సోమనాథ్ ఛటర్జీ (1929 జూలై 25 - 2018 ఆగస్టు13) భారతీయ రాజకీయ నాయకుడు. అతను ఒక దశాబ్దం (2008-2018) వరకు ఏ పార్టీకి చెందని స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పటికీ, తన జీవితంలో ఎక్కువ కాలం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తో సంబంధం కలిగి ఉన్నాడు. అతను 2004 నుండి 2009 వరకు లోక్‌సభ (భారత పార్లమెంటు) స్పీకర్ గా పనిచేసాడు. [1]

గౌరవనీయులైన
సోమనాథ్ ఛటర్జీ
పార్లెమెంటు సభ్యుడు
14వ లోక్‌సభ స్ఫీకరు
In office
4 జూన్ 2004 – 16 మే 2009
అంతకు ముందు వారుమనోహర్ జోషి
తరువాత వారుమీరా కుమార్
పార్లెమెంటు సభ్యుడు, లోక్‌సభ
In office
1985–2009
అంతకు ముందు వారుసారదీష్ రాయ్
తరువాత వారుడా. రాం చంద్ర డోమ్
నియోజకవర్గంబోల్ పూర్ నియోజకవర్గం
In office
1977–1984
అంతకు ముందు వారుఇంద్రజిత్ గుప్తా
తరువాత వారుమమతా బెనర్జీ
నియోజకవర్గంజాదవ్‌పూర్ నియోజకవర్గం
In office
1971–1977
అంతకు ముందు వారుఎన్.సి.ఛటర్జీ
నియోజకవర్గంబుర్దువాన్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1929-07-25)1929 జూలై 25
తేజ్‌పూర్, అసోం, బ్రిటిష్ ఇండియా
మరణం2018 ఆగస్టు 13(2018-08-13) (వయసు 89)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీస్వతంత్ర అభ్యర్థి (2008–2018)
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (1968–2008)
జీవిత భాగస్వామి
రేణూ ఛటర్జీ
(m. 1950)
సంతానం3
తండ్రినిర్మల్ చంద్ర ఛటర్జీ
నివాసంకోల్‌కతా
కళాశాలకలకత్తా విశ్వవిద్యాలయం (బి.ఎ)
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (ఎం.ఎ)
మిడిల్ టెంపుల్ (బారిస్టరు)
నైపుణ్యంన్యాయవాది
సంతకం
వెబ్‌సైట్Biography

విద్య, కుటుంబ నేపథ్యం మార్చు

అతను అసోం లోని తేజ్‌పూర్ లో జన్మించాడు. అతని తండ్రి నిర్మల్ చంద్ర ఛటర్జీ స్వాంతంత్ర్యోద్యమ కాలంలో న్యాయవాది, మేథావి, హిందూ పునరుజ్జీవనవాది, జాతీయవాది. అతని తల్లి బినపాని దేవి గృహిణిగా ఇంటి పనులు చూసుకునేది.[2] నిర్మల్ చంద్ర ఛటర్జీ అఖిల భారతీయ హిందూ మహాసభ వ్యవస్థాపకులలో ఒకనిగా ఉంటూ అధ్యక్షునిగా కూడా పనిచేసాడు. 1948 లో భారతదేశంలో జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించి ఆ పార్టీ నాయకులను అరెస్టు చేసినప్పుడు నిర్మల్ చంద్ర ఛటర్జీ ఆల్ ఇండియా సివిల్ లిబర్టీస్ యూనియన్‌ను ఏర్పాటు చేసి వారి విడుదల కోసం ఆందోళన చేశాడు. ఈ ప్రక్రియలో, ఇద్దరి మధ్య సైద్ధాంతిక రాజకీయ విభేదాలు కొనసాగుతున్నప్పటికీ అతను జ్యోతి బసు కు దగ్గరయ్యాడు. [3][4]

