హమీదా బాను బేగం

మొఘల్ సామ్రాజ్యానికి చెందిన పాద్షా బేగం

హమీదా బాను బేగం. మరియం మకాని (1527-1604 ఆగస్టు - 29) రెండవ మొఘల్ చక్రవర్తి హుమాయూన్ భార్యలలో ఒకరు, చక్రవర్తి అక్బర్ తల్లి. [1] ఆమె హుమాయూన్ సమాధిని పర్షియన్, హిందూస్థానీ కళాకారుల చేత ప్రజలచేత నిర్మించజేసింది. .[2]

Hamida Banu Begam
Mughal Empress
Hamida Banu Begum
జననం1527
మరణం29 August 1604 (aged 77)
Agra, Mughal Empire
Burial
SpouseHumayun
IssueAkbar
తండ్రిShaikh Ali Akbar Jami
తల్లిMah Afroz Begum
మతంIslam

కుటుంబం మార్చు

 
Akbar's mother travels by boat to Agra

హమీదా భానుబేగం 1527 లో జన్మించింది. ఆమె తండ్రి షేక్ అలి అక్బర్ జామి ఒక పర్షియన్ (షియా). ఆయన మొఘల్ రాజకుమారుడు హిండల్ మిర్జాకు మిత్రుడు, గురువు. హిండల్ మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ చిన్న కుమారుడు. అలి అక్బర్ జమీని మీర్ బాబా దోస్త్ అని కూడా అనేవారు. అలి అక్బర్ జమీ షేక్ అహ్మద్ -ఇ- జమీ వంశస్థుడు. హమీదా బాను తల్లి మహ్ అఫ్రజ్ బేగం. ఆమె అలి అక్బర్ జమీని పాట్ (సింధ్) వద్ద వివాహం చేసుకుంది. హమీదా ఒక ముస్లిం భక్తురాలు.

హుమాయూనును కలుసుకొనుట మార్చు

హమూదా బాను బేగం తన 14వ సంవత్సరంలో హుమాయూనును కలుసుకుంది. తరువాత మిర్జా హిండల్ గృహంలో దిల్దర్ బేగం (అల్వర్) ఇచ్చే విందులో తరచుగా కలుసుకునేది. దిల్దర్ బేగం బాబర్ భార్యలలో ఒకరు, హుమాయూన్ సవతి తల్లి. షేర్షా సూరీ సైన్యం ఢిల్లీని ఆక్రమించిన సమయంలో హుమాయూన్ కొంతకాలం ఢిల్లీ నుండి బహిష్కరించబడ్డాడు.

హమీదా బాను బేగంతో హుమాయూన్ వివాహ ప్రస్తావన సమయంలో హమీదా బాను బేగం, హిండల్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. వారిద్దరూ పరస్పరం ప్రేమలో ఉన్నారని భావించారు. [3] హమీదాకు హిండల్ పట్ల ప్రేమ ఉండవచ్చని పరిస్థితుల ఆధారంగా భావించబడింది.[3] హమీదా సన్నిహిత మిత్రురాలు హిండల్ సోదరి వ్రాసిన " హుమాయూన్ నామా " పుస్తకంలో హమీదా బేగం తరచుగా తనతల్లి దిల్దర్ బేగం ఇచ్చే విందులో పాల్గొనేదని, హిండల్ ఉండే ప్రదేశంలో హమీదా తరచుగా కనిపించేదని పేర్కొన్నది..[4] ఆరంభంలో హమీదా చక్రవర్తిని కలుసుకోవడానికి నిరాకరించింది. దిల్దర్ బేగం 40 రోజులకాలం నచ్చచెప్పిన తరువాత హమీదాబేగం దిల్దర్‌ను కలుసుకోవడానికి సమ్మతించింది. తరువాత ఆమె హుమాయూనును వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. ఆమె తనకు హుమాయూను పట్ల ఆరంభకాలంలో ఉన్న అయిష్టతను తన " హుమాయూన్మా " పుస్తకంలో పేర్కొన్నది.

I shall marry someone; but he shall be a man whose collar my hand can touch, and not one whose skirt it does not reach."

