సుహాని కలిత తెలుగు చలనచిత్ర నటి. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, బెంగాళీ చిత్రాలలో నటించింది. 1996లో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా పరిచయమైన సుహానీ, సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది.[1]

సుహాని కలిత
సుహాని కలిత
జననం
సుహాని కలిత

(1991-12-25) 1991 డిసెంబరు 25 (వయసు 32)
ఇతర పేర్లునటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు1996–2004; 2007–ప్రస్తుతం

2022 జూన్ మాసంలో మ్యుజీషియన్, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో సుహాని నిశ్చితార్థం జరిగింది.

జననం - విద్యాభ్యాసం మార్చు

సుహాని స్వస్థలం ముంబై. 1991 డిసెంబరు 25న హైదరాబాదులో జన్మించింది. పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు హైదరాబాదులోనే చదివింది.

సినీరంగ ప్రస్థానం మార్చు

సుహానీ, 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని తెలుగు, ఒక హిందీ, ఒక బెంగాళీ సినిమాలలో బాలనటిగా నటించింది. 2008లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది. బాలనటి గా 40 చిత్రాల, హీరోయిన్ గా 11 చిత్రాలలో నటించంది.[2] చివరిగా తెలుగులో 2010లో స్నేహగీతం చిత్రంలో ఆమె నటించింది.

ప్రచారకర్తగా మార్చు

నీరూస్, ఆర్.ఎస్. బ్రదర్స్, సామ్ సంగ్, సూరజ్ భాన్ జ్యూయలరీ, డిబి బ్రదర్స్, కాసం బ్రదర్స్, శరవణ స్టోర్స్, వీడియోకాన్, సిస్లే, ఎయిర్ టెల్, బి.ఎస్.ఎన్.ఎల్., కార్వీ ఫినన్న్స్ , ఐడియా సెల్లులార్ వంటి వాటికి ప్రచారకర్తగా చేసింది.

నటించిన చిత్రాల జాబితా మార్చు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాషపేరు ఇతర వివరాలు
1996 బాల రామాయణం తెలుగు బాలనటి
1998 గణేష్ తెలుగు బాలనటి
ప్రేమంటే ఇదేరా తెలుగు బాలనటి
1999 నా హృదయంలో నిదురించే చెలి తెలుగు బాలనటి
ప్రేమించేమనసు తెలుగు బాలనటి
2000 హిందుస్తాన్ - ది మదర్ హరిణి తెలుగు బాలనటి, ఉత్తమ బాలనటిగా నంది పురస్కారం
2001 ఎదురులేని మనిషి రాణి తెలుగు బాలనటి
మనసంతా నువ్వే యంగ్ అను తెలుగు బాలనటి
2002 కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహీన్ హిందీ బాలనటి
2003 ఎలా చెప్పను తెలుగు బాలనటి
మోనేరు మాజే తుమీ బెంగాళీ బాలనటి
2004 అనందమానందమాయే తెలుగు బాలనటి
2007 సవాల్ కీర్తన నరసింహం తెలుగు హీరోయిన్ గా మొదటిచిత్రం
2007 అనసూయ[3] క్లబ్ డాన్సర్ తెలుగు
2008 కృషి[4] ఐశ్వర్య తెలుగు
2009 శ్రీశైలం లిఖిత తెలుగు
2010 స్నేహగీతం మహాలక్ష్మీ తెలుగు
ఇరందు ముగం పవిత్ర తమిళం
2011 అప్పవి రమ్య తమిళం
సుకుమార్ (సినిమా) పూజా తెలుగు చిత్రీకరణ

మూలాలు మార్చు

  1. Sakshi (30 July 2021). "'మనసంతా నువ్వే' చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
  2. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "సుహాని కలిత , Suhani kalita". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 March 2017. Retrieved 27 May 2017.
  3. జీ సినిమాలు. "జీ సినిమాలు ( 19th May)". www.zeecinemalu.com. Retrieved 27 May 2017.
  4. తెలుగు వెబ్ దునియా. "ప్రేమ కథాంశంతో "కృషి" ట్రెయిలర్ మీకోసం". telugu.webdunia.com. Retrieved 27 May 2017.