బద్దెన

తెలుగు కవి

చిరకాలంగా తెలుగు ప్రజల నాలుకల మీద నానుచూ వారి అంతశ్చేతనలో భాగంగా కరిగిపొయిన సుమతీ శతకము పద్యాలను, సరసమూ, సరళమూ, సామాన్యులకు సైతం సూటిగా, సులభంగా అర్థమయ్యే శైలిలో రాసిన గొప్ప పద్యకారుడు బద్దెన. 162 పద్యాలు గల మరో లఘుకృతి నీతిశాస్త్ర ముక్తావళి వీరి రచనే. ఇతను కాకతీయ రాజ్యంలో ఒక చిన్న సామంత రాజు. సా.శ.1260 ప్రాంతంలో జీవించి ఉంటారని భావిస్తున్నారు. తిక్కనకు శిష్యునిగా భావిస్తున్నారు. కమలాసన, కవిబ్రహ్మ అను బిరుదులు కలవాడు.<refer< name="కవిరాజులు">రామకృష్ణకవి, మానవల్లి (1910). "ఆంధ్ర రాజకవులు". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 197. Retrieved 6 March 2015.</ref>

బద్దెన

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ.

ఇంటి పనులు చెయ్యడంలో దాసీ మనిషి లాగా, మంచి ఆలోచన ఇచ్చేటప్పుడు మంత్రి లాగా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి లాగా, భోజనం పెట్టేటప్పుడు తల్లి లాగా, పడకటింటిలో రంభ లాగా ఈ షట్కర్మ (ఆరు పనులు) లతో ఉండేది ధర్మపత్ని. ఇదీ ఈ శ్లోకానికి అర్థం. ఇక్కడ షట్కర్మ బదులు షద్ధర్మ అని పాఠభేదం కూడా ఉంది. ఇది బద్దెన వ్రాసిన నీతి శాస్త్రంలోని ఒక పద్యం.

ఇవి కూడా చూడండి

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బద్దెన&oldid=4135038" నుండి వెలికితీశారు