బహాదుర్ షా జఫర్
2వ బహాదుర్ షా మొఘల్ పరిపాలకులలో ఆఖరి వాడు. ఉర్దూ భాషా పారంగతుడు. 'జఫర్' ఇతని కలంపేరు. ఇతని ప్రథమ గురువు 'ఇబ్రాహీం జౌఖ్'. ఇతని ఆస్థానంలో ప్రముఖ కవులు ఇబ్రాహీం జౌఖ్, మిర్జా గాలిబ్. 1857 తిరుగుబాటులో ఆయన పాల్గొన్నారు. తిరుగుబాటుదారులు ఢిల్లీ చేరినప్పుడు తిరుగుబాటు సైన్యం సాధించిన భూభాగానికి అధీనునిగా, చక్రవర్తిగా బహదూర్ షా జఫర్ని ఉంచారు. అయితే చాలామంది చరిత్రకారులు బహదూర్ షా జఫర్ తన ఇష్టపూర్వకంగా కాక, తిరుగుబాటు నాయకుల చేతిలో ఒక కీలుబొమ్మ రాజుగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ రీత్యా ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో అతను పాలుపంచుకన్నది ప్రత్యక్షం కాదని పరోక్షమేనని పేర్కొన్నారు. ఐతే మరికొందరు చరిత్రకారుల దృష్టిలో మాత్రం ఆయన తిరుగుబాటు నాయకుల్లో ఒకరు, భారతపోరాట వీరుల్లో ఒకనిగా గుర్తింపు పొందారు.
బహాదుర్ షా జఫర్ | |||||
---|---|---|---|---|---|
17వ , చిట్టచివరి మొఘల్ చక్రవర్తి | |||||
పరిపాలన | 28 సెప్టెంబరు 1837 – 14 సెప్టెంబరు 1857 (20 సం | ||||
Coronation | 29 సెప్టెంబరు 1837 ఎఱ్ఱకోట, ఢిల్లీ | ||||
పూర్వాధికారి | రెండవ అక్బర్ | ||||
ఉత్తరాధికారి | మొఘల్ సామ్రాజ్యం అంతరించింది చూ.బ్రిటీష్ సామ్రాజ్యం | ||||
జననం | మంగళవారం , 30 షా బాన్, 1189 ఎ.హెచ్/ 24 అక్టోబర్ 1775 ఢిల్లీ, మొఘల్ సామ్రాజ్యం | ||||
మరణం | శుక్రవరం , 14 Jumadi'-I, 1279 A.H/ 7 నవంబర్ 1862 (at 16:00 Asr Time, Rangoon Time)(aged 87 years 14 days) Yangon, British India (now in Burma) | ||||
Burial | On Death day, November 7, 1862 A.D Rangoon, British India (now in Burma) | ||||
Spouses | అష్రాఫ్ మహల్ అఖ్తర్ మహల్ జీనత్ మహల్ తాజ్ మహల్ | ||||
| |||||
Dynasty | Timurid | ||||
తండ్రి | రెండవ అక్బర్ | ||||
తల్లి | లాల్ బాయి | ||||
మతం | ఇస్లాం, సుఫీయిజం |
బహదూర్ షా జఫర్ చక్రవర్తిని ఖైదు చేసి ఢిల్లీకోటను ఆంగ్లేయులు పట్టుకున్నాకా అక్కడ వారికి దొరికిన అమూల్యమైన వస్తుజాలంలో చిత్రవిచిత్రమైన సామాన్లు కనబడినవి. అందులో అపూర్వమైన శిలానిర్మితమైన పాత్రలు పూర్వకాలపునాటివి ఎన్నో ఉన్నాయి.[1] 1739లో నాదిర్షా చరిత్రలో కనీవినీ ఎరుగనంత అపురూపమైన సంపదను, ఆపైన 1756-57లో ఆఫ్ఘాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ మిగిలిన కొంత సంపదను దోచుకుపోయినాకా కూడా ఆ మాత్రం వస్తుజాలం దొరికిందంటే మొఘల్ సామ్రాజ్య ఉచ్ఛస్థితిలో ఎంత వైభవం అనుభవించిందో అర్థంచేసుకోవచ్చు.
మతం
మార్చుబహదూర్షా జఫర్ ఒక సుఫీ భక్తుడు.[2] జాఫర్ స్వయంగా సుఫీగా గౌరవించబడ్డాడు.[2] విశ్వనీయమైన " ఢిల్లీ ఉర్దూ అక్బార్ " వార్తాపత్రిక ఆయనను ఆకాలానికి చెందిన ముఖ్యమైన సన్యాసులలో ఆయన ఒకరని వర్ణించింది. అది మతపరమైన న్యాసంస్థానం అంగీకారం పొందింది.[2] ఆయన పట్టాభిషేకానికి ముందు తన యవ్చనకాలంలో బీద పండితుడిలా కనిపించే వాడు. ఇది చక్కగా దుస్తులు ధరించే తనసోదరులలో (మిర్జా జహంగీర్, సలీం, బాబర్) ఆయనకు ప్రత్యేకతగా చూపేది.[2] 1828లో జఫర్ 53 వయసులో ఆయన సింగాసనానికి వారసుడుగా ప్రకటించబడ్డాడు.[2] విలియం డాల్రింపుల్ ఆయన " పేద కరణం లేక ఉపాధ్యాయుడి కనిపించే వాడని " అభిప్రాయపడ్డాడు.[2]
కవిగా, సూఫీగా జాఫర్ లోతైన సుఫీ ఉపన్యాసలలోని సూక్ష్మాలను జీర్ణించుకున్నాడు.[2] అదే సమయం ఆయనకు సూఫీయిజం అద్భుతాలను గురించిన సందేహాలు ఉండేవి.[2] సార్వభౌమత్వం, సూఫీపీర్‌గా ఆయన ఆధ్యాత్మికశక్తులు ఉన్న వ్యక్తిగా పరిగణించబడ్డాడు. .[2] ఒక సారి ఆయన అనుయాయులలో ఒకరు పాముకాటుకు గురైయ్యారు. ఆయనను బాగుచేయడానికి జాఫర్ " పాము రాయి ముద్ర"ను, ఆయన శ్వాసను వసిలిన జలాన్ని పంపి జలాన్ని పాముకాటుకు గురైన వ్యక్తితో త్రాగించనని పంపాడు.[3]
చక్రభర్తికి తావీజు (తయత్తు) లేక్ రక్ష రేఖులు పట్ల బలీయమైన విశ్వాసం ఉండేది. ప్రత్యేకంగా తన మూలశంఖ, అత్యంత బాధ వేదన కలిగించే వాపులకు వ్యాధికి తావీజు ఉపశాంతి నిచ్చేదని విశ్వసించే వాడు. .[3] తాను వ్యాధితో బాధపడుతున్న సమయంలో సూఫీ పీర్లను పిలపించి వారితో తన భార్యలలో కొందరు తావీజు విధానాన్ని శంకిస్తున్నారని కనుక వ్యాధి నివారణకు మరేదైనా చేయమని కోరాడు. వారు చక్రవర్తికి సమాధానమిస్తూ మంత్రించిన జలాన్ని ఇచ్చి దానిని త్రాగి ఉపశాంతి పొందమని చెప్పారు. ఆయనను ఎప్పుడూ హిందూ జ్యోతిష్కులు, పీర్లు, మాంత్రీకులు కలుసుకుంటూ ఉండేవారు. వారి సలహా మీద ఆయన కొందరు చేతబడి చేసేవారిని ఖైదుచేయించాడు.అయన తరచుగా దున్నపోతులను, ఒంటెలను బలి ఇప్పించేవాడు. అలాగే గుడ్లను పూడ్చిపెట్టడం వంటి క్రతువులను చేసేవాడు. అదనంగా జ్యోతిష ఫలితాలను ఇచ్చే ఉంగరాలను ధరించేవాడు. కొంత మంది సలహాను అనుసరించి ఆయన పేదవారికి పశువులను దానం ఇచ్చేవాడు. సుఫీ మందిరాలకు ఏనుగులను, ఖాదింలకు గుర్రాలను దానం చేసాడు.[3] జాఫర్ ప్రత్యేకంగా హిందూయిజం, ఇస్లాం మతసారం ఒకటేనని అభిప్రాయపడ్డాడు. [4] ఈ మిశ్రిత మతసిద్ధంతం ముఘల్ చక్రవర్తి సభలో ప్రవేశపెట్టబడి పోషించబడింది.ఇది హిందూ మరొయు ముస్లిం మిశ్రిత సంస్కృతికి నాంది అయింది.[4]
