2014 JO25 అనేది వేరుశెనగ ఆకారం[1]లో గల భూమి సమీపంలోని ఆస్టరాయిడ్ (గ్రహశకలం). దీనిని మే 2014 న ఎ.డి గ్రాయుర్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. నాసాకు చెందిన నియో అబ్జర్వేషన్స్ ప్రోగ్రాంలో భాగమైన కాటలీనా స్కై సర్వేకు చెందిన శాస్త్రవేత్త ఆయన. ప్రారంభ అంచనాలలనుసరించిని ఇది 600-1400 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. తరువాత నియోవైస్ డాటా ప్రకారం దీని వ్యాసం 650 మీటర్లుగానూ, ఆల్బిడో 0.25 గానూ నిర్ణయించారు. [2] 2017 లో అంచనాల ప్రకారం ఈ ఆస్ట్రరాయిడ్ యొక్క అత్యధిక వెడల్పు 870 మీటర్లుగా సుచించారు. [3]

2017 లో ఇది భూమికి 1.8 మిలియన్ కిలోమీటర్ల దూరంవరకు వస్తుందనీ, ఇలాంటి సందర్భం ప్రతీ 400 సంవత్సరాలకొకసారి వస్తుందని తెలియజేసారు. [4]

2017 లో భూమికి సమీపంగా మార్చు

ఇది భూమికి సమీపంగా 2017 ఏప్రిల్ 19 న వస్తుంది. అనగా భూమికి 1.8 మిలియన్ కిలోమీటర్లు (1.1 మిలియన్ మైళ్ళు). దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండబోధని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. సాధారణంగా చిన్న గ్రహశకలాలు మామూలుగానే భూమికి దగ్గరగా వస్తాయి. 2014 జె025 అనే ఈ గ్రహశకలాన్ని 2014 మేలో గుర్తించారు. ఇది మాత్రం 2004 నుంచి ఇప్పటి వరకు భూమికి దగ్గరగా వచ్చిన వాటిలో అతి పెద్దదని అంటున్నారు. ఇది భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి 4.6 రెట్ల దూరంలో ప్రయాణిస్తోంది.

భూమికి సమీపంగా కేవలం కొన్ని సెకండ్ల పాటే ఉంటుందని, అది కూడా కొన్ని వందల కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందని నాసా నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్‌కు చెందిన డేవీ ఫార్నోషియా చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా గ్రహశకలాలు ప్రయాణించే తీరును పరిశీలిస్తుండటంతో.. దాని మార్గాన్ని కచ్చితంగా అంచనా వేయగలమని ఆయన అన్నారు. దీన్ని మామూలు కంటితో చూసే అవకాశం మాత్రం ఉండదు. ఇంట్లో ఉన్న టెలిస్కోపులతో ఈరోజు, రేపు రెండు రాత్రుల పాటు చూసే అవకాశం స్కై వాచర్లకు ఉంటుంది.[5] [6]

మూలాలు మార్చు

  1. "NASA captures images of large asteroid flying by Earth". Q13 FOX News. 2017-04-20. Archived from the original on 2017-04-21. Retrieved 2017-04-20.
  2. https://echo.jpl.nasa.gov/asteroids/2014JO25/2014JO25_planning.html
  3. "Planetary Radar Science Group". www.naic.edu (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2017-04-28. Retrieved 2017-04-27.
  4. http://earthsky.org/astronomy-essentials/large-asteroid-2014-jo25-close-april-19-2017-how-to-see
  5. http://www.sakshi.com/news/international/asteroid-coming-nearer-to-earth-but-not-dangerous-say-nasa-scientists-469202
  6. https://www.jpl.nasa.gov/news/news.php?feature=6807

ఇతర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=2014_JO25&oldid=4012024" నుండి వెలికితీశారు