సౌ పౌలో (São Paulo) (పోర్చుగీసులో సెయింట్ పాల్ అని అర్థం) బ్రెజిల్ దేశం ఆగ్నేయ దిక్కున ఉన్న ఒక మునిసిపాలిటీ. ఇది బ్రెజిల్ లోనూ, అమెరికాస్ లోనూ, దక్షిణ, పశ్చిమార్ధ గోళాల్లోనూ అత్యంత జనసమ్మర్ధం కలిగిన నగరం. ప్రపంచంలోనే పోర్చుగీసు భాష అత్యధిక సంఖ్యలో మాట్లాడే ప్రజలున్న నగరం కూడా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో సౌ పౌలోది నాలుగో స్థానం. ఈ నగరాన్ని ఆవరించి ఉన్న సౌ పౌలో రాష్ట్రానికిది ముఖ్య పట్టణం. ఈ రాష్ట్రం బ్రెజిల్ దేశంలో అత్యంత సంపన్నమైన నగరం. ఇది వాణిజ్యం, ఆర్థిక, కళలు, వినోదాలలో బలమైన అంతర్జాతీయ ప్రభావాలను చూపుతుంది.[6] సెయింట్ పాల్ ఆఫ్ టార్సర్ గౌరవార్థం ఈ నగరానికి ఈ పేరు పెట్టారు. దీని మెట్రోపాలిటన్ నగరమైన గ్రేటర్ సౌ పౌలో బ్రెజిల్ అత్యధిక జనాభా కలిగిన ప్రదేశం, ఇంకా ప్రపంచంలో 12 వ స్థానంలో ఉంది.

సౌ పౌలో
Município de São Paulo
మున్సిపాలిటీ ఆఫ్ సౌ పౌలో
Ponte estaiada Octavio Frias - Sao Paulo
Flag of సౌ పౌలో
Coat of arms of సౌ పౌలో
Nickname(s): 
Terra da Garoa (Land of Drizzle); Sampa; "Pauliceia"
Motto(s): 
"Non ducor, duco"  (Latin)
"I am not led, I lead"
సౌ పౌలో మ్యాప్
సౌ పౌలో మ్యాప్
Coordinates: 23°33′S 46°38′W / 23.550°S 46.633°W / -23.550; -46.633
Country Brazil
State São Paulo
Founded25 జనవరి 1554; 470 సంవత్సరాల క్రితం (1554-01-25)
Founded byమాన్యువల్ డా నెబ్రేగా, జోసెఫ్ ఆఫ్ అంచియేట
Named forపౌల్ థ అపోస్టల్
Government
 • TypeMayor–council
 • BodyMunicipal Chamber of São Paulo
 • MayorBruno Covas[1] (PSDB)
 • Vice MayorRicardo Nunes (MDB)
Area
 • మహానగరం1,521.11 km2 (587.3039 sq mi)
 • Urban
11,698 km2 (4,517 sq mi)
 • Metro
7,946.96 km2 (3,068.338 sq mi)
 • Macrometropolis53,369.61 km2 (20,606.12 sq mi)
Elevation
760 మీ (2,493.4 అ.)
Population
 (2020)[3][4]
1,23,25,232
 • Rank1st in Brazil
 • Density8,005.25/km2 (20,733.5/sq mi)
 • Metro
2,15,71,281[2] (Greater São Paulo)
 • Metro density2,714.45/km2 (7,030.4/sq mi)
 • Macrometropolis
3,36,52,991[5]
DemonymPortuguese: paulistano
Time zoneUTC−03:00 (BRT)
Postal Code (CEP)
01000-000
Area code+55 11

లాటిన్ అమెరికాలోనూ, దక్షిణార్ధగోళం లోనూ జిడిపి ప్రకారం అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగిన[7] ఈ నగరంలో సౌ పౌలో స్టాక్ ఎక్స్‌చేంజ్ ఉంది.

