ఫిఫా ప్రపంచ కప్ 2014

ఫిఫా 2014 ప్రపచ కప్

మూస:Infobox international football competition

దస్త్రం:2014 FIFA World Cup.svg ఫిఫా ప్రపంచ కప్ 2014,ఫిఫా నిర్వహిస్తున్న 20వ పురుషుల  ప్రపంచ కప్ .ఈ ప్రపంచ కప్ కు బ్రెజిల్ ఆతిధ్యమిచ్చింది.ఇది బ్రెజిల్ ఆతిధ్యమిచ్చిన రెండవ ప్రపంచ కప్ .దీనిని 2014 జూన్ 12 నుండి జూలై 13 వరకు నిర్వహించారు.ఇది దక్షిణ అమెరికా ఖండంలో నిర్వహించిన 5వ ఫిఫా ప్రపంచ కప్.మొదటిసారి దక్షిణ అమెరికా ఖండంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్పును వేరే ఖండానికి చెందిన జట్టు గెలవడం ఈ ఫిఫా ప్రపంచకప్పులోనే జరిగింది.

ఆతిధ్య జట్టు ఎంపికసవరించు

2003 మార్చిలో ఫిఫా 2014 ప్రపంచకప్పును దక్షిణ అమెరికా ఖండంలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని బిడ్ లను ఆహ్వానించింది.బ్రెజిల్,కొలంబియా దేశాలుప్రపంచకప్ నిర్వహించడానికి అసక్తి చూపినప్పటికి కొలంబియా పోటినుండి తప్పుకోవడంతో బ్రెజిల్ 2014 ఫిఫా ప్రపంచకప్ ను నిర్వహించే అవకాశం అందుకుంది.

పాల్గొన్న దేశాలుసవరించు

2011 జూన్ నుండి 2013 నవంబర్ వరకు జరిగిన అర్హత పోటీల ద్వారా మొత్తం 32 దేశాలు అర్హత సాధించాయి.2010 ఫిఫా వరల్డ్ కప్ లో ఆడిన 24దేశాలు 2014 ఫిఫా వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి.బోస్నియా మరియు హెర్జెగొవీనా మొదటిసారిగా ఫిఫా వరల్డ్ కప్ కు అర్హత సాధించింది.కొలంబియా 16సంవత్సరాల తరువాత ఫిఫా వరల్డ్ కప్ కు అర్హత సాధించింది.బెల్జియం 12 సంవత్సరాల తరువాత ఫిఫా వరల్డ్ కప్ కు అర్హత సాధించింది.2018 ఫిఫా వరల్డ్ కప్ కు ఆతిధ్యం ఇస్తున్న రష్యా కూడా అర్హత సాధించింది.పరాగ్వే 1994 తర్వాత తొలిసారి ఫిఫా వరల్డ్ కప్ కు అర్హత సాధించడంలో విఫలం అయింది.

అర్హత సాధించిన 32జట్లను 8గ్రూపులుగా విభజించారు.

వేదికలుసవరించు

మొత్తం 12 వేదికలను 2014 ప్రపంచకప్ ను నిర్వహించడానికి సిద్ధం చేసారు.        

పోటీల నిర్వహణసవరించు

2014 ప్రపంచప్ ఆడడానికి అర్హత సాధించిన అర్హత సాధించిన 32జట్లను 8గ్రూపులుగా విభజించి రౌండ్ రాబిన్ లీగ్ పద్దతి ద్వారా ప్రతిజట్టు తన గ్రూపులో గల మిగతా మూడు జత్లతోనూ ఆడుతుంది.వచ్చిన పాయింట్ల ఆధారంగా ఆ గ్రూపులో మొదటి రెందు స్థానల్లో నిలిచిన జట్లు తదుపరి అంకానికి అర్హత సాధిస్తాయి.మిగిలని రెండు జట్లు పోటీల నుంది నిష్క్రమిస్తాయి.

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Rankings అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు