సోలార్ సునామి సూర్యుని వల్ల వచ్చే తుఫాను[1] వలన ఏర్పడుతుంది. సూర్యుడి ఉపరితలం నుండి వచ్చే ఉధృతమైన అయస్కాంత తరంగాల మేఘానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు సోలార్‌ సునామి. యిది 2010 ఆగస్టు 3వ తేదీన భూమిని తాకింది. ఇది రష్యా, అమెరికా, న్యూజి ల్యాండ్‌ తదితర దేశాల్లో కనిపించింది, కనువిందు చేసింది. పేరుకు తగ్గట్టు భయపెట్టలేదు, భీతిల్ల చేయలేదు. పైగా కమనీయంగా, రమణీయంగా అగుపించి రంజింపచేసింది. ఎర్రటి, ఆకుపచ్చటి రంగు ల్లో అత్యద్భుతమైన వర్ణచిత్రాన్ని తలపించింది.[2]

సోలార్ సునామి

మారిటన్ తరంగాలు మార్చు

సోలార్ సునామీ సూర్య మంటల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. వాటిని "మోరిటన్ తరంగాలు" అనికూడా అంటారు. ఈ తరంగాలకు అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త అయిన "గైల్ మారిటన్" పేరును పెట్టారు. ఆయన 1959 లో బర్బాంక్, కాలిఫోర్నియా లోని "లాక్‌హీడ్ మార్టిన్ సోలార్ అండ్ అస్ట్రోఫిజిక్స్ లాబొరేటరీ" నుండి సూర్యుడిని పరిశీలించి తరంగాల ఉనికినికనుగొన్నాడు[3][4][5]. ఆయన సూర్యుని లోని బల్మర్ శ్రేణిలోని క్రోమోస్ఫోర్ ను టైమ్‌లాప్స్ ఫొటోగ్రఫీ సహాయంతో కనుగొన్నాడు.

పరిశీలనలు మార్చు

అనేక దశాబ్దాలుగా వీటి గూర్చి అధ్యయనం నిరంతరం జరుగుతూ ఉంది. 1995 లో "సోలార్, హీలియోస్ఫెరిక్ అబ్సర్వేటరీ"ని ప్రారంభించడం ఈ కరోనల్ తరంగాలను పరిశీలించుటకు దోహదపడింది.ఈ తరంగాలు మార్టిన్ తరంగాల మూలంగా యేర్పడతాయని తెలిసింది. తర్వాత మార్టిన్ తరంగాల అధ్యనాంశంగా మరల ప్రారంభింపబడింది. (SOHO యొక్క "ఎక్స్‌ట్రీం అల్ట్రా వైలట్ ఇమాజింగ్ టెలిస్కోప్" అనే పరికరం వైవిధ్యమైన వేరొక తరంగం "ఇ.ఐ.టి తరంగం ను ఆవిష్కరించింది.)[6] . ఈ మారిటన్ తరంగాల యధార్థతను రెండు స్టీరియో అంతరిక్ష నౌక నిర్ధారించింది. అవి ఫిబ్రవరి 2009 లో 100,00 కి.మీ ల అధిక వేగంతో గల వేడి ప్లాస్మా, అయస్కాంతం కలిగిన తరంగం 250 కి.మీ/సెకండు వేగంతో ఒక పెద్ద కరోనల్ మాస్ ఎజెక్షన్ తో కలిసి సంయుక్తంగా కదులుతున్నట్లు గమనించారు[7][8].

వీటి వేగం మార్చు

ఈ మారిటన్ తరంగాలు 500 - 1500 కి.మీ /సెకను వేగంతో కదులుతాయి. "యుతక యుచిడా" అనే శాస్త్రవేత్త ఈ మారిటన్ తరంగాలు సూర్యుని యొక్క కరోనాలో అధిక శక్తి షాక్ తరంగాలుగా ప్రయాణిస్తుంటాయని విశదీకరించాడు[9] . ఈయన ఈ తరంగాలను సూర్యునిలోని కరోనా ద్రవ్యరాశి ఎజక్షన్ ఆక్సెలరేట్ షాక్స్ ఫలితంగా వెలువడిన రేడియో తరంగాలైన రెండవ శ్రేణి రేడియో బరస్ట్స్ తరంగాలతో కలిపారు[10] మార్టిన్ తరంగాలు ప్రాథమికంగా సూర్యునిలోని బ్యాండ్ లో పరిశీంచవచ్చు[11]

