బలరామకృష్ణులు
బలరామకృష్ణులు 1992 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, శోభన్ బాబు, రమ్యకృష్ణ, శ్రీవిద్య, జగపతి బాబు ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా సుంకర మధుమురళి నిర్మాణ సారథ్యంలో వెన్నెల ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబడగా, శ్రీ స్రవంతి మూవీస్ సమర్పణ చేసినది. ఇది 1991లో తమిళంలో వచ్చిన చేరన్ పాండియన్ అనే సినిమాకు పునర్నిర్మాణం.[2][3]
బలరామకృష్ణులు | |
---|---|
![]() | |
దర్శకత్వం | రవిరాజా పినిశెట్టి |
కథా రచయిత | తనికెళ్ళ భరణి (మాటలు) |
దృశ్య రచయిత | రవిరాజా పినిశెట్టి |
కథ | ఈరోడ్ సౌందర్ |
నిర్మాత | సుంకర మధుమురళి |
తారాగణం | డా.రాజశేఖర్, శోభన్ బాబు, రమ్యకృష్ణ, శ్రీవిద్య |
ఛాయాగ్రహణం | విజయ్ |
కూర్పు | వేమూరి రవి |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థలు | శ్రీ స్రవంతి మూవీస్, వెన్నెలా ఆర్ట్ ప్రొడక్షన్స్ [1] |
విడుదల తేదీ | 1992 నవంబరు 7 |
సినిమా నిడివి | 139 ని. |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
కథసవరించు
బలరామయ్య ఊరికి పెద్ద. అతని మాట ఊరి ప్రజలకు శాసనం లాంటిది. అతని భార్య వసుమతి, కూతురు రాజీవి. బలరామయ్యకు కులవ్యవస్థ అంటే అపారమైన నమ్మకం. తన సొంత సోదరుడైన కృష్ణమూర్తిని, అతని భార్యయైన సీతను కూడా కులం పట్టింపు కారణంగా తమ పూర్వీకుల ఇంటిని రెండుగా విభజించి వేరు కాపురం పెట్టిస్తాడు. కృష్ణమూర్తికి మామ కొడుకైన శివాజీ ఒకసారి అతని ఇంటికి వస్తాడు. శివాజీ పూజతో ప్రేమలో పడతాడు. బలరామయ్యకు ఈ విషయం తెలిసి పూజకు అంతర్వేదితో వివాహం నిశ్చయిస్తాడు. అంతర్వేది చింతామణి కొడుకు. ఈ చింతామణి బలరామయ్యకు, కృష్ణమూర్తికి విభేధాలు కల్పిస్తూ ఉంటాడు. చివరకు తన భార్య వసుమతి ద్వారా విషయం తెలుసుకున్న బలరామయ్య కృష్ణమూర్తిని తన తమ్ముడిగా ఒప్పుకుని శివాజీ, పూజలకు పెళ్ళి చేయించడంతో కథ సుఖాంతం అవుతుంది.
తారాగణంసవరించు
- కృష్ణమూర్తిగా రాజశేఖర్
- బలరామయ్యగా శోభన్ బాబు
- శివాజీగా జగపతి బాబు
- లలితగా రమ్యకృష్ణ
- బలరామయ్య భార్య వసుమతిగా శ్రీవిద్య
- కృష్ణమూర్తి భార్య సీతగా కల్పన
- చింతామణిగా గొల్లపూడి మారుతీరావు
- అంతర్వేదిగా తనికెళ్ళ భరణి
- పూజగా రాజీవి
- డప్పుల కస్తూరిగా డిస్కో శాంతి
మూలాలుసవరించు
- ↑ "Titles". The Cine Bay.
- ↑ "Heading". FilmiBeat.
- ↑ "Heading-2". Tollywood Times. Archived from the original on 2018-08-06. Retrieved 2020-06-20.