ఫ్యూచర్ సిటీ ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ
హైదరాబాద్ మహానగరానికి తోడుగా నాలుగో నగరం అభివృద్ధి చేయాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నుంచి రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్యలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని 56 గ్రామాలు, 7మండలాలను ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ఫ్యూచర్ సిటీ ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, పురపాలక శాఖ మంత్రి వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.ఈ పరిధి ప్రాంతంలో నిర్ధిష్టమైన అభివృద్ధికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది.[1][2][3]
ఫ్యూచర్ సిటీ ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ | |
---|---|
సంస్థ వివరాలు | |
స్థాపన | 2025 |
ప్రధానకార్యాలయం | తెలంగాణ, భారతదేశం |
సంబంధిత మంత్రులు | రేవంత్ రెడ్డి, (ముఖ్యమంత్రి) రేవంత్ రెడ్డి, (పురపాలక శాఖ మంత్రి) |
కార్యనిర్వాహకులు | రేవంత్ రెడ్డి, చైర్మన్ |
Parent agency | తెలంగాణ ప్రభుత్వం |
అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటమే కాకుండా భూమి లభ్యత, ఇతర మౌలిక అంశాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ పట్టణ ప్రాంత అభివృద్ధి చట్టం-1975ప్రకారం ఫ్యూచర్ సిటీ ప్రత్యేకాభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.[4][5][6]
ఎఫ్‌సీడీఏ కమిటీ సభ్యులు
మార్చు- ముఖ్యమంత్రి - ఛైర్మన్
- పురపాలక శాఖ మంత్రి - వైస్ ఛైర్మన్
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
- ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- పరిశ్రమలు, ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి
- పర్యావరణ, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి
- హెచ్‌ఎండీఏ కమిషనర్
- టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్
- హైదరాబాద్ డీటీసీపీ
- అథారిటీ కమిషనర్ - సభ్య కార్యదర్శి
అధికార పరిధి
మార్చుఫ్యూచర్ సిటీ పరిధిలో ఆమనగల్లు మండలంలోని 2 గ్రామాలు, మహేశ్వరం మండలంలోని 2 గ్రామాలు, మంచాల మండలంలోని 3 గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలంలోని 8 గ్రామాలు, కడ్తాల్ మండలంలోని 6 గ్రామాలు, యాచారం మండలంలోని 17 గ్రామాలు, కందుకూరు మండలంలోని 18 గ్రామాలు ఉండనున్నాయి.[7][8][9]
- ఆమన్‌గల్ మండలంలోని గ్రామాలు: కోనాపూర్, రామనూతుల
- ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాలు: కప్పపహాడ్, పోచారం, రాంరెడ్డిగూడ, తూలెకలన్, తురుకగూడ, ఎలిమినేడు, ఎర్రకుంట, తాడ్లకాల్వ
- కడ్తాల్ మండలంలోని గ్రామాలు: చెరికొండపట్టికల్వకుర్తి, పట్టిపడ్కాల్, ఏక్రాజ్గూడ, కడ్తాల్, కర్కల్‌పహాడ్, ముద్విన్
- కందుకూరు మండలంలోని గ్రామాలు:దాసర్లపల్లి, అన్నోజీగూడ, దెబ్బడగూడ, గూదూర్, గుమ్మడవల్లి, కందుకూర్, కొత్తూరు, గఫూర్నగర్, లేమూర్, మాదాపూర్, మీర్ఖాన్పేట్, మొహమ్మద్‌నగర్, ముచ్చెర్ల, పంజగూడ, రచలూర్, సర్వారావులపల్లి, తిమ్మాయిపల్లి, తిమ్మాపూర్
- మహేశ్వరం మండలంలోని గ్రామాలు: మొహబ్బత్‌నగర్, తుమ్మలూర్
- మంచాల్ మండలంలోని గ్రామాలు: ఆగాపల్లి, నోముల, మల్లికార్జున గూడ
- యాచారం మండలంలోని గ్రామాలు: చౌదర్పల్లి, గన్గల్, కొత్తపల్లి, కుర్మిడ్డ, మేడిపల్లి, మల్కాజిగూడ, మొగుళ్లవంపు, నక్కర్త, నానక్‌నగర్, నంది వనపర్తి, నజ్దిక్ సింగారం, తక్కెళ్లపల్లి, తాటిపర్తి, తూలేఖుర్ద్, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "సీఎం చైర్మన్‌గా.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ". Andhrajyothy. 13 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
- ↑ "హైదరాబాద్‌కు దీటుగా ప్యూచర్ సిటీ!". Sakshi. 7 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
- ↑ "ఫ్యూచర్ సిటీకి ఆమోద ముద్ర". NT News. 13 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
- ↑ "Telangana government forms Future City Development Authority; Hyderabad Metropolitan region expanded" (in Indian English). The Hindu. 12 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
- ↑ "T govt issues GO to set up Future City Development Authority". The Times of India. 13 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
- ↑ "ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు". Eenadu. 13 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
- ↑ "ఫ్యూచర్ సిటీ మ్యాప్ ఇదీ!". Andhrajyothy. 8 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
- ↑ "Telangana government forms 'Future City Development Authority' for strategic urban growth in Rangareddy" (in ఇంగ్లీష్). The New Indian Express. 13 March 2025. Retrieved 13 March 2025.