ఫ్లోరిడా హిందూ దేవాలయం

అమెరికాలో ఉన్న హిందూ దేవాలయం

ఫ్లోరిడా హిందూ దేవాలయం, ఫ్లోరిడాలోని టంపా ప్రాంతంలో ఉన్న హిందూ దేవాలయం, సాంస్కృతిక కేంద్రం.

ఫ్లోరిడా హిందూ దేవాలయం
ఫ్లోరిడా హిందూ దేవాలయం
భౌగోళికం
భౌగోళికాంశాలు28°02′39″N 82°32′10″W / 28.04427°N 82.53622°W / 28.04427; -82.53622
దేశంయునైటెడ్ స్టేట్స్
రాష్ట్రంఫ్లోరిడా
స్థలంటంపా
సంస్కృతి
ముఖ్యమైన పర్వాలుమహాశివరాత్రి, వైంకుంఠ ఏకాదశి, వినాయకచవితి, నవరాత్రి, జన్మాస్టమి, దీపావళి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుఅధునాతన హిందూ దేవాలయ శైలీ
దేవాలయాల సంఖ్య1
చరిత్ర, నిర్వహణ
స్థాపితం1996
వెబ్‌సైట్http://www.htfl.org/

చరిత్ర సవరించు

1983లో ఫ్లోరిడాలోని టంపాలో హిందూ దేవాలయం ఆఫ్ ఫ్లోరిడా సంస్థ స్థాపించబడింది.[1] 1989లో ఈ సంస్థ టంపా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉత్తరాన పదిమైళ్ల దూరంలో కొంత భూమిని కొనుగోలు చేసింది.[1][2] 1994లో ప్రారంభమైన దేవాలయ నిర్మాణం, 1996లో పూర్తయింది.[1] 1996లో మహా కుంభాభిషేకం, దేవతా విగ్రహ ప్రతిష్ఠతో దేవాలయ ప్రారంభోత్సవం జరిగింది.[1][2][3] దేవాలయం ప్రారంభమైన తరువాత ఆరు సంవత్సరాల నిరంతర నిర్మాణం తర్వాత, ఆలయ బయటి గోడలపైన శిల్పాలు, ఇతర శిల్పాలు పూర్తయ్యాయి.[4]

దేవాలయ కొలతలు సవరించు

70 అడుగుల ఎత్తులో 14,573 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ దేవాలయం నిర్మించబడింది.[5][6] చెన్నైకి చెందిన ముత్తయ్య స్థపతి, ఇతర కళాకారులచే దేవాలయ రాజగోపురం నిర్మించబడింది.[6]

ఇతర దేవాలయాలు సవరించు

టంపాలోని ఇతర భారతీయ దేవాలయాలు:[5]

 1. టంపా బేలోని అంబాజీ దేవాలయం
 2. శ్రీ స్వామినారాయణ దేవాలయం
 3. జైన దేవాలయం
 4. సనాతన దేవాలయం
 5. శ్రీ మరియమ్మన్ కాళి దేవాలయం
 6. శ్రీ రాధా కృష్ణ దేవాలయం
 7. శ్రీ సరస్వతీ దేవి దేవాలయం
 8. విష్ణు దేవాలయం

మూలాలు సవరించు

 1. 1.0 1.1 1.2 1.3 "History of Hindu Temple of Florida". Hindu Temple of Florida.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. 2.0 2.1 "Hindu Temple of Florida". Atlas Obscura.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. Whitman, Sarah. "Hindu Temple of Florida welcomes all peace seekers in Tampa". Tampa Bay Times.
 4. Scott, Larissa (25 June 2021). "Hindu Temple of Florida celebrates 25 years in Carrollwood". ABC Action News.
 5. 5.0 5.1 Saundra, Amrhein. "A Look at Indian & Hindu Temples in Tampa Bay". Visit Florida.{{cite web}}: CS1 maint: url-status (link)
 6. 6.0 6.1 Kay, Sheryl (24 October 2005). "A glorious gateway". Tampa Bay Times.