ఫిలిం ఫార్మాట్ (ఆంగ్లం:Film Format) అనలాగ్ ఫోటోగ్రఫీలో వాడబడే ఫిలిం పరిమాణం, వాటి పై నమోదయ్యే ప్రతిబింబం యొక్క పరిమాణాన్ని నిర్ధారించే ఒక నాణ్యతా ప్రమాణం.

35mm ఫిలిం, మీడియం ఫార్మాట్ ఫిలిం, లార్జ్ ఫార్మాట్ ఫిలిం ల పోలిక

స్టిల్ ఫోటోగ్రఫీ ఫిలిం ఫార్మాట్ లు

మార్చు

పాశ్చాత్య దేశాలలో ఇతర అనేకానేక ఫిలిం ఫార్మాట్ లు వినియోగించబడిననూ, భారతదేశంలో ఈ క్రింది ఫిలిం ఫార్మాట్ లు మాత్రమే వినియోగించబడ్డాయి.

లార్జ్ ఫార్మాట్

మార్చు
 
లార్జ్ ఫార్మాట్ కెమెరాలో పతిబింబం కనబడే తీరు

4 X 5 ఇంచిల (102 X 127 mm) గానీ అంత కన్నా పెద్ద ఫిలింని ఉపయోగించే ఛాయాచిత్రకళ. లార్జ్ ఫార్మాట్ ఫిలిం, మీడియం ఫార్మాట్ ఫిలిం కన్నా కొద్దిగా పెద్దగా, 135 ఫిల్మ్ కంటే బాగా పెద్దదిగా ఉంటుంది. 135 ఫిలింతో పోలిస్తే పదహారింతలు పెద్దది కావటం మూలాన లార్జ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీలో స్పష్టత కూడా పదహారింతలు ఎక్కువగనే ఉంటుంది.

మీడియం ఫార్మాట్, 135 ఫిల్మ్ ల వలె చుట్టలుగా కాకుండా, లార్జ్ ఫార్మాట్ ఫిలిం షీట్ ఫిలింగా లభ్యం అవుతుంది. మొదట గాజుతో తయారు చేయబడే ఫోటోగ్రఫిక్ ప్లేట్ లను లార్జ్ ఫార్మాట్ కెమెరాలలో వినియోగించేవారు.

మీడియం ఫార్మాట్

మార్చు
 
ఒక మీడియం ఫార్మాట్ ఫిలిం (ఎడమ), ఒక 135 ఫిలిం (కుడి) ల పోలిక.

135 ఫిల్మ్ కంటే కొద్దిగా పెద్దదిగా ఉండే ఫిలిం (కానీ లార్జ్ ఫార్మాట్ కంటే చిన్నదిగ ఉండే ఫిలిం) ను ఉపయోగించే ఒక రకమైన ఛాయాచిత్రకళ.

135 ఫిలిం

మార్చు

దీని వెడల్పు 35 మిల్లీమీటర్లు ఉండటం వలన దీనికి ఈ పేరు వచ్చింది. 135 ఫిలిం నిశ్చలన ఛాయాచిత్రకళ (Still Photography) లో, ఒకప్పటి చలనచిత్రాలలో (Motion Picture) సాధారణంగా (, అత్యంత విరివిగా) వాడబడే ఫిలిం పరిమాణం.

110 ఫిలిం

మార్చు
 
డిస్క్ ఫిలిం, 110 ఫిలిం, 35mm ఫిలిం ల పోలిక

కార్ట్రిడ్జ్ ఆధారితంగా వినియోగించబడే ఒక ఫిలిం ఫార్మాట్. 1972 ఈస్ట్‌మన్‌ కొడాక్‌ దీనిని కనుగొంది. ఒక్కొక్క ఫ్రేము 13 mm × 17 mm (0.51 in × 0.67 in) పరిమాణాలతో ఫ్రేముకు పై భాగాన కుడి వైపున ఒకే ఒక రిజిస్ట్రేషన్ రంధ్రం కలిగి ఉంటుంది. ఒక్కొక్క కార్ట్రిడ్జ్ లో 24 ఫ్రేములు ఉంటాయి.

మోషన్ పిక్చర్ ఫిలిం ఫార్మాట్ లు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు