బలీయా

ఉత్తర్ ప్రదేశ్ లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో బలియా జిల్లా (హిందీ:बलिया ज़िला) (ఉర్దు:بالیا ضلع) ఒకటి. బలియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. బలియా జిల్లా అజంగర్ డివిషన్‌లో భాగంగా ఉంది.

Ballia జిల్లా

बलिया ज़िला
بالیا ضلع
Uttar Pradesh లో Ballia జిల్లా స్థానము
Uttar Pradesh లో Ballia జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముAzamgarh
ముఖ్య పట్టణంBallia
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుBallia, Salempur and Ghosi (Lok Sabha constituency )
విస్తీర్ణం
 • మొత్తం1,981 కి.మీ2 (765 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం32,23,642
 • సాంద్రత1,600/కి.మీ2 (4,200/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత73.82 per cent
జాలస్థలిఅధికారిక జాలస్థలి

జిల్లాప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. బలియా నగరం వ్యవసాయ ఉత్పత్తులకు ప్రధాన వ్యాపారకూడలిగా ఉంది. జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి. బాలియా, బన్స్దిహ్, రస్ర, బైరియ, సికందర్పుర్,, బెల్థర.జిల్లాలో ఒక చక్కెర మిల్లు. ఒక పత్తి మిల్లు ఉన్నాయి. జిల్లాలో పలు చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. మనియర్‌లో పెద్ద ఎత్తున బిందీ తయారుచేయబడుతుంది. .

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,223,642,[1]
ఇది దాదాపు. మౌరిటానియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 108 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1081:1000 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.73%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 933:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 73.82%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

భాషలుసవరించు

జిల్లాలో భోజ్పురి (ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందింది. 4 కోట్ల మంది ప్రజలకు వాడుకలో ఉంది. దీనిని వ్రాయడానికి దేవనాగరి, కైతి లిపి వాడుకుంటారు. [4] జిల్లాలో సాధారణ ప్రజలలో భోజ్పురి భాష వాడుకలో ఉంది. ఆగ్లం కూడా నాగరికులలో వాడుకలో ఉంది. ముస్లిములలో ఉర్దూ భాష వాడుకలో ఉంది.

సంస్కృతిసవరించు

ప్రముఖ హిందీ సాహిత్యకారులు అనేక మంది బలియాలో జన్మించారు. వీరిలో హజారీ ప్రసాద్ ద్వివేది, పరశురాం చతుర్వేది, అమర్‌కాంత్ మొదలైన వారు ప్రముఖులు. గంగానది రెండు ప్రధాన నదులు గంగా, ఘఘ్రా (సరయు) మద్యలో ఉంది. ఇవి ఈ భూమిని అధికంగా సారవంతం చేస్తున్నాయి. బలియా హిందూ పవిత్ర నగరాలలో ఒకటిగా భావించబడుతుంది. భృగు ఆలయం ఉన్న ప్రదేశంలో భృగు మహర్షి నివసించాడని భావిస్తున్నారు. భృగు ఆశ్రమం ముందు గంగానది ప్రవహిస్తుంది. శీతాకాలంలో ఒక మాసకాలం ఉత్సవం నిర్వవహించబడుతుంది. ఈ ఉత్సవానికి పరిసర గ్రామాల నుండి వస్తుంటారు. ప్రతిసంవత్సరం ఫిబ్రవరి 15 నాడు బలియా సోనాదిహ్ మేళా కూడా ప్రత్యేక గురింపు పొందుతుంది.

రాజకీయంసవరించు

బలియా స్వాతంత్ర్యసమరవీరులు ఉన్నారు. చిట్టూ పాండే నాయకత్వంలో సాగించిన ఉద్యమంలో బలియాలో 1942 ఆగస్టు 19 నుండి కొన్ని రాజులపాటు బ్రిటిష్ రాజ్‌ రద్దు చేయడంలో సఫలమైయ్యారు. స్వాతంత్ర్యసమరవీరుడు ప్రఖ్యాత మంగల్ పాండే ఈ జిల్లాలో జన్మించాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకిని నిలిపిన మొదటి వ్యక్తిగా మంగల్ పాండేకు ప్రత్యేక గురింపు ఉంది. చిటు పాండే, మురలి మనోహర్, తారకేశ్వర్ పాండే, గౌరి శంకర్ రాయ్, వందలాది ప్రజలు ఈ జిల్లా నుండి స్వతంత్ర సమరంలో పోరాడారు. మురలి మనోహర్, తారకేశ్వర్ పాండే, గౌరి శంకర్ రాయ్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికచేయబడ్డారు. గౌరి శంకర్ రాయ్ యు.పి అసెంబ్లీ సభ్యుడుగా, యు.పి కౌంసిల్, ఇండియన్ పార్లమెంటు పార్లమెంటు సభ్యుడు ఆయన ఐక్యరాజ్య సమితికి అద్యక్షత వహించాడు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో మాట్లాడిన మొదటి సభ్యుడుగా ఆయనకు ప్రత్యేకత ఉంది.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Mauritania 3,281,634 July 2011 est. horizontal tab character in |quote= at position 11 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Iowa 3,046,355 line feed character in |title= at position 15 (help); line feed character in |quote= at position 5 (help)
  4. M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30. More than one of |encyclopedia= and |encyclopedia= specified (help)CS1 maint: extra text (link)

ఇవికూడా చూడండిసవరించు

  • Singh, Anil Kumar (1985). Ballia District, a Study in Rural Settlement Geography. NGSI Research publication #33. Varanasi, India: National Geographical Society of India. OCLC 13497935.

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=బలీయా&oldid=2874287" నుండి వెలికితీశారు