ప్రస్తుత ముజఫర్‌పూర్, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాలు ఆసమయంలో సహారన్‌పూర్ జిల్లాలో భాగంగా ఉన్నాయి.

బేహత్ భూభాగంలో పలు రియాసత్‌లు (చిన్నచిన్న భూస్వామ్య కుటుంబాలు) ఉండేవి. వాటిలో ఒకటి చాలా ప్రాముఖ్యత కలిగిన ఘన ఖండి రియాసత్. సా.శ. 1745 పధాన్ జమీందారులు ఈ కుటుంబానికి చెందినవారే.

చౌదరీ రావ్ వజీర్ - ఉద్- దీన్ ఖాన్ మార్చు

1845లో రాజా రాం సింగ్ వంశీయుడు చౌదరీ రావ్ వజీర్ - ఉద్- దీన్ ఖాన్ (రాజస్థాన్ నుండి సహారన్‌పూర్‌కు వచ్చి షైక్‌పురా క్వాదీంలో స్థిరపడడానికి ముందు ముస్లిం మతానికి మారాడు) షైక్‌పురా క్వాదీంలో (సహారన్‌పూర్) గొప్ప జమీందారుగా గుర్తించబడ్డాడు. చౌదరీ రావ్ వజీర్ - ఉద్- దీన్ ఖాన్‌కు ఢిల్లీలోని ఎర్రకోటలో ఉన్న ముగల్ కోర్ట్ సభ్యత్వం, ఓటుహక్కు ఉంది. 57 గ్రామాలున్న సహారన్‌పూర్‌లో 27 వేల బిఘాల భూమితో చౌదరీ రావ్ వజీర్ - ఉద్- దీన్ ఖాన్‌ గొప్ప సంపన్నుడుగా పేరుతెచ్చుకున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి చౌదరీ రావ్ వజీర్ - ఉద్- దీన్ ఖాన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం చౌదరీ రావ్ వజీర్ - ఉద్- దీన్ ఖాన్‌కు రాజా బిరుదు ఇచ్చి సత్కరించింది. ఆయన 1895లో సహరన్‌పూర్‌లో మరణించాడు. ఆయనకు చౌదరీ రావు మషూక్ అలి ఖాన్, చౌదరీ రావు ఘఫూర్ ముహమ్మద్ అలి ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

రావు ఘఫూర్ ముహమ్మద్ అలి ఖాన్ మార్చు

రావు ఘఫూర్ ముహమ్మద్ అలి ఖాన్‌కు 7 మంది సంతానం ఉన్నారు. వీరిలో రావు మక్సూద్ అలి ఖాన్ పెద్దవాడు. ఆయన ఉన్నత విద్యావేత్తగా, ఆధ్యాత్మిక వేత్తగా గుర్తించబడ్డాడు. ఆయన సహరాంపూర్ రాజకుటుంబీకుడుగా గుర్తించబడ్డాడు. ఆయనను డెహ్రాడూన్ వద్ద లార్డ్ ఇర్విన్ చేత సత్కరించబడ్డాడు. అయన 1973లో షేఖ్‌పురా క్వాదింలో మరణించాడు. ఆయనకు రాం గులాం ముహిద్దీన్ ఖాన్, రావు జమియర్ హైదర్ ఖాన్, రావు యాకోబ్ ఖాన్, రావు గులాం హఫీజ్ అనే 4 కుమారులు ఉన్నారు. .

భౌగోళికం మార్చు

సహారన్‌పూర్ 29.97 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 77.55 డిగ్రీల తూర్పు రేఖంశంలో ఉంది. ఇది చండీగఢ్‌కు ఆగ్నేయంగా 130 కి.మీ దూరంలో అలాగే ఢిల్లీకి ఈశాన్యంలో 170 కి.మీ దూరంలోనూ ఉంది. జిల్లా సముద్రమట్టానికి 284 మీ. ఎత్తున ఉంది.

