సుమన్ రంగనాథన్

భారతీయ మోడల్, నటి.

సుమన్ రంగనాథన్, భారతీయ మోడల్, నటి. కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ సినిమాలలో నటించింది.[3] [4]

సుమన్ రంగనాథన్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1989–ప్రస్తుతం
ఎత్తు5 అడుగుల 7 అంగుళాలు
జీవిత భాగస్వామిబంటీ వాలియా (2005-2007)[1]
సజన్ చిన్నప్ప (2019)[2]

జననం మార్చు

సుమన్ రంగనాథ్ కర్ణాటకలోని తుమకూరులో జన్మించింది.[5]

వ్యక్తిగత జీవితం మార్చు

2005లో సినీ నిర్మాత బంటీ వాలియాలో సుమన్ రంగనాథన్ వివాహం జరిగింది. 2007లో వాళ్ళిద్దరు విడిపోయారు.[6] తరువాత 2019 జూన్ 3న కర్ణాటకలోని కొడుగు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త సజన్ చిన్నప్పను వివాహం చేసుకుంది.[7]

సినిమారంగం మార్చు

1989లో శంకర్ నాగ్‌తో కలిసి సీబీఐ శంకర్ అనే కన్నడ సినిమాలో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత, బాల హోంబాలే (1989), డాక్టర్ కృష్ణ (1989) శాంత శిశునాల షరీఫా (1990), నమ్మూర హమ్మెర (1990) వంటి సినిమాలలో నటించింది.

1990లో పుదు పాటు అనే సినిమాతో తమిళ సినిమారంగంలోకి అరంగేట్రం చేసింది.[8] ఆ తర్వాత, పెరుమ్ పుల్లి (1991), మానగర కావల్ (1991), కురుంబుక్కారన్ (1991), ఉన్నై వాజ్తి పాడుగిరెన్ (1992), మెట్టుపట్టి మిరాసు (1994), ముదల్ ఉదయమ్ (1995) వంటి అనేక తమిళ సినిమాలలో నటించింది.

1996లో ఫరేబ్ సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. 1999లో ఆ అబ్ లౌట్ చలెన్, 2003లో బాగ్‌బాన్‌ సినిమాలలో నటించింది.[9]

తెలుగులో 1990లో 20వ శతాబ్దం, పద్మావతీ కళ్యాణం, 2021లో బావ నచ్చాడు, 2021లో కపటధారి వంటి సినిమాలలో నటించింది.

2007లో మిస్టర్ ఇండియా వరల్డ్ పోటికి న్యాయనిర్ణేతగా, కలర్స్ కన్నడ ఛానల్ లో ప్రసారమయిన తకడిమిత అనే కన్నడ రియాల్టీ షోకి న్యాయనిర్ణేత వ్యవహరించింది.[10]

కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న తర్వాత, 2013లో అరంభం[11] అనే తమిళ సినిమాలో, 2016లో నీర్ దోసె. 2019లో కావలుదారి వంటి సినిమాలలో నటించింది.[12][13]

మూలాలు మార్చు

  1. "Bunty and Suman split up". www.filmibeat.com. 14 May 2007.
  2. "Suman ties the knot with businessman Sajan". www.timesofindia.com. 6 June 2019.
  3. "Gorgeous Suman Ranganath Reveals her Remuneration for #Kavaludaari on #Scrapbook with RJ Nethra". Archived from the original on 2022-02-09. Retrieved 2022-02-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Madhu Daithota (26 November 2008). "'I've realised my dreams' – News & Interviews – Bollywood – Hindi – Entertainment – The Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 14 February 2014.
  5. "Best of Bollywood, South Cinema, Celebrity Photos & Videos | MSN India". www.msn.com. Retrieved 2022-02-09.
  6. Staff (14 May 2007). "Bunty and Suman split up". www.filmibeat.com.
  7. "Suman ties the knot with businessman Sajan". www.timesofindia.com. 6 June 2019.
  8. "Pudhu Pattu (1990) - Review, Star Cast, News, Photos". Archived from the original on 2020-08-05. Retrieved 2022-02-09.
  9. "Now Suman Ranganathan gets into body-double trouble".
  10. "Suman Ranganath back on small screen to judge dance reality show". 29 January 2019.
  11. "'Aarambam' is Suman Ranganathan's comeback vehicle - Tamil News". 26 October 2013.
  12. "Neer Dose: Serving up a heavy dose of misogyny". The Hindu. 3 September 2016.
  13. "'Kavaludaari' review: A brilliant neo-noir film that keeps you hooked to your seat". 12 April 2019.

బయటి లింకులు మార్చు