సోనియా అగర్వాల్

సినీ నటి

సోనియా అగర్వాల్ ఒక భారతీయ సినీ నటి. ఎక్కువగా తమిళ సినిమాల్లో, కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన కాదల్ కొండేన్, తెలుగు తమిళ ద్విభాషా చిత్రం 7G బృందావన్ కాలనీ తో మంచి పేరు సంపాదించింది.[1][2]

సోనియా అగర్వాల్
జననం
సోనియా అగర్వాల్

(1982-03-28) 1982 మార్చి 28 (వయసు 42)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసెల్వరాఘవన్ (m.2006–2010; విడాకులు)

వ్యక్తిగత జీవితం మార్చు

చండీగఢ్ లో జన్మించిన సోనియా మాతృభాష పంజాబీ. తనకు నటిగా మంచి పేరు తీసుకొచ్చిన దర్శకుడు సెల్వరాఘవన్ ను డిసెంబరు 2006 న వివాహం చేసుకుంది. తర్వాత నటించడం మానేసింది. అయితే ఈ జంట 2009 ఆగస్టులో విడిపోయారు.[3]

కెరీర్ మార్చు

ఆమె పాఠశాలలో చదివేటపుడే జీ టీవీలో ఓ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. తర్వాత 2002 లో నీ ప్రేమకై అనే తెలుగు సినిమా లో చిన్న పాత్ర వేసింది. తర్వాత చందు అనే కన్నడ సినిమాలో సుదీప్ సరసన నటించింది.[4][5] 2003 లో సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన కాదల్ కొండేన్ సినిమాలో ఆమె పోషించిన దివ్య పాత్రకు మంచి పేరు, అవకాశాలు తీసుకొచ్చింది. ఈ సినిమాకు గాను ఆమెకు ఉత్తమ నూతన నటిగా ఇంటర్నేషనల్ తమిళ్ ఫిల్మ్ పురస్కారం లభించింది. ఈ సినిమాను తెలుగులో అల్లరి నరేష్ కథానాయకుడిగా నేను అనే పేరుతో పునర్నిర్మించారు. ఇందులో దివ్య పాత్రలో వేద నటించింది. సోనియా తర్వాత శింబు, విజయ్ లాంటి నటుల సరసన కోవిల్, మాధురే, పుదుపేట్టై లాంటి సినిమాల్లో నటించింది. తర్వాత నటించిన 7G బృందావన్ కాలనీ కూడా మంచి విజయం సాధించింది. 2005లో ఆమె నటించిన ఒరు కల్లురియిన్ కథై, ఒరు నాళ్ ఒరు కనవు అనే సినిమాలు పరాజయం పాలయ్యాయి. తరువాత ఆమె సుశి గణేశన్ దర్శకత్వంలో తిరుట్టు పాయలే, సెల్వరాఘవన్ దర్శకత్వంలో పుదుపేట్టై అనే సినిమాల్లో నటించింది. తిరుట్టు పాయలే మంచి విజయం సాధించగా పుదుపేట్టే విమర్శకుల నుంచి మంచి ప్రశంసలందుకుంది.

2011లో సెల్వరాఘవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత వానం సినిమాలో ఓ సహాయ పాత్రలో నటించింది. మరో నాలుగు అవకాశాలు చేజిక్కించుకుంది.[6] ఆమె 2021లో తెలుగులో డిటెక్టివ్ సత్యభామ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించింది.

నటించిన సినిమాలు మార్చు

మూలాలు మార్చు

  1. "The Hindu : Life Chennai : Success for Sonia Agarwal".
  2. "Sonia Agarwal, actor". The Hindu.
  3. "Selva-Sonia granted divorce". IndiaGlitz. 2010-03-12. Archived from the original on 2010-03-15. Retrieved 12 March 2010.
  4. "It's tough to stop laughing when Vivekh is around: Sonia Agarwal". Deccan Chronicle.
  5. "I took Dr Kalam's advice and returned part-time to cinema: Vivekh". Deccan Chronicle.
  6. "Sonia Aggarwal signs another film!". Sify.com. 2011-07-12. Archived from the original on 2018-06-13. Retrieved 2013-08-16.

బయటి లింకులు మార్చు