సోలార్ మినిమమ్ మార్చు

సూర్యుడు నిరంతరం జ్వలిస్తూ వుండే అగ్నిగోళం. అయితే ఆ మంటలు ఎప్పుడూ వుండేవే అయినా, కొన్ని సార్లు నిద్రాణంగా వుంటే కొన్నిసార్లు మరీ ఉధృతంగా కెరటాలను తలపిస్తూ ఎగసిపడ్తాయి. సూర్యుడు తక్కువ చైతన్యంతో కొంత నిద్రాణంగా కనిపించే దశను సోలార్‌ మినిమమ్‌అని, మహోజ్జ్వలంగా మండే దశను సోలార్‌ మాగ్జిమమ్‌అని పిలుస్తారు. కాలప్రవాహంలో ఈ రెండు దశలు ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వచ్చివెళ్తాయి. సూర్యుడిలో కనిపించే ఈ మార్పును ఏళ్ళ తరబడి ఖగోళ శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. శాటిలైట్లు పంపే చిత్రాలద్వారా మరింత లోతుగా, నిశితంగా గమనిస్తున్నారు.

సామాన్యంగా పదకొండేళ్ళకు ఒకసారి దశ మారుతుందని సైంటిస్టులు గమనించారు. కానీ, ఈసారి సూర్యుడు సోలార్‌ మినిమమ్‌ దశ దాటి 16 నెలలు దాటినా సోలార్‌ మాగ్జిమమ్‌ దశలోనే వుండిపోయాడు. ఎందుకిలా జరిగిందని ఖగోళ శాస్త్రజ్ఞులు అధ్యయనం చేస్తున్నారు. సూర్యుడు ఎన్నాళ్ళిలా నిద్రావస్తలో వుంటా డు, దీని పరిణామం ఎలా వుంటుందని ఆందోళనగా వుంది అంటూ వ్యాఖ్యానించారు హార్వర్డ్‌ స్మిత్సోనియన్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ సెంటర్‌ పరిశోధకుడు లియోన్‌ గ్లౌబ్‌. సోలార్‌ పవర్‌ ఎంత ముఖ్యమో, ఎంత అత్యవసరమో తెలిసిన సైంటిస్టులు ఆందోళన చెందడంలో అర్థముంది. క్రూడ్‌ ఆయిల్‌ నుండి వచ్చే పెట్రోలు, గ్యాసు తదితరాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి గనుక శాస్త్రవేత్తలు సోలార్‌ ఎనర్జీమీద ఎంతో కృషి చేస్తున్నారు. కంప్యూటర్లు, క్యాలిక్యులేటర్లే కాదు ఆఖరికి సౌరశక్తితో పనిచేసే విమానాన్ని కూడా కనిపెట్టి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో మంటల ఉధృతి తగ్గడం శాస్త్రవేత్తలను కల్లోలపరిచింది.

సౌర తుఫాను మార్చు

సౌర తుఫాను అనగా సూర్యుడిపై ఏర్పడే విద్యుత్‌ తరంగం. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. సూర్యమండలపు ఉపరితలం నుండి వచ్చే అయస్కాంత తరంగాలు భూమిని తాకడం చాలా అరుదు. ఈ ఖగోళ పరిణామంపై విస్తృత పరిశోధనలు జరగాల్సివుంది. ఈ సునామీ కారణంగా సూర్యుడినుండి విద్యుత్‌ అయస్కాంత కణాలతో కూడిన విపరీతమైన ఆకర్షణ శక్తి ఉన్న అయస్కాంత సెగల మబ్బు అంతరిక్షంలో కొన్ని కోట్ల మైళ్ళ దూరం ప్రయాణించి భూమికి చేరువౌతోందని శాస్త్రవేత్తలు భావించారు. దీనికి ఫాస్ట్‌ మోడ్‌ మాగ్నెటో హైడ్రోడైనమికల్‌ వేవ్‌ అనేది సాంకేతిక నామం. సంక్షిప్తంగా ఎం.హెచ్.డి. తరంగం అంటారు. దీన్ని మొరెటన్‌ వేవ్‌ అని కూడా పిలుస్తారు.

సూర్యమండలం మధ్యభాగంలో వృత్తా కారంలో భూమి కంటే ఎత్తుగా విద్యుదావేశ తరంగాలు బయల్దేరి వేగంగా లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించాయి. గంటకు పది లక్షల మైళ్ళ వేగంతో దూసుకొస్తున్న సౌర సునామీకి దారితీసిన సౌర విస్ఫోటన పరిణామాన్ని నాసా లోని సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ, ఇంకా ఇతర ఉపగ్రహాలు నిశితంగా పరిశీలించాయి. భూమిచుట్టూ తిరిగే ఉప గ్రహాలపై, భూమిపైనున్న విద్యుత్‌లైన్లు, గ్యాస్‌ పైపులపై దాని ప్రభావం వుంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించినప్పటికీ అలాంటివేమీ చోటుచేసుకోలేదు.