సోమనాథ్ ఛటర్జీ మిత్రా ఇనిస్టిట్యూషన్ స్కూల్, ప్రెసిడెన్సీ కళాశాల, తరువాత కలకత్తాలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడు. అతను కేంబ్రిడ్జ్‌లోని జీసస్ కాలేజీలో చదివాడు. 1952 లో బిఎ, 1957 లో ఎం ఏ డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 2007లో న్యాయశాస్త్రంలో కళాశాల గౌరవ ఫెలోషిప్ పొందాడు. లండన్‌ లోని మిడిల్ టెంపుల్ నుండి న్యాయవాద సంఘంలో చేరి, అతను క్రియాశీల రాజకీయాల్లో చేరడానికి ముందు కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా న్యాయ ప్రాక్టీసు తీసుకున్నాడు. [5] [4]

రాజకీయ జీవితం మార్చు

సోమనాథ్ ఛటర్జీ 1973 నుండి 2008 వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సిపిఐ (ఎం)) లో సభ్యునిగా ఉన్నాడు. 1971 లో తన తండ్రి మరణం కారణంగా జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఆ నియోజకవర్గంలో నామినేట్ అభ్యర్థిగా నామినేట్ అయ్యాడు. అతను 1971 లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. సిపిఐ (ఎం) మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మొదటిసారి ఎన్నికయ్యాడు. 1984 లో జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయినప్పుడు తప్ప, తొమ్మిది సార్లు తిరిగి ఎన్నికయ్యాడు. 1989 నుండి 2004 వరకు లోక్‌సభలో తన పార్టీకి నాయకునిగా వ్యవహరించాడు. సిపిఐ (ఎం) కోటగా పరిగణించబడుతున్న బోల్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 14 వ లోక్‌సభ సభ్యుడిగా 2004 లో పదవ సారి ఎన్నికయ్యాడు. 2004 ఎన్నికల తరువాత, అతను ప్రో టెమ్ స్పీకర్‌గా నియమించబడ్డాడు. తరువాత 2004 జూన్ 4 న 14 వ లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గణేష్ వాసుదేవ్ మాల్వంకర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ ప్రోటెమ్ స్పీకర్ గా చరిత్రలో నిలిచాడు. [6] [7] [8]

సిపిఐ (ఎం) నుండి బహిష్కరణ మార్చు

2008 మధ్యలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నేతృత్వం లోని ప్రభుత్వానికి సిపిఐ తన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ సమయంలో స్పీకరుగా ఉన్న తాను పక్షపాత రహితంగా ఉండవలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్న పార్లమెంటు సభ్యుల జాబితాలో ఛటర్జీ పేరును చేర్చారు. అయినప్పటికీ, ఛటర్జీ 2008 జూలైలో జరిగిన విశ్వాస పరీక్ష కోసం జరిగిన ఓటింగ్ ప్రక్రియలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి తన పార్టీ మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం అంటే మితవాద ప్రతిపక్ష బిజెపితో పాటు కలసి ఓటు వేయడం. [9] పార్టీ సూచనలను విస్మరించి, విశ్వాస ఓటు సమయంలో తాను సమర్థతో వ్యవహరిస్తూ సభలో స్పీకర్‌గా తన పదవిలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. 2008 జూలై 23 న ప్రభుత్వం ఓటింగ్ లో గెలిచి తన మనుగడ సాగించిన తరువాత, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సిపిఐ (ఎం) అతన్ని పార్టీ నుండి బహిష్కరించింది. [10] సిపిఐ (ఎం) పత్రికా ప్రకటనలో, "కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ యొక్క పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమనాథ్ ఛటర్జీని పార్టీ సభ్యత్వం నుండి తక్షణమే బహిష్కరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్టీ యొక్క స్థితిని తీవ్రంగా వివాదం చేసినందుకు పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ XIX, నిబంధన 13 ప్రకారం ఈ చర్య తీసుకోబడింది. " [11] బెంగాల్ కార్యదర్శి బిమాన్ బోస్ మాట్లాడుతూ "చటర్జీ భారత రాజ్యాంగం ప్రకారం వ్యవహరించి ఉండవచ్చు, కాని పార్టీ సభ్యుల విషయంలో పార్టీ రాజ్యాంగం అత్యున్నతమైనది" అని అన్నాడు. [12]

