ఫ్రాంక్ కాప్రా

ఇటాలియన్-అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత

ఫ్రాంక్ రస్సెల్ కాప్రా (1897, మే 18 – 1991, సెప్టెంబరు 3) ఇటాలియన్-అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. ఇతని తీసిన సినిమాలు 1930లు, 1940లలో ముఖ్య అవార్డులు గెలుచుకున్నాయి. ఇటలీలో పుట్టి, ఐదేళ్ల వయస్సు నుండి లాస్ ఏంజెల్స్‌లో పెరిగిన ఫ్రాంక్ "అమెరికన్ డ్రీం పర్సనఫైడ్"గా పరిగణించబడ్డాడు.[2]

ఫ్రాంక్ కాప్రా
ఫ్రాంక్ కాప్రా, సుమారు 1930s
జననం
ఫ్రాంక్ రస్సెల్ కాప్రా

(1897-05-18)1897 మే 18
బిసాక్వినో, సిసిలీ, ఇటలీ
మరణం1991 సెప్టెంబరు 3(1991-09-03) (వయసు 94)
లా క్వింటా, కాలిఫోర్నియా
Burial placeకోచెల్లా వ్యాలీ పబ్లిక్ స్మశానవాటిక
విద్యాసంస్థకాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • నిర్మాత
  • రచయిత
క్రియాశీల సంవత్సరాలు1922–1964
బిరుదుఅకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 1935–1939 అధ్యక్షుడు
రాజకీయ పార్టీరిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)[1]
జీవిత భాగస్వామి
హెలెన్ హోవెల్
(m. 1923; div. 1928)
లూసిల్లే వార్నర్
(m. 1932; died 1984)
పిల్లలు4, ఫ్రాంక్ కాప్రా జూనియర్

జననం మార్చు

ఫ్రాంక్ కాప్రా 1897 మే 18న ఇటలీ దేశం, సిసిలీలోని బిసాక్వినోలో జన్మించాడు.

సినిమారంగం మార్చు

కాప్రా 1930లలో అమెరికా సినిమారంగ అత్యంత ప్రభావవంతమైన దర్శకుల్లో ఒకడిగా నిలిచాడు. ఆరు నామినేషన్లతో ఉత్తమ దర్శకుడిగా మూడు అకాడమీ అవార్డులను గెలుచుకున్నాడు. ఇతర విభాగాల్లో తొమ్మిది నామినేషన్లతో మూడు ఇతర ఆస్కార్ అవార్డులను అందుకున్నాడు. కాప్రా తీసిన ఇట్ హ్యాపెన్డ్ వన్ నైట్ (1934), మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ (1936), యు కెన్ట్ టేక్ ఇట్ విత్ యు (1938), మిస్టర్ స్మిత్ గోస్ టు వాషింగ్టన్ (1939), ఇట్స్ ఎ వండర్ ఫుల్ లైఫ్ (1946) మొదలైన సినిమాలు గుర్తింపు పొందాయి.[3] రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, కాప్రా యుఎస్ ఆర్మీ సిగ్నల్ కార్ప్స్‌లో పనిచేశాడు. వై వి ఫైట్ సిరీస్ వంటి ప్రచార చిత్రాలను కూడా నిర్మించాడు.[4]

కాప్రా వివిధ రాజకీయ, సామాజిక కార్యకలాపాలు నిర్వహించాడు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాతో కలిసి పనిచేశాడు. డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాకు అధిపతిగా ఉన్నాడు.

 
మీట్ జాన్ డోలో వాల్టర్ బ్రెన్నాన్, గ్యారీ కూపర్, ఇర్వింగ్ బేకన్, బార్బరా స్టాన్విక్,జేమ్స్ గ్లీసన్
 
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మేజర్‌గా ఎడిటింగ్ ఫిల్మ్ చేస్తున్న కాప్రా

అవార్డులు, సన్మానాలు మార్చు

అకాడమీ అవార్డులు మార్చు

సంవత్సరం సినిమా విభాగం ఫలితం
1933 లేడీ ఫర్ ఎ డే ఉత్తమ చిత్రం నామినేట్
ఉత్తమ దర్శకుడు నామినేట్
1934 ఇట్ హాపెన్డ్ వన్ నైట్ ఉత్తమ చిత్రం (హ్యారీ కోన్‌తో) విజేత
ఉత్తమ దర్శకుడు విజేత
1936 మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ ఉత్తమ చిత్రం నామినేట్
ఉత్తమ దర్శకుడు విజేత
1937 లాస్ట్ హారిజన్ ఉత్తమ చిత్రం నామినేట్
1938 యూ కాంట్ టేక్ ఇట్ విత్ యూ ఉత్తమ చిత్రం విజేత
ఉత్తమ దర్శకుడు విజేత
1939 మిస్టర్ స్మిత్ గోస్ టూ వాషింగ్టన్‌ ఉత్తమ చిత్రం నామినేట్
ఉత్తమ దర్శకుడు నామినేట్
1943 ప్రెల్యూడ్ టూ వార్ ఉత్తమ డాక్యుమెంటరీ విజేత
1944 ది బాటిల్ ఆఫ్ రష్యా ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ నామినేట్
1946 ఇట్స్ ఎ వండర్ ఫుల్ లైఫ్ ఉత్తమ చిత్రం నామినేట్
ఉత్తమ దర్శకుడు నామినేట్

ఇతర అవార్డులు మార్చు

అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
  • జీవిత సాఫల్య పురస్కారం (1982)
డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా
  • ఎ హోల్ ఇన్ హెడ్ (1959) చిత్రానికి ఉత్తమ దర్శకుడు నామినేషన్
  • జీవిత సాఫల్య పురస్కారం (1959)
  • పాకెట్‌ఫుల్ ఆఫ్ మిరాకిల్స్ (1961) చిత్రానికి ఉత్తమ దర్శకుడు నామినేషన్
గోల్డెన్ గ్లోబ్ అవార్డు
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ

మరణం మార్చు

1985లో 88 సంవత్సరాల వయస్సులో, కాప్రాకి మొదటిసారిగా స్ట్రోక్‌ వచ్చింది.[5] 1991, సెప్టెంబరు 3న తన 94 సంవత్సరాల వయస్సులో కాలిఫోర్నియా, లా క్వింటాలోని తన ఇంటిలో నిద్రలో గుండెపోటుతో మరణించాడు. కాలిఫోర్నియా, కోచెల్లాలోని కోచెల్లా వ్యాలీ పబ్లిక్ శ్మశానవాటికలో అతని అంత్యక్రియలు జరిగాయి.[6]

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.