సూర్య క్షిపణి

భారతదేశం అభివృద్ధి చేస్తున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి

సూర్య ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. భారత్ దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీని గురించిన మొదటి రిపోర్టు 1995 లో ది నాన్-ప్రోలిఫరేషన్ రివ్యూలో వచ్చింది. 2012 నాటికి ఈ ప్రాజెక్టు స్థితి ఏమిటన్నది ఇంకా ధ్రువపడలేదు.

సూర్య ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి
రకంఖండాంతర బాలిస్టిక్ క్షిపణి[1]
అభివృద్ధి చేసిన దేశంIndia
సర్వీసు చరిత్ర
సర్వీసులోధ్రువీకరణ కాలేదు
ఉత్పత్తి చరిత్ర
డిజైనరుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)
విశిష్టతలు
బరువు~55,000 kg

వార్‌హెడ్3-10 మిర్వ్ వార్‌హెడ్లు యీల్డ్>200 kt[2]

ప్రొపెల్లెంటుమొదటి రెండు దశలు ఘన ఇంధనంతో, మూడవ దశ ద్రవ ఇంధనంతో (లేదా మూడు దశలూ ఘన ఇంధనంతో)[3]
ఆపరేషను
పరిధి
~12,000-16,000 కిమీ[1]
వేగంMach 24 (29,400 km/h)
లాంచి
ప్లాట్‌ఫారం
TEL

చరిత్ర మార్చు

ది నాన్-ప్రోలిఫరేషన్ రివ్యూలో ప్రచురితమైన రిపోర్టు ప్రకారం భారత్ అభివృద్ధి చేస్తున్న ఖండాంతర క్షిపణి  పేరు సూర్య.[4] DRDO ఈ ప్రాజెక్టును 1994 లో మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. 2010 వరకు ఈ రిపోర్టును మరే ఇతర వర్గం కూడా ధ్రువీకరించలేదు. భారత ప్రభుత్వ అధికారులు పదేపదే ఈ ప్రాజెక్టు ఉనికిని ఖండించారు.

ఆ రిపోర్టు ప్రకారం సూర్య భూమ్మీద నుండి ప్రయోగించే, ఘన, ద్రవ ఇంధనంతో కూడిన, ఖండాంతర క్షిపణి. ఇది భారత సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం  యొక్క ప్రాజెక్టుల్లో ఒకటి. దీని పరిధి 12,000[5] నుండి 16,000 కిమీ ఉంటుందని భావిస్తున్నారు.[1]

ఈ క్షిపణిని ఇంకా అభివృద్ధి చెయ్యలేదు కాబట్టి, దాని సాంకేతిక వివరాలు ఇంకా తెలియ రాలేదు. కార్యక్రమం వివరాలు మొత్తం చాలా రహస్యంగా ఉన్నాయి.  

చలామణీలో ఉన్న సాంకేతిక వివరాలు మార్చు

  • శ్రేణి: ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి
  • Lasing: భూమ్మీద నుండి ప్రయోగించేలా, సముద్రం లోపల నుండి ప్రయోగించేలా. జలాంతర్గామి నుండి ప్రయోగించే వీలు ఉండడం దీని ప్రధానమైన అంశం - ఈ కూర్పు యొక్క పరిధి 10,000 కిమీ పైచిలుకు.
  • పొడవు: 40.00 మీ.
  • వ్యాసం: 1.1 మీ.
  • బరువు: 55,000 కెజి.
  • ప్రొపల్షన్: మొదటి/రెండు దశలు ఘన, మూడవ దశ ద్రవ.
  • వార్‌హెడ్ సామర్థ్యాలు: 3-10 అణు వార్‌హెడ్‌లు -ఒక్కొక్కటీ 250-750 కిలో టన్నులు.
  • స్థితి: ధ్రువీకరించబడలేదు
  • మోహరించబడిందా?: ధ్రువీకరించబడలేదు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు వనరులు మార్చు

  1. 1.0 1.1 1.2 "Missile impossible: why the Agni-V falls short". rbth. Retrieved 29 July 2015.[permanent dead link]
  2. N. Madhuprasad (25 August 2005). "Boost to Indian Armed Forces' Deterrence Arsenal; India to Develop Intercontinental Ballistic Missile". Bangalore Deccan Herald. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  3. 3.0 3.1 "Surya-1/-2 | Missile ThreatMissile Threat". Missilethreat.com. 2012-10-29. Retrieved 2012-12-11.[permanent dead link]
  4. Surya ICBM.
  5. "Surya - India Missile Special Weapons Delivery Systems". Fas.org. Retrieved 2010-08-31.