బర్గఢ్ జిల్లా

(బర్గర్ నుండి దారిమార్పు చెందింది)

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో బర్గఢ్ జిల్లా ఒకటి. 1993లో సంబల్‌పూర్ జిల్లా నుండి కొంత భాగాన్ని వేరుచేసి ఈ జిల్లాను ఏర్పాటు చేసారు.

బర్గఢ్ జిల్లా
జిల్లా
ఎగువన: పైక్మల్ సమీపంలోని నృసింహనాథ్ ఆలయం దిగువన: గంధమర్దన్ కొండలు
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రధాన కార్యాలయంబర్గఢ్
Government
 • కలెక్టరుAnjan Kumar Manik OAS(SAG) (27 Jan 2014 - present)
 • MP BGHSanjay Bhoi,
 • MLA BGHSadhu Nepak,
Area
 • Total5,837 km2 (2,254 sq mi)
Population
 (2011)
 • Total14,78,833
 • Rank13
 • Density253/km2 (660/sq mi)
భాషలు
 • అధికారఒరియా, హిందీ,ఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
768 xxx
టెలిఫోన్ కోడ్663, 6683
Vehicle registrationOD-17
లింగ నిష్పత్తి976 /
అక్షరాస్యత75.16%
Lok Sabha constituencyBargarh
Vidhan Sabha constituency7
ClimateAw (Köppen)
Precipitation1,527 millimetres (60.1 in)
Avg. summer temperature46 °C (115 °F)
Avg. winter temperature10 °C (50 °F)

భౌగోళికం మార్చు

జిల్లా వైశాల్యం 5832 చ.కి.మీ ఉంటుంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో సంబల్పూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో బలంగీర్ , సంబల్పూర్ జిల్లాలు, ఆగ్నేయ సరిహద్దులో నౌపడా , పశ్చిమ సరిహద్దులో చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఉన్నాయి.

ఆర్ధికం మార్చు

హిరాకుడ్ ఆనకట్ట నుండి సంవత్సరం అంతా నీటిపాదుల సౌకర్యం లభిస్తుంది. మహానది నది ఉత్తరార్ధ బర్గఢ్ జిల్లాను వ్యవసాయపరంగా సుసంపన్నం చేస్తుంది. ప్రత్యేకంగా వరిపంట విస్తారంగా పండించబడుతుంది.[1] జిల్లా శతాబ్ధాల పురాతనమైన చేనేత పరిశ్రమకు , శంబలపురి చీరెలకు ప్రసిద్ధి చెందింది.

విభాగాలు మార్చు

  • బర్గఢ్ జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది : బర్గఢ్ , పదంపూర్.
  • జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి : బర్గర్హ్, బర్పలి, అత్తబిర, భెదెన్, సొహెల్ల, బిజెపుర్, పదంపుర్, గైసిలెత్, పైక్మల్, ఝర్బంధ్, అంబభొన , మ్హత్లి

.

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,478,833,[2]
ఇది దాదాపు. గాబన్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. 339నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 339వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 253.[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.84%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 976:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 75.16%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

జిల్లాలో గుర్తించతగినంత నేతవారు ఉన్నారు. వారిలో కొంతమంది పద్మశ్రీ వంటి జాతీయ బహుమతి గ్రహీతలు. జిల్లాలో గంగాధర్ మెహర్, హేమచంద్ర ఆచార్య, డాక్టర్ ప్రఫుల్ల కుమార్ , హల్దర్ నాగ్ వంటి సాహిత్యకారులు ఉన్నారు.

భాషలు మార్చు

జిల్లాలో ప్రజలు కొయిస్లి భాష (సంబల్పురి), ఒరియా మాట్లాడుతుంటారు. బర్గఢ్ జిల్లా సరిహద్దులో చత్తీస్గఢీ హిందీ మాట్లాడుతుంటారు.

సంస్కృతి మార్చు

బర్గఢ్ పట్టణం జీరా నదీ తీరంలో ఉంది. పట్టణం మద్యలో హౌరా - ముంబై రహదారి-6 పయనిస్తుంది. ఈ రహదారి "10 రోజుల పాటు సాగిన బహిరంగ వేదిక నాటకం " ధనుయాత్రా ప్రదర్శనకు గుర్తింపు పొందింది. ధనుయాత్రా నాటకం ఇతివృత్తం శ్రీకృష్ణుడు కంసుని వధించిన సన్నివేశానికి చెందినది.

పర్యాటకం మార్చు

జిల్లాలో ఉన్న గంధమర్ధన్ పర్వతపాదాల వద్ద 13వ శతాబ్ధానికి చెందిన నృసింగనాథ్ ఆలయం ఉంది. విష్ణుమూర్తి ఇక్కడ పిల్లి రూపంలో ఆరాధించబడుతున్నాడు. ప్రపంచంలో ఇలాంటి మూర్తి ఉన్న ఆలయం ఇది మాత్రమే.

రాజకీయాలు మార్చు

విభాగాలు మార్చు

The following is the 5 Vidhan sabha constituencies[5][6] of Bargarh district and the elected members[7] of that area

No. Constituency Reservation Extent of the Assembly Constituency (Blocks) Member of 14th Assembly Party
1 పద్మపూర్ లేదు ఝరబంధ్, పైక్మల్, రాజ్బొరసంబర్, పదంపూర్ (ఎన్.ఎ.సి) ప్రదీప్ పురోహిత్ బి.జె.పి
2 బిజెపూర్ లేదు బార్పలి (ఎన్.ఎ.సి), బిజెపూర్, గైసిలెట్, బారపాలి (భాగం) సుబల్ సాహు ఐ.ఎన్.సి
3 బర్గర్ లేదు బర్గర్, బర్గర్ (ఎం), బర్పలి భాగం దెబేష్ ఆచార్య బి.జె.డి
4 అట్టాబిర షెడ్యూల్డ్ కులాలు అట్టాబిర, భెడెన్ స్నేహంగిరి, చురియా బి.జె.డి
5 భత్లి లేదు సొహెల్లా, భత్లి, అంబభొన సుసంత సింగ్ బి.జె.డి

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-03-09. Retrieved 2021-05-27.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  5. Assembly Constituencies and their EXtent
  6. Seats of Odisha
  7. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు మార్చు

వెలుపలి లింకులు మార్చు