సామల భాస్కర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా ఛాయాగ్రహకుడు.[1] కృష్ణవంశీ దర్శకత్వం వహించిన శశిరేఖా పరిణయం సినిమాకు తొలిసారిగా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.[2][3][4]

సామల భాస్కర్
జననండిసెంబర్ 8, 1975
విద్యఛాయాగ్రహణంలో మాస్టర్ డిగ్రీ
విద్యాసంస్థజె.ఎన్.టి.యు., హైదరాబాద్
వృత్తిఛాయాగ్రహకుడు

జననం, విద్య మార్చు

ఈయన లక్ష్మీనారాయణ, సుగుణ దంపతులకు 1975, డిసెంబరు 8న తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్లులో జన్మించాడు. మాదారంలోని సింగరేణి కాలిరీస్ హైస్కూల్‌లో చదువుకున్నాడు, ఇతని తండ్రి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రిటైర్డ్ ఉద్యోగిగా పనిచేశాడు. ముగ్గురు తోబుట్టువుల మధ్యవాడు భాస్కర్.

1996లో డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఫోటోగ్రఫీ, విజువల్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.

వివాహం మార్చు

వీరికి 2007, ఏప్రిల్ 29న సౌజన్యతో వివాహం జరిగింది. ఒక కూతురు (ఐశ్వర్య), ఒక కుమారుడు (అమర్త్య) ఉన్నారు.[5][6]

సినీరంగం మార్చు

JNTU ఫోటోగ్రఫీ & విజువల్ కమ్యూనికేషన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్‌తో తుజే మేరీ కసమ్ (2003), ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై (2003)లో అసిస్టెంట్‌గా చేరాడు. ఆ తర్వాత సై (2004), చత్రపతి (2005), యమదొంగ (2007) సినిమాలకు కె.కె. సెంథిల్ కుమార్‌తో చీఫ్ అసోసియేట్‌గా చేరాడు. ఏకకాలంలో సందీప్ గుణ్ణం, తనన సన్నిహితుడు సర్వేష్ మురారితో కలిసి 2వ యూనిట్ డిఓపిగా అనేక చిత్రాలకు పనిచేశాడు. అరుంధతి (2009) సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కృష్ణవంశీ తన శశిరేఖా పరిణయం చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా భాస్కర్‌ని ఎంచుకున్నాడు.[7][8] హిందీ, మరాఠి సినిమాలకు కూడా పనిచేశాడు.

చిత్ర సమాహారం మార్చు

సంవత్సరం చిత్రంపేరు భాష దర్శకుడు
2009 శశిరేఖ పరిణయం తెలుగు కృష్ణవంశీ
2008 త్రీ తెలుగు శేఖర్ సూరి
2012 అయ్యారే తెలుగు సాగర్ కె. చంద్ర
2012 ఏడ్యాంచీ జాత్రా మరాఠి మిలింద్ ఖాడ్వే
2013 పోపాట్ మరాఠి సతీష్ రాజ్వాడే
2014 జపం తెలుగు ఎం. ఎస్. రాజు
2014 షూటర్ హిందీ విశ్రం సావంత్
2015 దొంగాట తెలుగు వంశీకృష్ణ
2015 కొలంబస్[9] తెలుగు రమేష్ సామల
2015 జస్ట్ గమ్మత్ మరాఠి మిలింద్ ఖాడ్వే
2016 రాజా చెయ్యివేస్తే తెలుగు ప్రదీప్ చిలుకూరి
2018 W/O రామ్ తెలుగు విజయ్‌ యలకంటి
2019 మిస్సెస్ సుబ్బలక్ష్మి తెలుగు
2022 నేనెవరు తెలుగు నిర్ణయ్ పల్నాటి
2023 ఆపరేషన్ ఫ్రైడే తెలుగు విశ్రమ్ సావంత్
2023 గ్రంధాలయం తెలుగు సాయి శివన్‌ జంపన
2023 వైరం తెలుగు, కన్నడ
2023 కర్మణ్యే వాధికారస్తే తెలుగు

మూలాలు మార్చు

  1. "Samala Bhaskar - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2021-06-05.
  2. "samalabhasker". Vimeo.
  3. "Wife of Ram Telugu Movie Review". 22 July 2018.
  4. "Columbus Telugu Movie Review | Columbus Movie Review | Sumanth Ashwin Columbus Movie Review | Columbus Review and Rating | Columbus Telugu Review | Columbus Cinema Review | Sumanth Ashwin Columbus Cinema Review". 24 October 2015.
  5. "Dongaata Telugu Movie Review | Lakshmi Manchu Dongaata Movie Review | Dongaata Review and Rating | Lakshmi Manchu Dongaata Telugu Review | Dongaata Review | Dongaata Twitter Updates | Dongaata Cinema Review | Lakshmi Manchu Dongaata Review and Rating | Dongaata First Day First Show Talk | Dongaata Live updates | Dongaata Film Review". 9 May 2015.
  6. "Review : Ayyare – A thought Provoking Movie". 20 January 2012.
  7. "Dongaata Telugu Movie Review | Lakshmi Manchu Dongaata Movie Review | Dongaata Review and Rating | Lakshmi Manchu Dongaata Telugu Review | Dongaata Review | Dongaata Twitter Updates | Dongaata Cinema Review | Lakshmi Manchu Dongaata Review and Rating | Dongaata First Day First Show Talk | Dongaata Live updates | Dongaata Film Review". 9 May 2015.
  8. "Review : Ayyare – A thought Provoking Movie". 20 January 2012.
  9. Nadadhur, Srivathsan (23 October 2015). "Columbus: In no man's world". The Hindu. Retrieved 27 May 2020.

బయటి లింకులు మార్చు