స్రవంతి రవికిషోర్

సినీ నిర్మాత

స్రవంతి రవికిషోర్ తెలుగు సినీ నిర్మాత.[1] స్రవంతి మూవీస్ అనే సంస్థ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. రవికిషోర్ 1986లో తన మిత్రులతో కలిసి మొదటి సారిగా లేడీస్ టైలర్ అనే చిత్రాన్ని నిర్మించాడు. వంశీ, ఎస్. వి. కృష్ణారెడ్డి, కె. విజయభాస్కర్, త్రివిక్రం శ్రీనివాస్, ఎ. కరుణాకరన్ లాంటి దర్శకులతో దాదాపు 30కి పైగా సినిమాలు నిర్మించాడు. ఓ జ్యోతిష్యుడి సలహా మేరకు తన సంస్థ పేరును చంద్ర కిరణ్ మూవీస్ గా మార్చాడు.

స్రవంతి రవికిషోర్
వృత్తిసినీ నిర్మాత

వ్యక్తిగత జీవితం మార్చు

ఆయన వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. విజయవాడలో పని చేస్తుండేవాడు.[2] గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన వ్యాపారం చేసేవాడు. మొదట్లో ఆయనకు సినిమాల మీద అంతగా ఆసక్తి ఉండేది కాదు. తర్వాత స్నేహితుల సలహా మేరకు సినీ నిర్మాణ రంగంలో ప్రవేశించాడు. మొదట్లో దాన్ని ఆయన పూర్తి వ్యాపార ధృక్పథంతో ఆలోచించినా నెమ్మదిగా సినిమాల మీద ఆసక్తి పెరిగింది. మంచి సినిమాలు తీయాలనే తపన కలిగింది.

సినిమాలు మార్చు

ఆయన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన స్రవంతి అనే నవల చదివి ఆ స్ఫూర్తితో తన నిర్మాణ సంస్థకు స్రవంతి మూవీస్ అనే పేరు పెట్టాడు. తర్వాత ఓ జ్యోతిష సిద్ధాంతి సలహా మేరకు ఆ సంస్థ పేరు చంద్ర కిరణ్ మూవీస్ గా మార్చాడు. మొదట్లో దర్శకుడు వంశీతో మిత్రులు తమ్ముడు సత్యం, సాయిబాబా తో కలిసి 1986 లో లేడీస్ టైలర్ చిత్రాన్ని నిర్మించారు. తర్వాత మహర్షి, కనకమహాలక్ష్మి డాంస్ ట్రూప్, లింగబాబు లవ్ స్టోరీ లాంటి సినిమాలకు పనిచేశాడు. తరువాత ఎస్. వి. కృష్ణారెడ్డితో కలిసి మూడు సినిమాలు చేశాడు. తర్వాత కె. విజయభాస్కర్ తో కలిసి రెండు సినిమాలు చేశాడు.

నువ్వే కావాలి సినిమా కోసం మలయాళం నుంచి హక్కులు కొని అప్పటి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో దాన్ని ఉషాకిరణ్ మూవీస్ ఆద్వర్యంలో నిర్మించాడు.[2] ఆ సినిమా మంచి విజయం సాధించింది.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కోటి, సుచిత్ర చంద్రబోస్, శ్రీకర్ ప్రసాద్ లాంటి సాంకేతిక నిపుణులతో ఎక్కువగా పనిచేశాడు.

పాక్షిక జాబితా మార్చు

మూలాలు మార్చు

  1. "ఐడిల్ బ్రెయిన్ లో స్రవంతి రవికిషోర్ తో ముఖాముఖి". idlebrain.com. జీవి. Archived from the original on 19 October 2016. Retrieved 9 November 2016.
  2. 2.0 2.1 ఎల్, వేణుగోపాల్. "స్రవంతి రవికిషోర్ ముఖాముఖి". telugucinemacharitra.com. సినీగోయెర్. Retrieved 28 November 2016.[permanent dead link]

బయటి లింకులు మార్చు