సిల నేరంగల్ సిల మణితర్గల్

ఎ. భీమ్‌సింగ్ దర్శకత్వంలో 1977లో విడుదలైన తమిళ సినిమా

సిల నేరంగల్ సిల మణితర్గల్, 1977 ఏప్రిల్ 1న విడుదలైన తమిళ సినిమా.[2] ఎ.బి.ఎస్. ప్రొడక్షన్స్ బ్యానరులో బి. హృదయనాథ్ నిర్మించిన ఈ సినిమాకు ఎ. భీమ్‌సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లక్ష్మి, శ్రీకాంత్, సికె నగేష్, వైజి పార్థసారధి తదితరులు నటించారు.[3] డి.జయకాంతన్ రాసిన సిల నేరంగల్ సిల మణితర్గల్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.

సిల నేరంగల్ సిల మణితర్గల్
సిల నేరంగల్ సిల మణితర్గల్ టైటిల్ కార్డు
దర్శకత్వంఎ. భీమ్‌సింగ్
స్క్రీన్ ప్లేజయకాంతన్
దీనిపై ఆధారితంజయకాంతన్ రాసిన సిల నేరంగల్ సిల మణితర్గల్ నవల ఆధారంగా
నిర్మాతబి. హృదయనాథ్
తారాగణంలక్ష్మి
శ్రీకాంత్
సికె నగేష్
ఛాయాగ్రహణంజి. విఠల్ రావు
కూర్పుఎ. పాల్ దురైసింగం
సంగీతంఎం. ఎస్. విశ్వనాథన్
నిర్మాణ
సంస్థ
ఎ.బి.ఎస్. ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1977, ఏప్రిల్ 1
సినిమా నిడివి
130 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతమిళం

24వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో లక్ష్మికి జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది. 2011 చిల నేరంగళ్ చిల మనుష్యార్‌ అనే పేరుతో మలయాళ టెలివిజన్ ధారావాహికగా రీమేక్ చేయబడింది.[4]

నటవర్గం మార్చు

  • లక్ష్మి (గంగ)
  • శ్రీకాంత్ (ప్రభాకర్‌)
  • సికె నగేష్ (ఆర్కే విశ్వనాథ శర్మ)
  • వైజి పార్థసారథి (వెంకు మామ)
  • ఆర్. నీలకంఠన్ (గణేషన్)
  • సుకుమారి (గణేషన్ భార్య "అన్నీ")
  • ఎస్. సుందరి బాయి (కనగం)
  • రాజసులోచన (పద్మ)
  • జయగీత (మంజు)
  • భువనాదేవి (ఇమ్మాన్యుయేల్‌)

పాటలు మార్చు

ఈ సినిమాకు ఎం. ఎస్. విశ్వనాథన్ సంగీతం స్వరపరిచాడు. ఈ సినిమాలో "వేరు ఇదం తేది", "కండతాయ్ సొల్లుగిరెన్ ఉంగల్" అనే రెండు పాటలు మాత్రమే ఉన్నాయి.[5][6][7]

స్పందన మార్చు

ఆనంద వికటన్ పత్రికలో 1977, ఏప్రిల్ 17న వచ్చిన సమీక్షలో సినిమా గురించి, ముఖ్యంగా లక్ష్మి నటన గురించి ప్రశంసిస్తూ రాశారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలలో, ఉత్తమ నటి పురస్కారం వచ్చింది.[8]

మూలాలు మార్చు

  1. Rajadhyaksha & Willemen 1998, p. 429.
  2. "சில நேரங்களில் சில மனிதர்கள்' - அப்பவே அப்படி கதை". Hindu Tamil Thisai. 1 April 2019. Archived from the original on 2 September 2019. Retrieved 2021-08-03.
  3. "Sila Nerangalil Sila Manithargal (1976)". Indiancine.ma. Retrieved 2021-08-03.
  4. "Chila Nerangalil Chila Manushyar comes alive on Amrita TV". Afaqs. 14 January 2011. Archived from the original on 22 March 2018. Retrieved 2021-08-03.
  5. Rangan, Baradwaj (27 March 2005). "Sila Nerangalil Sila Manidhargal". Baradwaj Rangan. Retrieved 2021-08-03.
  6. Dhananjayan 2014, p. 239.
  7. Kolappan, B. (27 April 2016). "Soon, an album of Jayakanthan's film songs". The Hindu. Retrieved 2021-08-03.
  8. The Times of India Directory and Year Book Including Who's who. The Times Group. 1978. p. 319.

గ్రంథ పట్టిక మార్చు

బయటి లింకులు మార్చు