ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ (కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు), కోస్తాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) ప్రాంతాలని కలిపి సీమాంధ్రగా వ్యవహరిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడటంతో మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ (అనగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర) ప్రాంతాన్ని సీమాంధ్ర లేదా నవ్యాంధ్రగా వ్యవహరిస్తున్నారు. 1953న ఏర్పడి 1956 వరకూ కర్నూలు రాజధానిగా కొనసాగిన ఆంధ్ర రాష్ట్రమే ఇప్పటి సీమాంధ్ర. 1956లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలతో కూడిన ఆంధ్ర రాష్ట్రం , హైదరాబాదు రాష్ట్రం (ఇప్పటి తెలంగాణ ప్రాంతం) లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని సీమాంధ్ర ప్రాంతము పసుపుపచ్చని రంగులో చూపబడినది
కొత్తగా ఏర్పడనున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం (2 జూన్ 2014 నుండి 4 ఏప్రిల్ 2022)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూతన జిల్లాలు (4 ఏప్రిల్ 2022 నుండి అమలులోకి)

ప్రాంతాలు మార్చు

సీమాంధ్ర మూడు ప్రాంతాలతో కూడి ఉంది. ఉత్తరాంధ్ర/కళింగాంధ్ర/ఉత్తర కోస్తాగా పిలువబడే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు ఒక భాగం.కోస్తా జిల్లాలుగా పిలువబడే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు రెండవ భాగం. రాయలసీమగా పిలువబడే కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలు మూడవ భాగం.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సీమాంధ్ర&oldid=3897581" నుండి వెలికితీశారు