నైసర్గికం మార్చు

సహారన్‌పూర్ గంగా యమునా మైదానంలో ఉత్తరభాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో శివాలిక్ పర్వతాలు ఉన్నాయి. భారతదేశ ఎగువభూభాగంలో సహరాంపూర్ ఉన్న గంగా యమునా మైదానం ఒకటి. పంజాబుకు తూర్పుగా స్థిరరపడిన ఆర్యులు ఈ భూభాగంలో నివసించారని భావిస్తున్నారు.

జిల్లాకు ఉత్తర, తూర్పు దిశలో శివాలిక్ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. శివాలిక్ పర్వతాలు జిల్లాను సమీపకాలంలో రూపొందించిన ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని డెహ్రాడూన్ జిల్లా నుండి వేరు చేస్తున్నాయి. జిల్లా పశ్చిమ సరిహద్దులో యమునా నది ప్రవహిస్తూ జిల్లాను హర్యానా రాష్ట్రం లోని కర్నల్, యమునానగర్ జిల్లాల నుండి వేరుచేస్తుంది. తూర్పు సరిహద్దులో హరిద్వార్ జిల్లా ఉంది. 1989 వరకు హరిద్వార్ జిల్లా సహారన్‌పూర్ జిల్లాలో భాగంగా ఉంది. దక్షిణ సరిహద్దులో ముజఫర్ నగర్ జిల్లా ఉంది. బ్రిటిష్ పాలనా కాలంలో ముజఫర్ నగర్ జిల్లా కూడా సహరన్‌పూర్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా ఆకారంలో దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది.

1. శివాలిక్ హిల్ ట్రాక్ట్ 2. భబర్ భూమి 3. బంగర్ భూమి 4. ఖదర్ భూమి (యమునా, హిందొన్) 5. చిల్కానా సర్సావా రహదారి ముఖ్యమైన నదులు యమునా సొలని హిందొన్ రత్మౌ నగ్దెవ్

  • జిల్లాలోని నదులన్నీ యమునా, గంగా నదిలో సంగమిస్తున్నాయి.

వాతావరణం మార్చు

జిల్లాకు ఉత్తర భూభాగంలో ఉన్న హిమాలయాల కారణంగా సహరన్‌పూర్ జిల్లాలో ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంటుంది. ఎగువ గంగా మైదానం సబ్ హ్యూమిడిటీ రీజన్‌గా వర్గీకరించబడింది. సహారన్‌పూర్ సరాసరి ఉష్ణోగ్రత 23.3 డిగ్రీలు ఉంటుంది. జూన్ మాసం అతిఉష్ణ మాసంగా ఉంటుంది. జనవరి అతిశీతల మాసంగా ఉంటుంది. తూర్పు భాగంతో పోల్చితే పశ్చిమ భూభాగంలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది.

ఆర్ధికం మార్చు

జిల్లా ఫర్టిల్ బెల్టులో భాగంగా ఉంది. జిల్లాలో గంగా కాలువలు, బోరు బావులు మొదలైన నీటిపారుదల సౌకర్యాలు జిల్లా ఆర్థికంగా బలపడాడానికి సహకరిస్తుంది. జిల్లాలో పంటభూములు అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులను అందిస్తున్నాయి. గోధుమ, వరి మొదలైన పంటలు అధికంగా పండించబడుతున్నాయి. అలాగే చెరకు, ఉర్లగడ్డలు మొదలైన వాణిజ్య పంటలు కూడా అధికంగా పండించబడుతున్నాయి. పండ్లతోటలు, హార్టీ కల్చర్ తోటల నుండి లభిస్తున్న ఉత్పత్తులు ఎగుమతి చేయబడుతున్నాయి. డెహ్రాడూన్ బాసుమతి బియ్యం మార్కెటుకు కేంద్రం అయినప్పటికీ డెహ్రాడూన్ మార్కెటుకు బాసుమతి బియ్యం అధికంగా సహరాంపూర్ జిల్లా నుండి వస్తుంటాయి.

