ప్రియదర్శినీ కర్వే

(ప్రియదర్శిని కార్వే నుండి దారిమార్పు చెందింది)

ప్రియదర్శినీ కర్వే (ఆంగ్లం: Priyadarshini Karve) సాంప్రదాయేతర ఇంధనాల గురించి భారతీయ గ్రామాలలో వీటి ఆవశ్యకతను దశదిశలా వ్యాపింపజేస్తున్న మహిళ.[1] ఈమె భారతీయ ఆంథ్రపాలజిస్టు ఇరావతి కర్వే మనుమరాలు (కుమారుడు ఆనంద్ కుమార్తె).

ప్రియదర్శినీ కర్వే
Priyadarshini Karve
పౌరసత్వంభారతీయురాలు
జాతీయత Indian
రంగములుభౌతిక శాస్త్రము
చదువుకున్న సంస్థలుపూనా విశ్వవిద్యాలయం
ముఖ్యమైన పురస్కారాలుఏష్డన్ అవార్డు

జీవిత సంగ్రహం మార్చు

చిన్నతనం నుండి శాస్త్రవేత్తల కుటుంబంలో పెరిగిన ప్రియదర్శినికి తాను కూడా ఒక శాస్త్రవేత్త కావాలని కలలుకనేది. బి.ఎస్సీ చదువుతుండగా ఆమెకు భౌతికశాస్త్రంలో ప్రాజెక్టు చేయవలసివచ్చింది. అందుకోసం తన తండ్రి పనిచేస్తున్న Centre for Application of Science and Technology for Rural Development (CASTFORD) లో చేరింది. ప్రాజెక్టులో భాగంగా రంపపుపొట్టు, మట్టితో కలిపి వంటచెరకు తయారుచేయడంతో అందరినీ ఆకర్షించింది. తర్వాత అలాగే మరికొన్ని సాంప్రదాయేతర ఇంధనం గ్రామాలలోని వంటకోసం ఉపయోగించేందుకు ఆవుపేడ, బూడిద మరికొన్ని రసాయనాల మిశ్రమంతో చేసి ప్రయోగించారు.

తర్వాత ఎం.ఎస్సీ. భౌతికశాస్త్రం ప్రధానంగా పూనా విశ్వవిద్యాలయంలో చేపట్టింది. అక్కడ శాస్త్రీయంగా శక్తిని ఉపయోగించే విధానాల మీద విషయసంగ్రహం చేసి; ముఖ్యంగా సౌరశక్తి మీద దృష్టిపెట్టింది. అదేకాలంలో రంపపుపొట్టుతో వంటపొయ్యిని తయారుచేసింది. అది ప్రస్తుతం వాడకంలోకి కూడా వచ్చింది. పి.హెచ్.డి. కోసం వజ్రాల పూత మీద అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసారు.

Appropriate Rural Technology Institute (ARTI) కోసం చెరకు పిప్పి మొదలైన వ్యవసాయ వ్యర్ధాల నుండి శక్తిని రాబట్టే దిశగా పరిశోధనలు చేశారు. ఈ వంటపొయ్యి మహారాష్ట్ర గ్రామాలలోను, పట్టణాలలోను చాలామందికి ఉపయోగపడుతుంది. International Conference on Biomass-based Fuels and Cooking System ను ఆర్జనైజ్ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత సమావేశానికి హాజరైన ప్రముఖుల సలహా మేరకు Ashden Award for Renewable Energy కోసం దరఖాస్తు చేసి 2012 దాన్ని గెలుచుకున్నారు.

పరిశోధన కాలంలో ఈమె మన గ్రామాలలో మహిళలు రోజూ వంటగదిలో ఎదుర్కొంటున్న వాయుకాలుష్యం కదిలించింది. శిలాజ ఇంధనం నుండి వ్యవసాయ వ్యర్ధాల నుండి ఉత్పత్తి చేసిన వంటపొయ్యి, వంటచెరకు ఉపయోగించి వీటినుండి మంచి ఫలితాల్ని రాబట్టవచ్చని గుర్తించింది. షెల్ ఫౌండేషన్ సహాయంతో ఒక 10 ఎంజీవోలను వారిద్వారా 100 వివిధ సంస్థలను కలిపి మహారాష్ట్రలోని 75,00 ఇళ్లలో వీరు తయారుచెసిన వంటసామగ్రిని కొనిపించారు.

పురస్కారాలు మార్చు

  • Yashwantrao Kelkar Youth Award.
  • Adishakti Award.
  • World Technology Award in 'Environment' category.
  • Member of the Project Team which won the prestigious International Ashden award for renewable energy.

మూలాలు మార్చు

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.