వివాహం మార్చు

చక్రవర్తి ఎన్నిక చేసిన రోజున హమీదా వివాహం 1541 సెప్టెంబరు సోమవారం మధ్యాహ్న సమయంలో పాతర్ వద్ద జరిగింది. తరువాత ఆమె హుమాయూనుకు బెగా బేగం తరువాతి భార్య అయింది. హమీదా బేగం హుమాయూన్ రెండవ భార్య అయింది. తరువాత ఆమె హజీ బేగం, పట్టపురాణి అని పిలువబడింది. [1][5][6] హమీదా బాను " మరియం మకానీ " అని పిలువబడింది.

రెండు సంవత్సరాల తరువాత కష్టతరమైన ఎడారి ప్రయాణం తరువాత 1542 ఆగస్టు 22 ఆమె, హుమాయూన్ రాణా ప్రసాద్ పాలిస్తున్న ఉమర్‌కోట చేరుకున్నారు. రాణా ప్రసాద్ సోధా హిందూ రాజపుత్ర వంశస్థుడు. ఒక చిన్న ఎడారి పట్టణంలో ఉన్న రాణా ప్రసాద్ హుమాయూన్ కుటుంబానికి ఆశ్రయం కల్పించాడు. రెండు మాసాల తరువాత హమీదా బేగం భవిష్యత్తు చక్రవర్తి అక్బర్కు జన్మ ఇచ్చింది. అక్బర్ 1542 అక్టోబరు 15 న ప్రాతఃకాలంలో జన్మించాడు. హుమాయూన్ లాహోర్‌లో ఉన్న సమయంలో స్వప్నంలో " చక్రవర్తి జలాజ్ - ఉద్ - దీన్ ముహమ్మద్ అక్బర్ " పేరును విన్నాడని అందుకని ఆయన తనకుమారునికి " జలాల్ - ఉద్ - ద్దీన్ " అని నామకరణం చేసాడు.[7][8][9][10]

 
Humayun's Tomb, where Hamida Bano Begum was buried after her death
 
Cenotaph of Hamida Bano Begum along with that of Dara Shikoh and others, in a side chamber of Humayun's Tomb, Delhi.

తరువాత సంవత్సరాలలో హమీదాబేగం తన భర్తతో పలు కష్టతరమైన ప్రయాణాలు చేసింది. హుమాయూన్ అప్పుటికీ అఙాతంలోనే ఉన్నాడు. డిసెంబరు మాసంలో 12 రోజుల ప్రయాణం తరువాత ఆమె తన కుమారునితో జూన్ మకాముకు చేరుకుంది. అక్కడి నుండి ఖాందహార్‌కు కస్థాతరమైన ప్రయాణం కొనసాగింది. మార్గమధ్యంలో హుమాయూన్ షాల్- మస్తాన్ నుండి భార్యాబిడ్డలను నీరు లేని ఎడారిలో వదిలి త్వరితగతిలో ముందుకు వెళ్ళాడు. తరువాత ఆమె భర్తతో పర్షియా చేరుకుంది. అక్కడ వారు ఇరాన్ లోని హర్దాబీ వద్ద తమ పూర్వీకులు అయిన " అహ్మద్ -ఇ - జమి, షిమీ మందిరాలను దర్శించారు. అది సఫావిద్ సాంరాజ్యనికి స్వస్థలం. తరువాత కాలంలో సఫావిద్ వారికి ఎంతో సహకరించాడు. 1544 లో సబ్జవార్ మకాము వద్ద (హేరత్‌కు దక్షిణంలో 93 మైళ్ళు) ఆమె ఒక కుమార్తెకు జన్మ ఇచ్చింది. సఫావిద్ (ఇరాన్), తమాస్ప్ ఇచ్చిన సైన్యంతో ఆమె భర్త వెంట పర్షియాను వదిలి వెళ్ళింది. 1545 నవంబర్‌లో ఆమె ఖాందహార్ వద్ద దిల్దర్ బేగం, ఆమె కుమారుడు మిర్జా హిండల్‌ను కలుసుకున్నది. అక్కడ ఆమె తనకుమారుని కలుసుకున్నది. మహిళా బృందం మధ్య ఉన్న తల్లిని పిన్న వయస్కుడైన అక్బర్ గుర్తించిన దృశ్యం అక్బర్ జీవితచరిత్ర అక్బర్ నామాలో చిత్రించబడింది. 1548లో ఆమె తనకుమారుడైన అక్బర్‌తో కాబూల్ చేరుకుంది. [10]

చక్రవర్తిని మార్చు

1545 లో షేర్ షా సూరీ మరణించాడు. తరువాత ఆయన కుమారుడు ఇస్లాం షా సాంరాజ్యానికి వారసుడు 1554 లో మరణించాడు. అంతటితో షేర్ షా సూరీ సామ్రాజ్యం అరాచకం అయింది. 1554 నవంబర్‌లో హుమాయూన్ భారతదేశానికి రావడానికి సన్నాహాలు సిద్ధం చేసుకున్నాడు. హమీద్ బేగం మాత్రం కాబూల్ లోనే ఉండి పోయింది. 1555 లో హుమయూన్ ఢిల్లీ సింహాసం స్వాధీనం చేసుకున్నాడు. 1556 లో తన 47వ సంవత్సరంలో హుమాయూన్ మరణించాడు. హుమాయూన్ భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం లోపు ఢిల్లీ లోని పురానా ఖిలా లోని గ్రంథాలయం మెట్ల మీద నుండి కిందకు పడి మరణించాడు. తండ్రి మరణించే సమయానికి అక్బర్‌కు 13 సంవత్సరాలు. మొఘల్ సామ్రాజ్యానికి అక్బర్ గొప్ప చక్రవర్తిగా పేరు గుర్తించబడ్డాడు. 1557 లో అక్బర్ పాలన రెండుసంవత్సరాలకు చేరిన తరువాత హమూదా బేగం అక్బర్‌ వద్దకు చేరింది. తరువాత ఆమె మిగిలిన కాలం అంతా(1570) అక్బర్‌తో గడిపింది. .[10]

మరణం మార్చు

1604 ఆగస్ట్ 29న ఆగ్రా లో హమీదాబేగం మరణించిన తరువాత ఆమె శరీరం ఆమె భర్త హుమాయూన్ సమాధి సమీపంలో సమాధి చేయబడింది. హమీదా బేగం తనకుమారుడు అక్బర్ మరణించడానికి ఒక సంవత్సరం ముదుగా తన భర్త మరణించిన దాదాపు 50 సంవత్సరాల తరువాత మరణించింది. ఆమె జీవితం అంతా తన కుమారుడైన అక్బర్ చేత గౌరవించబడింది. ఆగ్ల యాత్రీకుడు " థోమస్ కొరియత్ " అక్బర్ లాహోర్ నుండి ఆగ్రా ప్రయాణించే సమయంలో నదిని దాటే సమయంలో తన తల్లి పల్లకీని స్వయంగా మోసాడు " అని పేర్కొన్నాడు. రాజకుమారుడు, భవిష్యత్తు చక్రవర్తి సలీం అక్బర్ చక్రవర్తి మీద తిరుగుబాటు చేసిన సమయంలో ఆమె తన మనుమడి పక్షం వహించింది. తరువాత వారి మధ్య సయోధ్య కుదిరింది. అక్బర్ అభిమానపాత్రుడైన మంత్రి అబ్దుల్ - ఫాజ్ ను కుట్రతో హత్యచేసిన తరువాత కూడా అక్బర్ కుమారుని తలను నరకడం తప్పించి తల, గడ్డం మాత్రమే క్షవరం చేయించాడు. ఇలా అక్బర్ తనను పోషించిన తల్లి జిజి అంగా మరణం మరణించిన సమయం, తన స్వంత తల్లి మరణించిన సమయంలో ఇలా జహంగీర్‌కు క్షవరం జరిమానాగా విధించబడింది. [11][12][13] హమీదా బేగానికి మరియం మఖాన్ పేరు ఇవ్వబడింది. .[14] Details of her life are also found in Humayun Nama, written by Gulbadan Begum, sister of Humayun,[15][16] హమీదా బేగం అక్బర్‌నామా, అయిన్- ఇ- అక్బర్ పుస్తకాలను తన కుమారుడు పాలిస్తున్న కాలంలో వ్రాసింది.

