బడే గులాం అలీ ఖాన్

ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ (ఆంగ్లం : Ustad Bade Ghulam Ali Khan) దేవనాగరి: बड़े ग़ुलाम अली ख़ान; షాహ్‌ముఖి: بڑے غلام علی خان; ఉర్దూ: بڑے غلام علی خان; జననం బ్రిటిష్ రాజ్ (నేటి పాకిస్తాన్) లోని పంజాబ్ లోని, లాహోర్ దగ్గర కసూర్ 1902 లో ; మరణం హైదరాబాదు భారతదేశం, ఏప్రిల్ 25, 1968. ఇతను ఒక భారతీయ గాయకుడు. హిందూస్థానీ సంగీతపు సాంప్రదాయ రీతిలో పాడగల దిట్ట. భారతీయ సంగీత శైలి యగు పాటియాలా ఘరానాకు చెందిన వాడు.

ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్
बड़े ग़ुलाम अली ख़ान
بڑے غلام علی خان
ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంబడే గులాం అలీ ఖాన్
ఇతర పేర్లుసబ్‌రంగ్
మూలంకసూర్, పంజాబ్ (పాకిస్తాన్)
సంగీత శైలిహిందుస్థానీ సంగీతము
వృత్తిహిందుస్థానీ క్లాసికల్ గాయకుడు
క్రియాశీల కాలం1920 - 1967
లేబుళ్ళు??

పురస్కారాలు మార్చు

ప్రస్థానం మార్చు

బడే గులాం అలీ ఖాన్ సారంగి వాదకుడిగా తన సంగీత జీవనం ప్రారంభించాడు. కలకత్తాలో తన మొదటి కచేరీలోనే పేరు ప్రఖ్యాతులు పొందాడు. 1944 కాలంలో సంగీత జగత్తులో మహామహులైన అబ్దుల్ కరీం ఖాన్, అల్లాదియా ఖాన్, ఫయాజ్ ఖాన్,లు సైతం ఇతడిని మకుటంలేని మహారాజుగా గుర్తించారు.[1]

ఇతను అనేక ప్రాంతాలలో జీవించాడు, లాహోర్, బాంబే, కలకత్తా, హైదరాబాదు. ఇతడు అంతర్జాతీయ స్థాయిలో తన గాన కచేరీలను చేశాడు, గజల్, ఠుమ్రి, భజన్ శైలులలో పాడేవాడు.

భారత విభజన తరువాత, తన స్వస్థలమైన 'కసూర్' (పాకిస్తాన్) కు వెళ్ళాడు, అక్కడ కొన్నాళ్ళు జీవించిననూ మమేకం కాలేకపోయాడు. ఇతడు భారత విభజనను ఖండించాడు. భారత్ లో స్థిరంగా వుండిపోవుటకు, 1957లో భారత పౌరసత్వం పొందాడు. భారత విభజన గురించి ఈ విధంగా అన్నాడు "ప్రతి ఇంటిలో హిందుస్థానీ సంగీతం నేర్పివుంటే, భారత్ విభజింపబడేది కాదు".

సినిమాల కొరకు పాడడానికి ఇష్టపడేవాడు గాదు. కాని 1960 లో మొఘల్ ఎ ఆజం చిత్ర నిర్మాణ సమయంలో నౌషాద్ సంగీతంలో ఒక రాగయుక్త పాట పాడాడు. అదీ తాన్ సేన్ పాత్రకొరకు మాత్రమే. ఈ పాట "సోహ్నీ", "రాగేశ్రీ" రాగాలలో స్వరపరచి వుంది. దర్శకుడు కె.ఆసిఫ్, నౌషాద్, మొఘల్ ఎ ఆజం కొరకు పాడమని కోరగా, తిరస్కరించడానికి తటపటాయించి, ఎక్కువ ఫీజు అడిగితే వెళ్ళిపోతారనే ఉద్దేశంతో తన ఫీజు ఆ పాటకు 25,000/- అన్నాడు. కళాభిమానుడైన ఆసిఫ్ ఈ ఫీజును సంతోషంగా అంగీకరించాడు. ఆ విధంగా మొఘల్ ఎ ఆజంలో బడే గులాం అలీ ఖాన్ పాట వచ్చింది. ఆ కాలంలో ముహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్లు తమ పాటకు 500/- ల కన్నా తక్కువ పారితోషికం పొందేవారు.

లెగసి మార్చు

ఖాన్ శిష్యురాలైన మాలతీ గిలానీ, ఖాన్ స్మృతికి చిహ్నంగా ఈనాడు, బడే గులాం అలీ ఖాన్ యాద్‌గార్ సభను స్థాపించింది. ఈ సభ అనేక కచేరీలను చేపడుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం, హిందుస్థానీ సంగీతాన్ని ఉచ్ఛస్థితికి తీసుకురావడం, అనారోగ్యంతో బాధపడే సంగీతకారులకు సహాయం చేయడం. ఈ సభ సబ్‌రంగ్ ఉత్సవ్ను ప్రతి యేడాది చేపడుతుంది.

సంతకము మార్చు

 

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. World Music, The Rough Guide Volume Two; London, 2000; pg. 92

ఇవీ చూడండి మార్చు