హను రాఘవపూడిగా పేరు పొందిన హనుమంతరావు రాఘవపూడి ఒక తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, లై, పడి పడి లేచె మనసు, సీతా రామం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

హను రాఘవపూడి
దస్త్రం:హను రాఘవపూడి.jpg
జననం
హనుమంత రావు రాఘవపూడి

వృత్తిసినీ దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2002 - ప్రస్తుతం

వ్యక్తిగత జీవితం మార్చు

హనుమంతరావు తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో జన్మించాడు. కొత్తగూడెంలోనే డిగ్రీ వరకు చదివి, తర్వాత హైదరాబాదులో ఎంసిఏ చేశాడు.[1]

సినిమారంగం మార్చు

హైదరాబాదులో చదువుకునే రోజులనుంచి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర ఐతే, ఒక్కడున్నాడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అనుకోకుండా ఒక రోజు సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.[2] 2012లో అందాల రాక్షసి సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[3]

సినిమాలు మార్చు

సంవత్సరం పేరు మూలాలు
2012 అందాల రాక్షసి [4]
2016 కృష్ణ గాడి వీర ప్రేమ గాధ
2017 అబద్ధం
2018 పడి పడి లేచె మనసు [5]
2022 సీతా రామం [6]

మూలాలు మార్చు

  1. "Chitchat with Hanu Raghavapudi". Idlebrain. Retrieved 15 August 2012.
  2. G. V, Ramana. "chitchat with Hanu Raghavapudi". idlebrain.com. Retrieved 3 January 2018.
  3. "SS Rajamouli buys shares in 'Andala Rakshasi'". IBN. 26 July 2012. Archived from the original on 30 July 2012. Retrieved 1 August 2012.
  4. "Andala Rakshasi — Love, sunny side down". The Hindu. 11 August 2012. Retrieved 24 April 2020.
  5. "My cinematic grammar is more effective in Padi Padi Leche Manasu". The Indian Express. 27 December 2018. Retrieved 24 April 2020.
  6. "Sita Ramam glimpse: Rashmika Mandanna's Afreen is on a mission to make Dulquer Salmaan, Mrunal Thakur win". 10 April 2022.