సీతాదేవి (సినిమా)

సీతాదేవి 1982 లో విడిదలైన తెలుగు చిత్రం, చిరంజీవి, సుజాత (నటి), సత్యేంద్ర కుమార్, రాళ్ళపల్లి, హరి బాబు, డబ్బింగ్ జానకి, పిఎల్ నారాయణ, వంకాయల సత్యనారాయణ నటించిన ఈ సినిమాకు ఈరంకి శర్మ దర్శకుడు.

సీతాదేవి
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం ఈరంకి శర్మ
నిర్మాణం టి రామన్
తారాగణం సుజాత,
చిరంజీవి,
జానకి
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ అమృతా ఫిల్మ్స్
భాష తెలుగు

కథ మార్చు

ఈ కథ తమ్ముడు (చిరంజీవి) అక్క (సుజాత) ల చుట్టూ తిరుగుతుంది. సుజాత తన బాల్యంలో ఒక ఉయ్యాల మీద నుండి పడిపోతుంది. ఆమె కుడి చేయి చచ్చుపడిపోతుంది. భార్య చనిపోయిన ఒక పోలీసు అధికారి (సత్యేంద్ర కుమార్) సుజాతను పెళ్ళి చేసుకుంటాడు. సుజాత పెళ్ళి కోసం చిరంజీవి రాళ్ళపల్లి ప్రభావంతో చిన్న చిన్న దొంగతనాలలు చేస్తూంటాడు. పెళ్ళి జరిగిన రోజున చిరంజీవిని పోలీసులు అరెస్టు చేస్తారు. తమ్ముడు దొంగ అయినందున సుజాత భర్త ఆమెను వదిలేస్తాడు. తన భర్తతో ఏకం కావడానికి సుజాత ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటుందనేది మొఇగతా సినిమా.