ప్రమీల మహాభారతంలో అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి. ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు, యుద్ధ వీరులు.

ప్రమీల
మహాభారతం పాత్ర
సమాచారం
కుటుంబందిలీపుడు (తండ్రి), ఇంద్రుడు (మామ), కుంతి (అత్త)
దాంపత్యభాగస్వామిఅర్జునుడు

పురాణ కథ మార్చు

దిలీపుడు చక్రవర్తికి ప్రమీల కుమార్తె. ఒకరోజు దిలీపుడు, ప్రమీల తమ సైన్యంతో కలిసి వేటకు వెళ్ళారు. ఆ అడవితో పార్వతీ దేవి, శివుడితో రమిస్తూ ఉంది. ఆమెను దిలీపుడు, అతని సైన్యం చూడగా. వెంటనే పార్వతి కోపోద్రిక్తురాలై, రాజ్యంలోని వారందరు స్త్రీలుగా మారాలని శపించింది. అప్పటినుంచి అది స్త్రీల రాజ్యంగా మారింది. శాప పరిహారం గురించి కోరగా, ఇంద్రుని కుమారుడైన అర్జునుడు ప్రమీలను వివాహం చేసుకుంటాడో, ఆరోజే మీకు శాపవిముక్తి కలుగుతుందని పార్వతీ దేవి చెప్పింది. పంపానది తీరానున్న సీమంతి నగరంలోని స్త్రీలతో జరిగే యుద్ధంలో ఎంతటి బలమైన వారైన ఓడిపోయేవారు. తమతో అనవసరంగా వైరం పెట్టుకున్న కుంతల రాజు విజయవర్మని మల్లయుద్దంలో ఓడించిన ప్రమీల, అతని రాజ్యాన్ని, అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తమ రాజ్యానికి తీసుకువస్తుంది.[1]

వ్యాసుని సూచన మేరకు ధర్మరాజు అశ్వమేథయాగం చేయగా, సీమంతినీ నగర కాపాలదారులకు ధర్మరాజు యాగాశ్వం దొరుకుతుంది. ఆ అశ్వాన్ని ప్రమీల తన అశ్వశాలలో కట్టేయించి, తనతో యుద్ధం చేసి, యాగాశ్వాన్ని విడిపించుకోమని, తన దండనాయకి వీరవల్లితో అర్జునుడికి లేఖ పంపుతుంది. విడిపించడానికి అర్జునుడు వెళ్ళగా వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అర్జునుడు ప్రమీల చేతిలో ఓడిపోతాడు. అర్జునుడు శ్రీకృష్ణుణ్ని స్మరించగా. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ప్రమీలార్జునులకు గాంధర్వ వివాహం జరిపిస్తాడు.[2]

మూలాలు మార్చు

  1. అచ్చంగా తెలుగు, ధారావాహికలు. "సామ్రాజ్ఞి". www.acchamgatelugu.com. భావరాజు పద్మిని. Archived from the original on 28 December 2019. Retrieved 16 July 2020.
  2. తెలుగు వెలుగు, వ్యాసాలు. "'రంగ'రంగ వైభోగంగా నంది వెలుగు". www.teluguvelugu.in. రామకృష్ణ, మల్లికార్జునరావు, శ్రీనివాస్‌. Archived from the original on 16 July 2020. Retrieved 16 July 2020.

ఇవి కూడా చూడండి మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రమీల&oldid=3000987" నుండి వెలికితీశారు