సుజిత ఒక దక్షిణ భారత సినీ, టీవీ నటి.[3] తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో, టీవీ సీరియళ్ళలో నటించింది.

సుజిత
జననం
సుజిత

(1983-07-12) 1983 జూలై 12 (వయసు 40)[1]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1983–ప్రస్తుతం
జీవిత భాగస్వామిధనుష్
తల్లిదండ్రులుటి.ఎస్. మణి (నాన్న)
రాధ (అమ్మ)
బంధువులుదర్శకుడు సూర్యకిరణ్ - (అన్న)
నటి కల్యాణి - (వదిన)

ఈమె అన్న సూర్యకిరణ్ సినీ దర్శకుడు. ఇతను తెలుగులో సుమంత్ హీరోగా సత్యం సినిమాకు దర్శకత్వం వహించాడు. నటి కల్యాణి ని వివాహం చేసుకున్నాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

సుజిత కేరళ లోని తిరువనంతపురం లో టి.ఎస్. మణి, రాధ దంపతులకు జన్మించింది.[4] ఆమెకు ఒక అన్న, ఒక చెల్లెలు ఉన్నారు.[1] అన్న సూర్యకిరణ్ సినీ దర్శకుడు నటి కల్యాణి ని వివాహం చేసుకున్నాడు.[5]

ప్రకటనలు రూపొందించే ధనుష్ తో ఆమె వివాహం జరిగింది. వారు పొల్లాచ్చిలో స్థిరపడ్డారు.[2] వారికి ఒకరు సంతానం.[6]

నటించిన సినిమాలు మార్చు

సుజిత పసివాడి ప్రాణం సినిమాలో మాట్లాడలేని, వినలేని అబ్బాయి గా నటించి మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమా కథ మొత్తం ఈ అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. తరువాత ముద్దుబిడ్డ సినిమాలో కృష్ణ, రజనీ లా కొడుకు గా నటించారు. గణేష్ సినిమాలో వెంకటేష్ చెల్లెలుగా నటించింది. ఈ సినిమాలో ఆమెది ముఖ్యమైన పాత్ర. జై చిరంజీవ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటించింది.[7]

సినిమాల పాక్షిక జాబితా మార్చు

సీరియళ్ళు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "An exclusive interview with the Golden Girl of Chinnathirai , Sujitha". nilacharal.com. Retrieved February 21, 2015.
  2. 2.0 2.1 "Sujitha". nettv4u.com. Archived from the original on 2015-02-21. Retrieved February 21, 2015.
  3. "సుజిత కుటుంబం, ప్రొఫైలు". celebritykick.com. Retrieved 19 September 2016.
  4. "ഓര്മ വെച്ച നാള് മുതല്". mathrubhumi.com. Archived from the original on 19 జనవరి 2014. Retrieved 14 December 2013.
  5. "Sujitha Profile". whataboutu.com. Archived from the original on 10 జూన్ 2013. Retrieved 22 November 2012.
  6. "Family members". celebritykick.com. Retrieved February 21, 2015.
  7. "jaichiranjeeva Review". idlebrain.com. Retrieved 22 November 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=సుజిత&oldid=4162396" నుండి వెలికితీశారు