బణువు అనేది కొత్తగా తయారు చేసిన మాట. ఇంగ్లీషులో మోలిక్యూల్‌ (molecule) కి సమతుల్యమైన మాట ఇది. కొన్ని అణువుల సముదాయం అనే అర్థం స్పురించేలా 'బహుళంగా ఉన్న అణువు' అని విశ్లేషణ చెప్పుకో వచ్చు. ఈ మాటని మొట్టమొదట అమెరికాలో 1967 ప్రాంతాలలో ప్రచురించబడ్డ తెలుగుభాషా పత్రిక లో ప్రయోగించబడింది. ఈ మాటని వేమూరి వేంకటేశ్వరరావు స్వీకరించి తన జీవరహశ్యం, రసగంధాయ రసాయనం, జీవ నది అన్న పుస్తకాలలో విరివిగా వాడేరు.

హీలియం బణువు

అవసరం మార్చు

తెలుగులో అణువు, పరమాణువు అనే రెండు మాటలు ఉన్నాయి. ఈ రెండూ కూడా atom అనే ఇంగ్లీషు మాటకి పర్యాయపదాలుగా వాడటం జరుగుతోంది తప్ప ఏ మాట ఏసందర్భంలో వాడాలన్నది వివాదాస్పదంగా ఉండి పోయింది. ఉదాహరణకి atom అనే మాటకి 'పరమాణువు' సమతుల్యం అనే వారు అణుశక్తి, అణుబాంబు అనే వాడుకని గమనించే ఉంటారు. మంత్రపుష్పంలో 'పీతాభాస్వత్వణూపమా' అనే ప్రయోగం ఉంది. ఇక్కడ 'అణువు' అంటే atom అనే అర్థం స్పురిస్తుంది కాని, molecule అనే అర్థం స్పురణకి రాదు.

అంతే కాదు. atom ని పరమాణువు అంటే అణుగర్బంలో ఉన్న రేణువుల సంగతి? కనుక ప్రస్తుతం భౌతిక, రసాయనిక శాస్త్రాలలో ఉన్న భావాలకి సరిపడా తెలుగు మాటలు లేవు కనుక కొన్ని కొత్త మాటలు అవసరం. బణువు అనేది ఆ అవసరం తీర్చటానికి పుట్టింది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బణువు&oldid=4094959" నుండి వెలికితీశారు