ఛటర్జీ ప్రకారం, బహిష్కరణ అతని జీవితంలో "అత్యంత విచారకరమైన రోజులలో ఒకటి". పక్షపాతరహిత స్థితిని పొందడానికి స్ఫీకర్ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు భవిష్యత్ స్పీకర్లు తమ పార్టీలకు రాజీనామా చేయాలని అతను సూచించాడు. [13] అతని బోల్పూర్ నియోజకవర్గం అప్పటికే షెడ్యూల్డ్ కులాల కోసం కేటాయించబడింది. అంటే వచ్చే ఎన్నికల్లో అతను ఈ సీటులో పోటీ చేయలేకపోయాడు; సిపిఐ (ఎం) నుండి బహిష్కరించబడిన తరువాత అతను 2009 లో వచ్చే ఎన్నికల సమయంలో రాజకీయాల నుండి రిటైర్ అవుతారని ఆగస్టు 2008 లో ప్రకటించాడు. అతనిని తన నియోజకవర్గంలో విస్తృతంగా గౌరవించేవారు. ; సిపిఐ (ఎం) 2009 అభ్యర్థి రామ్‌చంద్ర డోమ్ ఛటర్జీ తన నియోజక వర్గంలో చేసిన పనులను ప్రశంసించి వాటిని కొనసాహిస్తానని శపథం చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి అసిత్ మాల్ మాట్లాడుతూ, బోల్పూర్ ప్రజలు "సి.పి.ఐ (ఎం) తరిమివేయబడిన మార్గంలో[ఛటర్జీ] గాయపడ్డారు." రియు వారి భావాలు ఎన్నికల "ఫలితాల్లో ప్రతిబింబిస్తాయి " అని తెలిపాడు [14]

అవార్డులు, గౌరవాలు మార్చు

1996 లో అతను ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గెలుచుకున్నాడు .

2013 లో, అతను ప్రతిష్టాత్మక భారత్ నిర్మన్ అవార్డులలో లివింగ్ లెజెండ్ అవార్డును అందుకున్నాడు .

వివాదాలు మార్చు

2005 లో, జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన సుప్రీంకోర్టు ఆదేశాలపై అతను చేసిన ప్రకటనతో వివాదంలో చిక్కుకున్నాడు. జార్ఖండ్ అసెంబ్లీ కార్యకలాపాలపై ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా శాసనసభ హక్కులలో సుప్రీంకోర్టు ఆక్రమిస్తోందని అతను అన్నాడు. [15] భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి సూచన కావాలని అతను కోరాడు. ఈ వ్యాఖ్యను సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ విమర్శించింది. [16]

శాంతినికేతన్ శ్రీనికేతన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎస్‌ఎస్‌డిఎ) చైర్మన్‌గా లాభాలతో కూడిన పదవిలో ఉన్నందున అతను రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అతను ఆ కార్యాలయం నుండి లాభం పొందలేదు కాబట్టి ఆ డిమాండ్ నిరాధారమని వాదించాడు. [17]

వ్యక్తిగత జీవితం మార్చు

చటర్జీ 1950 ఫిబ్రవరి 7 న లాల్గోలాలోని జమీందారీ కుటుంబం లోని రేణు ఛటర్జీని వివాహం చేసుకున్నాడు. [3] ఈ దంపతులకు కుమారుడు ప్రతాప్, ఇద్దరు కుమార్తెలు అనురాధ, అనుశిల ఉన్నారు. ప్రతాప్ ఛటర్జీ కలకత్తా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. [4]

సోమనాథ్ ఛటర్జీ ఆర్థిక సమగ్రతకు ప్రసిద్ది చెందాడు. 2004 లో స్పీకరుగా అతను 20 అక్బర్ రోడ్ వద్ద ఉన్న అధికారిక నివాసంలోకి వెళ్ళినప్పుడు, అతను జాతీయ ఖజానా నుండి టాయిలెట్, టీ కోసం చెల్లించే పద్ధతిని నిలిపివేసాడు. [18] విదేశాలకు వెళ్ళేటప్పుడు అతనితో పాటు కుటుంబ సభ్యుల ఖర్చులను తానే భరించాడు.