సంస్కృతి మార్చు

2008లో భారతీయ చారిత్రాత్మక చిత్రం జోదా అక్బర్ చిత్రాన్ని అసుతోష్ గోవారికర్ చిత్రీకరించినప్పుడు హమీదా బేగం పాత్రను పూనం సింహా పోషించింది. [17] గతంలో హిందీ చారిత్రాత్మక చిత్రం " హుమాయూన్ " చిత్రాన్ని మహబూబ్ ఖాన్ చిత్రీకరించినప్పుడు హమీదా బేగం పాత్రను నర్గీస్ పోషించింది.[18]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 The Humayun Nama: Gulbadan Begum's forgotten chronicle Yasmeen Murshed, The Daily Star, 27 June 2004.
  2. http://www.thehindu.com/features/metroplus/society/bringing-it-back-to-glory/article6089251.ece?secpage=true&secname=entertainment
  3. 3.0 3.1 Eraly, Abraham (2000). Emperors of the Peacock Throne : The Saga of the Great Mughals ([Rev. ed.]. ed.). Penguin books. pp. 65, 526. ISBN 9780141001432.
  4. Wade, Bonnie C. (1998). Imaging Sound : an Ethnomusicological Study of Music, Art, and Culture in Mughal India. Univ. of Chicago Press. p. 62. ISBN 9780226868417.
  5. Nasiruddin Humayun Archived 2016-03-05 at the Wayback Machine The Muntakhabu-’rūkh by Al-Badāoni, Packard Humanities Institute.
  6. Bose, Mandakranta (2000). Faces of the feminine in ancient, medieval, and modern India. US: Oxford University Press. p. 203. ISBN 0-19-512229-1. Retrieved 6 August 2009.
  7. Part 10:..the birth of Akbar Humayun nama by Gulbadan Begum.
  8. Conversion of Islamic and Christian dates (Dual) Archived 2009-08-01 at the Wayback Machine As per the date converter Akbar's birth date, as per Humayun nama, of 04 Rajab, 949 AH, corresponds to 14 October 1542.
  9. Amarkot Genealogy Archived 2009-08-31 at the Wayback Machine Queensland University.
  10. 10.0 10.1 10.2 Schimmel, Annemarie; Burzine K. Waghmar (2004). The empire of the great Mughals. Reaktion Books. p. 146. ISBN 1-86189-185-7..
  11. Genealogy of Hamida Begum
  12. Mukhia, Harbans (2004). The Mughals of India. India: Wiley. p. 115. ISBN 81-265-1877-4.
  13. Hamida Banu Faces of the feminine in ancient, medieval, and modern India, by Mandakranta Bose. Oxford University Press US, 2000. ISBN 0-19-512229-1. Page 203.
  14. Mausoleum that Humayun never built Archived 2008-07-04 at the Wayback Machine The Hindu, April 28, 2003.
  15. Humayun-Nama : The History of Humayun by Gul-Badan Begam. Translated by Annette S. Beveridge. New Delhi, Goodword, 2001,ISBN 81-87570-99-7. Page 149.
  16. LXXXIII. Ḥamīda-bānū Begam Maryam-makānī Archived 2016-03-05 at the Wayback Machine Humayun-nama Chapter 57, Appendix A. Biographical Notices of the Women mentioned by Babar, Gulbadan Begum, and Haidar.LXXXIII.. Packard Humanities Institute
  17. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Jodhaa Akbar
  18. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Humayun . On 18th June 2013, Zee TV started airing a TV series titled Jodhaa Akbar with Rajat Tokas and Paridhi Sharma in the lead. Hamida Banu Begum is portrayed as a main character and is played by Chhaya Ali Khan.

వెలుపలి లింకులు మార్చు