బాన్స్‌వాడ

కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం లోని పట్టణం

బాన్సువాడ, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, బాన్స్‌వాడ మండలం లోని గ్రామం.[3] ఈ పట్టణం కామారెడ్డి జిల్లా పశ్చిమ భాగంలో ఉంది. ఇది పురపాలక సంఘం హోదాకలిగిన పట్టణం. అంతకుముందు, బాన్స్‌వాడ 20 ఎన్నికల వార్డులతో కలిగిన నోటిఫైడ్ గ్రామ పంచాయతీగా ఉండేది. 2018 జనవరి 11 న బాన్స్‌వాడను మునిసిపాలిటీ గ్రేడ్ 3 గా అప్‌గ్రేడ్ చేశారు. 2019 జులైలో బాన్సువాడ పురపాలకసంఘం 19 ఎన్నికల వార్డులుగా విభజించారు.

బాన్స్‌వాడ
పట్టణం
బాన్స్‌వాడ is located in Telangana
బాన్స్‌వాడ
Coordinates: 18°23′00″N 77°53′00″E / 18.3833°N 77.8833°E / 18.3833; 77.8833
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణా
జిల్లాకామారెడ్డి
Government
 • Typeమునిసిపాలిటీ
 • Bodyమునిసిపల్ కౌన్సిల్
 • ఎం.ఎల్.ఎ.పోచారం శ్రీనివాసరెడ్డి
విస్తీర్ణం
 • Total15.96 కి.మీ2 (6.16 చ. మై)
Elevation
371 మీ (1,217 అ.)
జనాభా
 (2011)[2]
 • Total28,384[1]
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (ఐ.ఎస్.టి.)
పిన్‌కోడ్
503187
ఎస్.టి.డి.కోడ్08466
Vehicle registrationTS 17
లోక్ సభ నియోజకవర్గంజహీరాబాద్
శాసనసభ నియోజకవర్గంబాన్స్‌వాడ

భౌగోళిక స్థితి

మార్చు

బాన్స్‌వాడ 18.3833°N 77.8833°E. సముద్రమట్టానికి 1220 అడుగుల ఎత్తులో ఉంది.[4]

గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా గణాంకాల నివేదిక ప్రకారం పట్టణ జనాభా 28,384, ఇందులో 13,748 మంది పురుషులు, 14,636 మంది మహిళలు ఉన్నారు.[5] పట్టణంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3351, ఇది బాన్సువాడ పట్టణ మొత్తం జనాభాలో 11.81%. బాలల లైంగిక నిష్పత్తి 947 గా ఉంది. బాన్స్‌వాడలో పురుషుల అక్షరాస్యత 82.36% కాగా, మహిళా అక్షరాస్యత 66.03%.బాన్సువాడ పట్టణ పరిధిలో మొత్తం 6,216 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది. దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను బాన్సువాడ స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. ఈ సంస్థకు సెన్సస్ టౌన్ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా అధికారం ఉంది.[5]

రవాణా సౌకర్యం

మార్చు

బాన్స్‌వాడ హైదరాబాద్ - మెదక్- బోధన్ - భైంసా జాతీయ రహదారి నంబర్ 765 మార్గంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్లు నిజామాబాద్, బోధన్, కామారెడ్డి వద్ద ఉన్నాయి. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, బాన్స్‌వాడ నుండి అనేక నగరాలు పట్టణాలకు బస్సు సేవలను నిర్వహిస్తుంది. బాన్స్‌వాడ (బిఎస్‌డబ్ల్యుడి) లో టిఎస్‌ఆర్‌టిసి డిపో ఉంది. ఇది 6 మార్చి 1993 న ప్రారంభమైంది.

బస్తీ దవాఖాన

మార్చు

బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ చావిడి వద్ద 13 లక్షల రూపాయలతో నిర్మించిన భవనంలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానను 2022 డిసెంబరు 11న తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ కలిసి ప్రారంభించారు. ప్రజలు అందుబాటులో ఉండటానికి వీలుగా ఏర్పాటుచేసిన ఈ బస్తీదవాఖానలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేసి అవసరమైన మందులు అన్ని ఉచితంగా అందిస్తారు.[6]

మాతాశిశు దవాఖాన

మార్చు

బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు సేవలను అందించడానికి బాన్సువాడలో 100 పడకలతో మాతాశిశు దవాఖాన (ప్రసూతి, శిశు వైద్యశాల) ఏర్పాటు చేయబడింది.[7] ఈ దవఖానాలో అధునాతన సాంకేతిక వైద్య పరికరాలను, మౌలిక సౌకర్యాలు, ఎస్‌ఎన్‌సీయూ, పక్కనే బ్లడ్‌ బ్యాంక్‌ అందుబాటులో ఉంచబడ్డాయి.

2023 ఆగస్టులో బాన్సువాడలోని మాతాశిశు దవాఖాన ఒక్క నెలలో అత్యధికంగా 504 ప్రసవాలు (298 సుఖప్రసవాలు, 206 సిజేరియన్‌ కాన్పులు) జరిగిన దవాఖానగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.[8]

తల్లి పాల ప్రాముఖ్యతను, బిడ్డ పుట్టిన అరగంటలోనే ముర్రుపాలు అందించడంలో జాతీయస్థాయిలో బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఇన్షియేటివ్‌ అక్రెడిటేషన్‌ అవార్డు, రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించేలా ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతోనూ అవార్డులు, నాలుగుసార్లు కాయకల్ప అవార్డు, ఎకోఫ్రెండ్ల్లీ అవార్డులను ఈ దవఖానా అందుకుంది.[9]

మూలాలు

మార్చు
  1. "Banswada Population Census 2011". Census 2011. Retrieved 5 April 2018.
  2. 2.0 2.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 11, 36. Retrieved 11 June 2016.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2018-08-11.
  4. "Maps, Weather, and Airports for Banswada, India". www.fallingrain.com. Retrieved 2020-06-19.
  5. 5.0 5.1 "Banswada Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-19.
  6. telugu, NT News (2022-12-12). "బస్తీ దవాఖానలతో వైద్యం చేరువ". www.ntnews.com. Archived from the original on 2022-12-12. Retrieved 2022-12-17.
  7. "Banswada Maternity Hospital records highest deliveries". www.deccanchronicle.com. 2023-09-03. Archived from the original on 2023-09-04. Retrieved 2023-09-07.
  8. telugu, NT News (2023-09-03). "Kamareddy | బాన్సువాడ దవాఖాన సరికొత్త రికార్డు.. ఒకే నెలలో 504 ప్రసవాలు". www.ntnews.com. Archived from the original on 2023-09-03. Retrieved 2023-09-07.
  9. telugu, NT News (2023-09-04). "బాన్సువాడ దవాఖాన.. అవార్డుల అడ్డా". www.ntnews.com. Archived from the original on 2023-09-04. Retrieved 2023-09-07.

వెలుపలి లంకెలు

మార్చు