ఈ మహానగరం బ్రెజిల్‌లోని ఎత్తైన ఆకాశహర్మ్యాలకు నిలయంగా ఉంది, వీటిలో మిరాంటే డో వేల్, ఎడిఫాసియో ఇటాలియా, బానెస్పా, నార్త్ టవర్ అనేక ఇతర కట్టడాలు ఉన్నాయి. ఈ నగరం జాతీయంగా ,అంతర్జాతీయంగా సాంస్కృతిక ఆర్థిక ఇంకా రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉంది. లాటిన్ అమెరికన్ మెమోరియల్, ఇబిరాపురా పార్క్, మ్యూజియం ఆఫ్ ఇపిరంగ, సౌ పౌలో మ్యూజియం ఆఫ్ ఆర్ట్ , పోర్చుగీస్ లాంగ్వేజ్ మ్యూజియం వంటి స్మారక చిహ్నాలు, ఉద్యానవనాలు అలాగే మ్యూజియంలకు ఇది నిలయం. సౌ పౌలో నగరంలో సౌ పౌలో జాజ్ ఫెస్టివల్, సౌ పౌలో ఆర్ట్ బియెనియల్, బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్, సౌ పౌలో ఫ్యాషన్ వీక్, ఎటిపి బ్రసిల్ ఓపెన్, బ్రసిల్ గేమ్ షో , కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్ వంటి కార్యక్రమాలు జరుగుతాయి . సౌ పౌలో గే ప్రైడ్ పరేడ్ ప్రపంచంలోనే అతిపెద్ద గే ప్రైడ్ పరేడ్ .[8]

ఆర్థిక వ్యవస్థ మార్చు

సౌ పౌలో దక్షిణ అమెరికాలో ఆర్థిక పరంగా అతిపెద్ద నగరం, ఇది జిడిపి పరంగా ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది , 2025 లో ఇది ఆరవ అతిపెద్ద ఆర్థిక నగరంగా ఆవిర్భవిస్తుందని భావిస్తున్నారు.[9]

పర్యాటకం మార్చు

సౌ పౌలో వినోద పర్యాటకం కంటే వ్యాపార పర్యాటక రంగం ద్వారా గుర్తించబడిన నగరంగా నిలుస్తుంది.

మ్యూజియం ఆఫ్ ఆర్ట్ మార్చు

సౌ పౌలో మ్యూజియం ఆఫ్ ఆర్ట్, స్థానికంగా MASP గా పిలువబడుతుంది, ఇది 1968 లో  ప్రారంభించబడింది, ఇది లాటిన్ అమెరికాలో పాశ్చాత్య కళల  అత్యంత ప్రాతినిధ్య  సమగ్ర సేకరణను కలిగి ఉంది.  ఆధునిక  - రెనోయిర్, వాన్ గోహ్, మాటిస్సే, మానెట్, డెబ్రేట్, పికాసో, మిరో,  డెగాస్ చేత 73 కాంస్య శిల్పకళా రచనలను మీరు ఇక్కడ చూడవొచ్చు.  బ్రెజిలియన్-ఇటాలియన్ ఆర్కిటెక్ట్ లీనా బో బార్డి రూపొందించిన ఈ భవనం ఆధునికవాదానికి నిదర్శనంగా నిలిచింది.[10]

మూలాలు మార్చు

  1. "Doria resign post and Bruno Covas is the new mayor of São Paulo". Folha de S. Paulo. 2018-04-06. Archived from the original on April 6, 2018. Retrieved April 6, 2018.
  2. S.A, Empresa Paulista de Planejamento Metropolitano. "Região Metropolitana de São Paulo". EMPLASA. Archived from the original on January 3, 2017. Retrieved January 3, 2017.
  3. "São Paulo, São Paulo § informações completas" (in పోర్చుగీస్). ibge.gov.br. Archived from the original on September 21, 2018. Retrieved January 2, 2020.
  4. "Sobre a RMSP" (in పోర్చుగీస్). Emplasa. Archived from the original on January 3, 2017. Retrieved January 1, 2017.
  5. S.A, Empresa Paulista de Planejamento Metropolitano. "Macrometrópole Paulista". EMPLASA (in బ్రెజీలియన్ పోర్చుగీస్). Archived from the original on October 12, 2019. Retrieved 12 October 2019.
  6. "The World According to GaWC 2010". Lboro.ac.uk. సెప్టెంబరు 14, 2011. Archived from the original on October 10, 2013. Retrieved December 1, 2012.
  7. "Latin American cities Ranking by GPD" (PDF) (in స్పానిష్). Archived from the original (PDF) on జనవరి 19, 2017. Retrieved జనవరి 4, 2019.
  8. "The World's Biggest LGBTQ Pride Celebrations". AFAR (in ఇంగ్లీష్). Retrieved 2021-03-04.
  9. "São Paulo será 6ª cidade mais rica do mundo até 2025, diz ranking". BBC News Brasil (in బ్రెజీలియన్ పోర్చుగీస్). 2009-11-09. Retrieved 2021-03-04.
  10. "AD Classics: São Paulo Museum of Art (MASP) / Lina Bo Bardi". ArchDaily (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-10-28. Retrieved 2021-03-04.
"https://te.wikipedia.org/w/index.php?title=సౌ_పౌలో&oldid=3176010" నుండి వెలికితీశారు