భూమితో పోలిస్తే సూర్యమండలం చాలా పెద్దది. అది మొత్తంగా మండే గోళమే అయినప్పటికీ, అక్కడక్కడా ఉధృతమైన మంటలు లేస్తుంటాయి. వీటిని సన్‌ స్పాట్‌ అని పిలుస్తారు. ఇవే మనకు మచ్చల్లా కనిపిస్తాయి. ఈ సన్‌ స్పాట్‌లు స్థిరంగా వుండవు. మంటలు ఎగసిపడ్తూ, సమసిపోతూ వుంటాయి. ఇప్పుడు తాజాగా, భూమికి ఎదురుగా ఒక సన్‌ స్పాట్‌ ఏర్పడింది. దీనికి 'సన్‌ స్పాట్‌ 1092' అని సైంటిస్టులు నామకరణం చేశారు. ఇప్పుడు ఈ సన్‌ స్పాట్‌ నుండి విద్యుదావేశిత కణాలు మేఘంలా ఏర్పడి భూమ్మీదకు బయల్దేరాయి.

1997 మే నెలలో సోలార్‌ అండ్‌ హెలియో స్పెరిక్‌ అబ్జర్వేటరీ (ఎస్‌.ఓ.హెచ్‌.ఓ.) తొలిసారిగా ఈ సోలార్‌ సునామీని కనుగొంది. అదే సంవత్సరం కొరోనల్‌ మాస్‌ ఇజెక్షన్‌ (సి.ఎం.ఇ.) సూర్యుడి ఉపరితలంపై పేలడం మొదలెట్టాయి. ఆ పేలిన ప్రదేశంనుండి తరంగాల మేఘం బయల్దేరినట్లు ఎస్‌.ఓ.హెచ్‌.ఓ. నమోదు చేసింది కానీ, నిశితంగా పరిశీలించడానికి దాని శక్తి సరిపోలేదు. ఇక ఈ విషయమై శాస్త్రవేత్తల్లో అనేక ప్రశ్నలు, సందేహాలు తలె త్తాయి. నాసా సోలార్‌ టెర్రెస్ట్రియల్‌ రిలేషన్స్‌ అబ్జర్వేటరీ (ఎస్‌.టి.ఇ.ఆర్‌.ఇ.ఓ) వెలసి శోధన మొదలుపెట్టింది.

ఈ శక్తివంతమైన సోలార్‌ సునామీలను నిజానికి ఎన్నో ఏళ్ళ క్రితమే గమనించారు. కాకపోతే వాటిని కంటితో చూడలేకపోవడాని స్థిరమైన అభిప్రాయానికి రాలేకపోయారు. ఇప్పుడు మాత్రం శాస్త్రవేత్తలు వాటిని నిర్ధారించారు. తొలిసారి సైంటిస్టులు ఇవి సూర్యమండలంపైనుండి వస్తున్నాయని నమ్మలేకపోయారు. వాటిల్లో కొన్ని భూమి కంటే ఎత్తుగా, వృత్తాకారంలో లక్షల మైళ్ళకు విస్తరించి, భయంకరమైన డ్రాకులా ఆకారాలను పోలి ఉన్నాయి. తొలుత ఇవి నీడలేమోనని కూడా భావించారు. కానీ, ఇప్పుడు అవి నీడలు కావని తేల్చిన నాసా, తాజాగా సోలార్‌ సునామీ వీడియోను విడుదల చేసింది.

సూర్యుడిపై సంభవించే పేలుళ్ళను సన్‌ స్పాట్‌లు అంటారు. ఇవి స్థిరంగా వుండవు. ఎక్కువతక్కువలుంటాయి. ఈమధ్యకాలంలో ఈ పేలుళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాబోయే మూడేళ్ళలో మరింత పెరిగి 2013 నాటికి గరిష్ఠ స్థాయికి చేరొచ్చని అంచనా. ఈ పేలుళ్ళవల్ల విద్యుత్‌ ప్రవహించే కణాలు లక్షల కిలోమీటర్ల దూరం వరకు ఎగజిమ్ముతాయి. ఆ విపరీతమైన వేడిమికి అయాన్లు భూమ్యాకర్షణశక్తివల్ల ఇటువైపు ప్రయాణిస్తాయి. నిజానికి ఫిబ్రవరి నెలలోనే సన్‌ స్పాట్‌ 11012 ఏర్పడినప్పుడు, ఎస్‌.టి.ఈ.ఆర్‌.ఈ.ఓ. స్పేస్‌ క్రాఫ్ట్‌ చిత్రాలతో సహా ఈ సౌర సునామీని నిర్ధారించింది. ఆ విస్ఫోటనంతో కోట్ల టన్నుల గ్యాస్‌ విడుదలైంది. అది సౌర సునామీగా బయల్దేరింది. ఈ కెరటాలు 90 డిగ్రీల దగ్గర రెండు ఆకృతుల్లోకి విడిపోయినట్టు కూడా రికార్డయింది. వర్జీనియాలోని జార్జ్‌ మాసన్‌ యూనివర్సిటీకి చెందిన స్పిరస్‌ పాట్సోరాకోస్‌ ఇది నీటి మేఘం కాదు, విద్యత్తు, ఆకర్షణ శక్తి కలిగిన మహా శక్తివంతమైన కెరటం అంటూ వ్యాఖ్యానించారు.

