ప్రధాన మెనూను తెరువు

ప్రపంచ వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న నిర్వహించబడుతుంది. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు.[1]

ప్రపంచ వృద్ధుల దినోత్సవం
ప్రపంచ వృద్ధుల దినోత్సవం
ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలు
జరుపుకొనేవారుదేశాల జాబితా - ఐక్య రాజ్య సమితి సభ్యులు
జరుపుకొనే రోజుఅక్టోబర్ 1
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

ప్రారంభంసవరించు

మొట్టమొదటిసారిగా వియన్నాలో 1984లో వయో వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. సీనియర్‌ సిటిజన్‌ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటిసారిగా వాడడం జరిగింది.[2] 1990, డిసెంబర్‌ 14న ఐక్యరాజ్య సమితి వృద్ధుల కోసం ఒక నిర్థిష్ట ప్రణాళికను తయారుచేసి, ప్రపంచ దేశాలన్నీ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. 2004లో స్పెయిన్ దేశంలో జరిగిన 86 దేశాల సమీక్షా సమావేశాలలో వృద్ధుల సంక్షేమం కోసం 46 తీర్మానాలను ఆమోదించారు. మొదటిసారిగా 1991, అక్టోబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా పంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు.

మూలాలుసవరించు

  1. సాక్షి (22 September 2013). "వివరం: వివేకపు మూటలు." మూలం నుండి 1 October 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 1 October 2018. Cite news requires |newspaper= (help)
  2. http://www.jagritiweekly.com/slider-news/senior-citizen/ వృద్ధులు కాదు… మన బతుకు నిర్దేశకులు