హిట్లర్ (సినిమా)

1997 సినిమా

హిట్లర్ 1997 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఎడిటర్ మోహన్ సమర్పించగా ఎం. ఎల్. మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎం. వి. లక్ష్మి నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవి, రంభ ప్రధాన పాత్రలు పోషించారు. నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించాడు. ఈ చిత్రం 42 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుంది. 1996 లో మలయాళం లో ఇదే పేరుతో వచ్చిన విజయవంతమైన చిత్రం తెలుగు చిత్రానికి మూలం. మలయాళంలో మమ్ముట్టి, శోభన జంటగా నటించారు.[1]

‌హిట్లర్
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
రచనఎల్. బి. శ్రీరామ్ (మాటలు)
నిర్మాతఎం. వి. లక్ష్మి
తారాగణంచిరంజీవి,
రంభ,
అచ్యుత్
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1997 జనవరి 4 (1997-01-04)
భాషతెలుగు

తారాగణం మార్చు

  • హిట్లర్ మాధవరావు గా చిరంజీవి
  • బుజ్జి గా రంభ
  • బాలచంద్ర అలియాస్ బాలు గా రాజేంద్ర ప్రసాద్
  • మాధవ తండ్రి గా దాసరి నారాయణరావు
  • రుద్రరాజు గా రామిరెడ్డి
  • చిన్నా గా ప్రకాష్ రాజ్
  • ఆదిశేషు గా రాజా కృష్ణమూర్తి
  • రుద్రరాజు సోదరుడిగా పొన్నంబళం
  • కాంతారావు గా సుధాకర్
  • జబార్ గా బాబు మోహన్
  • మాధవరావు చెల్లెలు గా అశ్విని
  • మాధవరావు చెల్లెలు గా మోహిని
  • మాధవరావు చెల్లెలు గా మీనాకుమారి
  • మాధవరావు చెల్లెలు గా గాయత్రి
  • అప్పలకొండ గా బ్రహ్మానందం
  • గంగమ్మ గా కల్పనా రాయ్
  • వై. విజయ

పరిచయం మార్చు

  • మమ్ముట్టి ఇదే పేరుతో నటించిన మలయాళ చిత్రం ఈ చిత్రానికి మూలం.

పాటలు మార్చు

కోటి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. లహరి మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల అయ్యాయి.

Untitled
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నడక కలిసిన నవరాత్రి"వేటూరి సుందర్రామ్మూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:27
2."కూసింది కన్నె కోయిల"భువన చంద్రమనో, సుజాత, రేణుక, సంగీత5:10
3."కన్నీళ్ళకే కన్నీరొచ్చే"సిరివెన్నెల సీతారామ శాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, అనుపమ, రేణుక5:06
4."మిస మిస మెరుపుల మెహబూబా"చంద్రబోస్ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:50
5."ఓ కాలమా ఇది నీ జాలమా"సిరివెన్నెల సీతారామ శాస్త్రికె. జె. ఏసుదాసు4:40
6."ప్రేమా జోహార్"సిరివెన్నెల సీతారామ శాస్త్రిమనో, మురళి6:06
Total length:30:34

[2]

విశేషాలు మార్చు

  • అంతొద్దు - ఇది చాలు అన్న డైలాగు ఈ చిత్రం లోనిదే

మూలాలు మార్చు

  1. షణ్ముఖ (5 November 2017). సితార లో పాటల పల్లకి శీర్షిక హిట్లర్ అబిబీ... అరబిక్ దీదీ. ఈనాడు.
  2. "Hitler (1997) Songs". telugulyrics.org. Archived from the original on 2017-10-26. Retrieved 2017-10-16.