ప్రమోద్ షెండే
ప్రమోద్ భౌరావ్ షెండే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు వార్థా శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, పదేళ్ల మహారాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[1]
ప్రమోద్ షెండే | |||
పదవీ కాలం 1999 డిసెంబరు 23 – 2009 నవంబర్ 3 | |||
ముందు | శరద్ మోతీరామ్ తసరే | ||
---|---|---|---|
తరువాత | మధుకర్‌రావు చవాన్ | ||
వ్యవసాయ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1988 – 1990 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1995 - 2009 | |||
ముందు | మాణిక్ మహదేయో సబానే | ||
తరువాత | సురేష్ దేశ్‌ముఖ్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1978 - 1990 | |||
ముందు | వసంతరావు జె. కర్లేకర్ | ||
తరువాత | మాణిక్ మహదేయో సబానే | ||
నియోజకవర్గం | వార్థా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1938 వార్ధా, మహారాష్ట్ర, భారతదేశం | ||
మరణం | 2015 నవంబర్ 15 నాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | వర్ష | ||
సంతానం | రవి, శేఖర్, ఆకాష్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుప్రమోద్ షెండే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వార్థా శాసనసభ నియోజకవర్గం నుండి 1978లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1980, 1985 ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1990 ఎన్నికలలో ఓడిపోయి 1995 నుండి 2009 వరకు వరుసగా తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రమోద్ షెండే 1999 నుంచి 2009 వరకు మహారాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌గా, శరద్ పవార్ మంత్రివర్గంలో 1988 నుండి 1990 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశాడు.
మరణం
మార్చుప్రమోద్ షెండే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2015 నవంబర్ 15న మరణించాడు. ఆయనకు భార్య వర్ష, ముగ్గురు కుమారులు రవి, శేఖర్, ఆకాష్ ఉన్నారు.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ "प्रमाेद शेंडे यांना अखेरचा निराेप". 15 November 2015. Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ Lokmat (15 November 2015). "विधानसभेचे माजी उपाध्यक्ष प्रमोद शेंडे यांचे निधन" (in మరాఠీ). Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ The Economic Times (15 November 2015). "Maharashtra Assembly former Deputy Speaker Pramod Shende dead". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.