జిల్లాలో పరిశ్రమాభివృద్ధి, వ్యాపారానికి అత్యధికమైన అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో పేపర్, పొగాకు, వుడ్ వర్క్ మొదలైన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో మల్టీ నేషనల్ సిగరెట్టు తయారీ సంస్థ ఐ.టి.సి లిమిటెడ్ కంపెనీ ఉంది. జిల్లాలో వ్యవసాయ ఆధారితంగా తయారు చేయబడుతున్న వివిధ ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయబడుతున్నాయి.

  • జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తులను మూడు భాగాలుగా వర్గీకరించారు.

A. ఆహారం - ధాన్యాలు, కూరగాయలు, పండ్లు. పాలు, పాల ఉత్పత్తులు. B. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు - అతి ముఖ్యమైన పరిశ్రమలు షుగర్, గుర్ (పత్తి) టెక్స్టైల్, సిగరెట్లు. C. పారిశ్రామిక Goods- పేపర్, చెరకు, అల్లిక పని మెటీరియల్ & చెక్క బొమ్మలు

జిల్లా నుండి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయబడుతున్న విధాంగా బొగ్గు, ఇనుము, సిమెంటు, ఉప్పు, పెట్రోలియం, ఎరువులు, నూనె గింజలు, తోలు (పంజాబు, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్ నుండి) దిగుమతి చేయబడుతున్నాయి.[8]

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,464,228, [9]
ఇది దాదాపు. పనమా దేశ జనసంఖ్యకు సమానం.[10]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[11]
640 భారతదేశ జిల్లాలలో. 92 వ స్థానంలో ఉంది..[9]
1చ.కి.మీ జనసాంద్రత. 939 .[9]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.59%.[9]
స్త్రీ పురుష నిష్పత్తి. 887:1000 [9]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 72.03%.[9]
జాతియ సరాసరి (72%) కంటే. సమానం

విద్య మార్చు

సస్కృతికంగా సహారన్‌పూర్ జిల్లా పశ్చిమ ఉత్తర ప్రదేశ్ సంస్కృతిలా ఉంటుంది. జిల్లాలో పేపర్ పల్ప్ టెక్నాలజీ ఇంస్టిట్యూట్‌ ఉంది.ఇది " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (రూర్కేలా), సెంట్రల్ పల్ప్, పేపర్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ (మినిస్ట్రీ అఫ్ పల్ప్, పేపర్ ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది.

2012లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలోని గంగో వద్ద విశ్వవిద్యాలయం స్థాపించడానికి అనుమతి జారీ చేసింది. NICE Society Archived 2014-12-18 at the Wayback Machine to establish a State University in a small town Gangoh of District Saharanpur by the name, Shobhit University, 1956 నుండి జిల్లాలోని పలుకాలేజీలు మీరట్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అంతేకాక మీరట్ విశ్వవిద్యాలయం సైన్సు, ఆర్ట్స్ సబ్జెక్టులో ప్రధాన్యత కలిగిన పలు కోర్సులను ప్రవేశ పెట్టింది.

29°54′N 77°41′E / 29.900°N 77.683°E / 29.900; 77.683

మూలాలు మార్చు

  1. "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10.
  2. History The Imperial Gazetteer of India, v. 21, p. 369. 1909.
  3. The Peasant and the Raj: Studies in Agrarian Society and Peasant Rebellion ... By Eric Stokes page 166-184
  4. "The Islamic World to 1600: Rise of the Great Islamic Empires (The Mughal Empire)". Archived from the original on 2013-09-27. Retrieved 2014-12-16.
  5. http://www.indiatvnews.com/news/india/india-s-agrawal-community-its-history-and-prominent-personaliti-18629.html?page=4
  6. Madhu Jain, O. C. Handa, and Omacanda Handa, Wood Handicraft: A Study of Its Origin and Development in Saharanpur, Indus Publishing (2000), pp. 22–24. ISBN 81-7387-103-5
  7. Mayaram, Shail (2003). Against history, against state: counterperspectives from the margins Cultures of history. Columbia University Press, 2003. ISBN 978-0-231-12731-8.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-11. Retrieved 2014-12-16.
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  10. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Panama 3,460,462 July 2011 est.
  11. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Connecticut 3,574,097