బాజిరెడ్డి గోవర్దన్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

బాజిరెడ్డి గోవర్దన్ (Bajireddy Goverdhan) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

బాజిరెడ్డి గోవర్ధన్
బాజిరెడ్డి గోవర్దన్


పదవీ కాలం
2014–18,  2018 - ప్రస్తుతం
నియోజకవర్గం నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
2021 సెప్టెంబరు 16 - 2023 అక్టోబరు 05

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి వినోద,కీ. శే. శోభ [1]

జననం, విద్య మార్చు

గోవర్ధన్ దిగంబర్, శాంతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలంలోని చిమన్‌పల్లె గ్రామంలో జన్మించాడు.[2] అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి 1992లో బిఏ పూర్తిచేశాడు. ఆ తరువాత కొంతకాలం వ్యవసాయం చేశాడు.[3]

వ్యక్తిగత జీవితం మార్చు

గోవర్ధన్ కు వినోద, శోభారాణితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు మార్చు

గోవర్ధన్ స్వతంత్రంగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1973లో పోలీస్ పటేల్‌గా పనిచేసి, 1981లో చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1986లో సిరికొండ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[4] 1986లో ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ అయ్యాడు. 1994లో ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణ దేవి చేతిలో 14,043 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తరువాత అతను పిఏసిఎస్ ఛైర్మన్‌గా పనిచేశాడు. హౌసింగ్ బోర్డు కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు.

గోవర్ధన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 1999–2004 వరకు ఆర్మూర్ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా,[5] 2004–2009 వరకు బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[6] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. శ్రీనివాస్ పై 26,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[7][8] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేకుల భూపతిరెడ్డి పై 29,855 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[9][10] 2015–2018 వరకు, తెలంగాణ శాసనసభ వక్ఫ్ భూములపై ​​హౌస్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు.

బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ 2021 సెప్టెంబరు 16న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) చైర్మ‌న్‌గా నియమితుడై,[11] సెప్టెంబరు 20న బాధ్యతలు చేపట్టాడు.[12]

హోదాలు మార్చు

  1. సర్పంచ్, చిమ్మన్‌పల్లి గ్రామ పంచాయతీ
  2. ప్రెసిడెంట్, ఎంపిపి, సిరికొండ మండలం (రెండుసార్లు)
  3. ఛైర్మన్, పిఏసిఎస్, సిరికొండ
  4. డైరెక్టర్, ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్
  5. చైర్మన్, హౌసింగ్ బోర్డు కమిటీ
  6. ఛైర్మన్, వక్ఫ్ భూములపై ​​హౌస్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర శాసనసభ (10.01.2015 - 06.09.2018)
  7. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మ‌న్‌ (2021 సెప్టెంబరు 16 - 2023 అక్టోబరు 05)

ఇతర వివరాలు మార్చు

చైనా, ఇజ్రాయెల్, జపాన్, కువైట్, మలేషియా, నేపాల్, ఖతర్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (7 July 2021). "ఎమ్మెల్యే బాజిరెడ్డికి సతీవియోగం". Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
  2. admin (2019-01-10). "Nizamabad Rural MLA Bajireddy Govardhan". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-23.
  3. Sakshi (22 November 2018). "బరిలో ఇంజినీర్లు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  4. Eenadu (26 October 2023). "ఎంపీపీల నుంచి ఎమ్మెల్యేలుగా." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  5. Sakshi (3 November 2018). "నిజామాబాద్‌ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  6. Sakshi (13 November 2018). "సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..!". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  7. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  8. Sakshi (19 November 2018). "అభ్యర్థుల ప్రొఫైల్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  9. "Nizamabad Urban Assembly (Vidhan Sabha) (MLA) Elections Result Live". www.news18.com. Retrieved 2021-08-23.
  10. "Nizamabad (Urban) Assembly Election result 2018: TRS' Bigala Ganesh wins". www.timesnownews.com. Retrieved 2021-08-23.
  11. 10TV (16 September 2021). "Bajireddy Govardhan : తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్" (in telugu). Archived from the original on 16 September 2021. Retrieved 16 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  12. Namasthe Telangana (20 September 2021). "ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్దన్‌". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.