బాచు అచ్యుతరామయ్య

బాచు అచ్యుతరామయ్య (సెప్టెంబర్ 23, 1926 - జూన్, 2018) రంగస్థల నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు.[1]

బాచు అచ్యుతరామయ్య
జననంసెప్టెంబర్ 23, 1926
గాజుల్లంక గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా
మరణంజూన్, 2018
గాజుల్లంక గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా
ఇతర పేర్లుబాచు అచ్యుతరామయ్య
వృత్తిరంగస్థల కళాకారులు
ప్రసిద్ధితెలుగు రంగస్థల నటుడు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు.

జీవిత విశేషాలుసవరించు

అచ్యుతరామయ్య 1926లో సెప్టెంబర్ 23న గాజుల్లంకలో జన్మించారు. యువజన సంఘంలో చేరి ప్రముఖ కమ్యూనిష్టు నాయకులు చల్లపల్లి నారాయణరావుతో కలిసి కమ్యూనిష్టు నడిపిన వివిధ ఉద్యమాలలో పాల్గొన్నారు. ప్రజనాట్య మండలి నిర్వహించిన ఫాసిష్టు వ్యతిరేక శిక్షణా శిబిరంలో శిక్షణ పాందారు. సుంకర సత్యనారాయణ వద్ద బుర్రకథ నేర్చుకున్నారు.

గాజుల్లంకలో వయోజన పాఠశాల, బ్రాంచి పోస్టాఫీస్ ఏర్పాటుచేశారు. గాజుల్లంకలో 36 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా, 40 సంవత్సరాలు బ్రాంచి పోస్ట్ మాస్టర్ గా పనిచేశారు. పదవీ విరమణ సమయంలో 40మంది కళాకారులను, క్రీడాకారులను, విద్యావేత్తలను సన్మానించారు.

రంగస్థల ప్రస్థానంసవరించు

1958 ప్రాంతంలో విరివిగా నాటకాలలో నటించారు.

 • పల్లెపడుచు
 • పెత్తందారు
 • కూలిపిల్ల
 • బాలనాగమ్మ
 • రైతుబిడ్డలు
 • పూలరంగడు
 • ప్రతిమ
 • పోరంబోకు
 • ప్రజాకంటకులు

మొదలైన నాటకాలలో నాయక పాత్రలు పోషించారు.

మరణంసవరించు

2018, జూన్ నెలలో మరణించారు.

మూలాలుసవరించు

 1. ప్రజాశక్తి (20 June 2018). "అచ్యుతరామయ్య సేవలు చిరస్మరణీయం". Archived from the original on 23 September 2018. Retrieved 23 September 2018.
 • బాచు అచ్యుతరామయ్య, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వరశర్మ, పుట. 143.