కుటుంబం , వంశం
మార్చుబహాదుర్ షా జఫర్‌కు నలుగురు భార్యలున్నారు. వారు:[5]
- బేగం అక్తర్ మహల్
- బేగం జీనత్ మహల్
- బేగం తాజ్ మహల్
అతని చట్టబద్ధమైన కుమారులు :
- మీర్జా దారా భక్త్ మిరంషాహ్ (1790-1849)
- మీర్జా షా రుక్
- మీర్జా ఫతహ్-ఉల్-ముల్క్ బహదూర్[6] (మిర్జా ఫఖృ అని పిలువబడ్డాడు) (1816-1856)
- మీర్జా మొఘల్ (1817- 22 1857 సెప్టెంబరు)
- మీర్జా ఖిజర్ సుల్తాన్ (18 ?? - 22 1857 సెప్టెంబరు)
- మీర్జా జవాన్ భక్త్ (మొఘల్)
- మీర్కా క్వైష్
- మీర్జా షా అబ్బాస్ (1845-1910)
అతని చట్టబద్ధమైన కుమార్తెలు:
- రబేయా బేగం
- బేగం ఫాతిమా సుల్తాన్
- కుల్సం జమాని బేగం
- రౌనాఖ్ జమాని బేగం (బహుశా ఒక మనుమరాలు, 1930 ఏప్రిల్ 30 మరణించింది)
మరణం
మార్చు1862లో తన 87వ సంవత్సరంలో ఆయన బలహీన పడ్డాడు. 1862 ఆయన ఆరోగ్యస్థితి క్షీణదశకు చేరుకుంది. బ్రిటిష్ కమీషనర్ హె.ఎన్. డేవిస్ " జాఫర్ జివితం అస్థిరంగా గడిచింది " అని వ్యాఖ్యానించాడు. తరువాత ఆయన నవంబరు 3 వరకు పడకలో ఉన్నాడు..[7] డేవిస్ 6న ఆయనకు గొంతు పక్షవాతం వచ్చింది. తరువాత చక్రవర్తి అంతిమ క్రొయలకు సన్నాహాలు ఆరంభించారు. జాఫర్ ఆవరణంలో ఆయనను సమాధిచేయడానికి సన్నాహాలు చేయబడ్డాయి. 1862 నవంబరు 7 శుక్రవారం ఉదయం 5 గంటలకు చివరి మొఘల్ చక్రవర్తి జాఫర్ తుదిశ్వాశను వదిలాడు. అదేరోజు సాయంకాలం 4 గంటలకు జాఫర్ భౌతికకాయం సమాధి చేయబడింది.[8]
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 William Dalrymple, The Last Mughal, p. 78
- ↑ 3.0 3.1 3.2 William Dalrymple, The Last Mughal, p. 79
- ↑ 4.0 4.1 (విలియం డాల్రింపుల్ " ది లాస్ట్ మొఘల్ 80 " )
- ↑ Farooqi, Abdullah. "Bahadur Shah Zafar Ka Afsanae Gam". Farooqi Book Depot. Archived from the original on 9 జూలై 2007. Retrieved 20 ఫిబ్రవరి 2019.
- ↑ "Search the Collections | Victoria and Albert Museum". Images.vam.ac.uk. 2009-08-25. Retrieved 2012-11-13.[permanent dead link]
- ↑ Dalrymple, The Last Mughal, p. 473
- ↑ Dalrymple, The Last Mughal, p. 474