Saquinavir, సాక్వినవిర్ ( (2S) -N-[ (2S,3R) -4-[ (3S) -3- (tert-butylcarbamoyl) -decahydroisoquinolin-2-yl]-3-hydroxy-1-phenylbutan-2-yl]-2- (quinolin-2-ylformamido) butanediamide, SQV, brand name Invirase ®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే Protease Inhibitor అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు SQV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 06-Dec-1995 [1] రోజున అమోదించబడింది. ఇది Protease Inhibitor తరగతిలొ కనుగొనబడిన మొట్టమొదటి ఔషదము.

మోతాదు ( Dosage ) మార్చు

ఎయిడ్స్
 
ఉపశమన మందులు
స్టావుడిన్
లామివుడిన్
జిడోవుడిన్
డిడనొసిన్
అబాకవిర్
టెనొఫవిర్
ఎంట్రిసిటబిన్
నెవిరపిన్
ఎఫావిరెంజ్
ఇండినవిర్
అటాజనవిర్
రిటనోవిర్
లొపినవిర్
డారునవిర్
నెల్పినవిర్
సాక్వినవిర్

ఈ మందును రిటనోవిర్ పాటుగ తీసుకోవాలి. SQV/RTV ( 500 mg లొపినవిర్ + 100 Mg రిటనోవిర్) ఈ మోతాదును రోజుకు రెండుసార్లు ప్రతి రోజు తీసుకొనవలెను. ఈ మందును పిల్లలకు ఇవ్వడానికి ఇంకా FDA.అమోదించలేదు. ఈ మందును తిన్న తర్వాత వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు. దీనితో పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతే గుర్తుకు వచ్చిన వెంబడే వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.

దుష్ప్రబావాలు (Side Effects ) మార్చు

ఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.

  1. ఈ మందు వేసుకొనే వారిలొ గుండె లయలొ తేడా కనపడుతుంది
  2. Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలొ కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలొ, మెడ వెనక బాగంలొ గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగే మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలొ కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అలాగే Protease Inhibitor లను వాడే వారిలొ డయాబెటిస్ (మధుమేహం) వచ్చే అవకాశం ఉంది.
  3. సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, లెత తెలుపు రంగు విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, ఇవి కొన్ని వారాల్లో నెలల్లో తగ్గిపోతాయి.

ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె? మార్చు

ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటే. గుండె సంబంధిత సమస్యలు వుండి వుంటే, అలాగెమధుమేహం ఉండివుంటే ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలొ తీసుకొనవలసి ఉంటుంది.

గర్భవతి మహిళలు వేసుకొవచ్చా? మార్చు

ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటే దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలొ తెలినది ఏమిటంటే గర్బం లోని పిండానికి హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగే బాలింత మహిళ పాలలొ ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-27. Retrieved 2012-07-11.
  2. http://www.aidsmeds.com/archive/Invirase_1558.shtml