మరణం మార్చు

2018 ఆగస్టు 13 ఉదయం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఛటర్జీ మరణించాడు. ఉబ్బసం, మధుమేహ వ్యాధిగ్రస్తుడైన అతను గత మూడేళ్ల నుండి వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో ఉన్నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అతను కొన్ని సందర్భాల్లో ఆసుపత్రి పాలయ్యాడు. 2008 లో సిపిఐ (ఎం) నుండి బహిష్కరించబడటం, 2017 చివరిలో అతని కుమార్తె అనురాధ మరణం అతనిని కృంగదీసాయి. జూన్‌లో అతను గుండెపోటుతో బాధపడ్డాడు. తరువాతి వారాలలో అతని పరిస్థితి క్షీణించింది. [5] అతని అంత్యక్రియలను విడిచిపెట్టమని అతని కుటుంబం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను కోరింది. అతని మృతదేహాన్ని పార్టీ జెండాతో కప్పడానికి అనుమతించ లేదు. [19] [8] [20]

మూలాలు మార్చు

  1. "Somnath Chatterjee, former Lok Sabha Speaker, dies at 89". The Times of India. 13 August 2018. Retrieved 13 August 2018.
  2. "Archived copy". Archived from the original on 2008-09-16. Retrieved 2008-09-06.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. 3.0 3.1 "Latest News, Breaking News Live, Current Headlines, India News Online - The Indian Express".
  4. 4.0 4.1 4.2 "Former Lok Sabha Speaker and veteran Communist leader Somnath Chatterjee passes away at the age of 89". Retrieved 14 August 2018.
  5. 5.0 5.1 "Somnath Chatterjee, former Lok Sabha Speaker, dies at 89". Santanu Chowdhury. Indian Express. 13 August 2018. Retrieved 14 August 2018.
  6. "Only Mamata Banerjee could defeat Somnath Chatterjee". Prabhash K Dutta. India Today. 13 August 2018. Retrieved 14 August 2018.
  7. "Comrades' (unsung) gain was court's loss". Telegraph India. 14 August 2018. Retrieved 14 August 2018.
  8. 8.0 8.1 "Somnath Chatterjee, 89, dies, kin shuns CPM's condolence". Asian Age. 14 August 2018. Retrieved 14 August 2018.
  9. "Speaker adamant, may quit both House and party" Archived 2009-03-04 at the Wayback Machine, Hindustan Times, 17 July 2008.
  10. "Somnath pays price for violating party line" Archived 7 అక్టోబరు 2008 at the Wayback Machine, IANS (headlinesindia.com), 23 July 2008.
  11. "CPI-M fails to pull down Govt, sacks Somnath". CNN IBN. 23 July 2008. Retrieved 2008-07-23.
  12. "The Telegraph". Archived from the original on 2018-08-16. Retrieved 2020-06-04.
  13. Santosh H K Narayan, "No taker of Speaker's suggestion" Archived 7 అక్టోబరు 2008 at the Wayback Machine, headlinesindia.com, 1 August 2008.
  14. Sirshendu Panth, "Retired Somnath Chatterjee omnipresent in old constituency" Archived 2019-02-09 at the Wayback Machine, IANS (thaindian.com), 3 April 2009.
  15. "The Conscientious Marxist" Tehelka Retrieved 2008-08-18
  16. Speaker to seek Kalam’s view on SC order, The Tribune India, 10 March 2006. Accessed 27 September 2006.
  17. Not holding any office of profit, says Somnath Archived 2006-09-13 at the Wayback Machine, The Hindu, 25 March 2006. Accessed 27 September 2006.
  18. "Somnath Chatterjee: House arrest".
  19. "Somnath Chatterjee's family rebuffs CPI(M) request". Soumya Das. The Hindu. 13 August 2018. Retrieved 14 August 2018.
  20. Verma, Rupal. "Somnath Chatterjee passes away: Some lesser known facts about former Lok Sabha Speaker" Archived 2020-03-22 at the Wayback Machine, 'DBPOST. 13 August 2018. Archived from the original on 13 August 2018. Retrieved on 13 August 2018.

బాహ్య లింకులు మార్చు

  Media related to సోమనాథ్ ఛటర్జీ at Wikimedia Commons