స్వాతి,1984 విడుదల . శ్రీ క్రాంతి చిత్ర పతాకంపై నిర్మాత,దర్శకుడు , క్రాంతి కుమార్ దర్శకత్వంలో భానుచందర్, సుహాసిని , జగ్గయ్య, శారద ముఖ్యపాత్రలు పోషించగా , చక్కటి కుటుంబ కథా చిత్రంగా , నంది అవార్డులు పొందిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు.

స్వాతి
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం ‌క్రాంతి కుమార్
తారాగణం భాను చందర్ ,
సుహాసిని,
జగ్గయ్య,
శారద,
శరత్ బాబు,
ముచ్చెర్ల అరుణ,
రాజేంద్ర ప్రసాద్,
రమాప్రభ,
సంయుక్త,
శుభలేఖ సుధాకర్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ క్రాంతి చిత్ర
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రెండు తరాల కథ. సమాజములో స్త్రీ సంఘర్షణకు ప్రతిరూపము.


1984 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్రధమ చిత్రంగా బంగారు నంది అవార్డు ప్రకటించింది.

ఉత్తమ నటి , సుహాసిని , నంది అవార్డు.

కథ మార్చు

శారద (శారద) ఒక యువకుడిని (శరత్ బాబు) ప్రేమించి, పెళ్ళి చేసుకోవటానికి ఇల్లు వదిలి అతనితో వచ్చేస్తుంది. అతను పెళ్ళి సామాను తేవటానికి బయటికి వెళ్ళినప్పుడు, అతని స్నేహితులు ఆమెని బలాత్కారం చేస్తారు. అతను తిరిగిరాడు. గర్భవతి అయిన శారద, ఆ బిడ్డని కనడానికి నిశ్చయించుకుంటుంది. ఆడపిల్ల పుట్టగా, ఆ పాపకి స్వాతి (సుహాసిని) అని నామకరణము చేస్తుంది.

పెరిగి పెద్దదయిన స్వాతి ఒక విభిన్న మనస్కురాలిగా వుంటుంది. మాట పడడానికి ఒప్పుకోదు. ఒక్కొసారి ఇంటి దాక పెద్ద గొడవ అయ్యి వస్తాయి. శారద డా.రాజేంద్ర (జగ్గయ్య) దగ్గర నర్స్ గా పనిచేస్తూవుంటుంది. రాజేంద్రకి భార్య చనిపోతుంది, ఒక వయస్సు వచ్చిన కూతురు (సంయుక్త) ఉంది.

తారాగణము మార్చు

భానుచందర్

సుహాసిని

రాజేంద్ర ప్రసాద్

శుభలేఖ సుధాకర్

జగ్గయ్య

శారద

శరత్ బాబు

రమాప్రభ

సంయుక్త

ముచ్చర్ల అరుణ

పాటలు మార్చు

  • పండు పండు, నా బుజ్జి పండు, రేపటికిస్తాను రేగుపండు, రచన :వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ పి శైలజ
  • కళ్యాణం కమనీయం , రచన: వేటూరి, గానం.పి.సుశీల , ఎస్ పి శైలజ
  • నిషా నిషా నిషా, రచన: వేటూరి, గానం.అనితారెడ్డి
  • చామంతి పూల పక్క , రచన: వేటూరి, గానం.పి సుశీల,జయ చంద్రన్
  • పగలంతా గగనానికి , రచన: వేటూరి, గానం.పి సుశీల, జయ చంద్రన్.

విశేషములు మార్చు

బయటి లింకులు మార్చు

  • స్వాతి
  • ఘంటసాల గళామృతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.