సన్‌ స్పాట్‌ నుండి బయల్దేరిన సోలార్‌ సునామీ భూ ఆవరణలోకి ప్రవేశించినందున భూ అయస్కాంత స్థితిలో పెనుమార్పు జరిగి పెద్ద కుదుపు సంభవించింది. ఆ స్థితి 12 గంటలపాటు నిలిచింది. సైంటిస్టులు ముందే చెప్పినట్టు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదు. శాటిలైట్లను, ప్రసార సాధనాలను కొంత కల్లోలపరిచే అవకాశముందని శాస్త్రవేత్తలు ఊహించి నప్పటికీ అలాంటి ఘటనలు కూడా వాటిల్లలేదు. ఉత్తరార్థగోళంలోని ప్రజలకు పచ్చని, ఎర్రని మేఘాలను పోలిన రంగురంగుల కాంతులు కనిపించి కనువిందు చేశాయి. రష్యా, అమెరికా, న్యూజిల్యాండ్‌ తదితర దేశస్తులు వీటిని కుతూహలంగా గమనించారు. మొత్తానికి సోలార్‌ సునామీవల్ల ఎవరికీ, ఎలాంటి హాని లేదని రుజువైంది. కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌గా పిలిచే ఈ విస్ఫోటనం ఏర్పడటం, అది భూమి దిశగా రావడం చాలా చాలా అరుదు. కనుకనే ఖగోళ శాస్త్రవేత్తలు సౌర సునీమీ కోసం వేయి కళ్ళతో నిరీక్షించారు. దాన్ని పరిశీలించి మరిన్ని కీలకమైన విషయాలు కనిపెట్టే ప్రయత్నాల్లో మునిగితేలారు. సోలార్‌ సునామీ గురించి మరింత లోతుగా అధ్యయనం చేసే పనిలో ఉన్నారు.

మూలాలు మార్చు

  1. Phillips, Tony (November 24, 2009). "Monster Waves on the Sun are Real". NASA. Archived from the original on 5 మే 2021. Retrieved 16 July 2010.
  2. ఆంధ్ర ప్రభలో వ్యాసం[permanent dead link]
  3. Moreton, G. E. (1960). "Hα Observations of Flare-Initiated Disturbances with Velocities ~1000 km/sec". Astronomical Journal. 65: 494. Bibcode:1960AJ.....65U.494M. doi:10.1086/108346.
  4. Moreton, G. E.; Ramsey, H. E. (1960). "Recent Observations of Dynamical Phenomena Associated with Solar Flares". Publications of the Astronomical Society of the Pacific. 72 (428): 357. Bibcode:1960PASP...72..357M. doi:10.1086/127549.
  5. Athay, R. Grant; Moreton, Gail E. (1961). "Impulsive Phenomena of the Solar Atmosphere. I. Some Optical Events Associated with Flares Showing Explosive Phase". Astrophysical Journal. 133: 935. Bibcode:1961ApJ...133..935A. doi:10.1086/147098.
  6. Chen, P. F.; Wu, S. T.; Shibata, K.; Fang, C. (2002). "Moreton waves and coronal waves". The Astrophysical Journal. 572: L99–L102. Bibcode:2002ApJ...572L..99C. doi:10.1086/341486.
  7. Atkins, William (26 November 2009). "STEREO spacecraft finds gigantic tsunami on Sun". iTWire. Retrieved 16 July 2010.
  8. JPL/NASA (November 19, 2009). "Mystery of the Solar Tsunami -- Solved". PhysOrg.com. Retrieved 16 July 2010.
  9. Sakurai, Takashi (3 September 2002). "SolarNews Newsletter". Solar Physics Division, American Astronomical Society. Archived from the original on 27 ఆగస్టు 2011. Retrieved 15 June 2011.
  10. Layton, Laura (May 15, 2009). "STEREO Spies First Major Activity of Solar Cycle 24". NASA. Archived from the original on 16 ఏప్రిల్ 2011. Retrieved 15 June 2011.
  11. Narukage, N.; Shigeru; Kadota, Miwako; Kitai, Reizaburo; Kurokawa, Hiroki; Shibata, Kazunari (2004). "Moreton waves observed at Hida Observatory" (PDF). Proceedings IAU Symposium. 2004 (223): 367–370. doi:10.1017/S1743921304006143. Retrieved 2006-12-11.

యితర లింకులు మార్చు