ప్రధాన మెనూను తెరువు
  ?Baramati
మహారాష్ట్ర • భారతదేశం
Baramatiను చూపిస్తున్న పటము
Location of Baramati
అక్షాంశరేఖాంశాలు: 18°09′N 74°35′E / 18.15°N 74.58°E / 18.15; 74.58Coordinates: 18°09′N 74°35′E / 18.15°N 74.58°E / 18.15; 74.58
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 538 మీ (1,765 అడుగులు)
జిల్లా(లు) Pune జిల్లా
జనాభా 51,342 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 413102
• +912112
• MH 42

బారామతి భారత దేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో పూణే జిల్లాలో ఉన్న ఒక నగరం , మున్సిపల్ కౌన్సిల్ కూడా.

బారామతిలో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయమే. చెరుకు, ద్రాక్ష, ప్రత్తితో సహా ప్రధాన ఆహార పంటలు పండుతాయి. మధ్య ఆసియా, యూరప్ మార్కెట్లకు ఇక్కడ నించి ద్రాక్ష, చక్కెర ఎగుమతి అవుతాయి.

బారామతి మహారాష్ట్రకు పొలిటికల్ పవర్ హౌస్ వంటిది.

చరిత్రసవరించు

మహారాష్ట్రలో బారామతి గొప్ప చారిత్రాత్మక స్థలంగా ప్రసిద్ధికెక్కింది. ఇది కరహా నదీ తీరాన ఉంది. ఈ నగరం చారిత్రాత్మక ప్రాముఖ్యత శ్రీ బాబూజీ నాయక్ వలన సంతరించుకుంది.

ఈ పట్టణానికి సుమారు 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. సుమారు క్రీ. శ.750లో నిర్మించిన రెండు పురాతన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. వాటిలో ఒకటి, నదికి పశ్చిమ తీరాన ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం కాగా, రెండవది నదికి తూర్పు తీరంలో ఉన్న శ్రీ సిద్ధేశ్వరాలయం. సిద్ధేశ్వరాలయం వాస్తుశిల్పకళకు అద్భుతమైన తార్కాణంగా పేర్కొంటారు. బ్రహ్మాండమైన నందీశ్వరుని విగ్రహం కలిగిన ఉన్న ఈ మందిరం బాబూజీ నాయక్ అంతఃపురానికి దగ్గరలోనే ఉంది. మరొక సుప్రసిద్ధ కవి శ్రీధర స్వామి విరచితమైన "శివ లీలామృతం" మహా కావ్యంలో ఈ రెండు దేవాలయాల ప్రస్తావన ఉంది.

దేవాలయాలుసవరించు

1227లో నిర్మితమైన సిద్ధేశ్వర మహాదేవుని (శంకర) మందిరం ఇక్కడ బహుళ ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం కేవలం రాళ్లతోనే నిర్మించారు.

భౌగోళిక స్థితిసవరించు

బారామతి18°09′N 74°35′E / 18.15°N 74.58°E / 18.15; 74.58 [1] వద్ద ఉంది. దాని సగటు ఎత్తు 538 మీటర్లు (1765 అడుగులు).

బారామతి మార్చి నుండి మే వరకూ మండు వేసవి కాలం చూస్తుంది. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకూ శీతాకాలంలో, పొడి శీత గాలులనూ అనుభవిస్తుంది. ముఖ్యంగా ఈ నగరంలో జూన్ నించి ఆగస్టు వరకూ అత్యల్ప వర్షపాతం సుమారు 60 సెం.మీ.ఉంటుంది. బారామతిలో వేసవిలో వాతావరణం పొడిగానూ,బాగా వేడిగానూ ఉంటుంది. అలాగే శీతాకాలపు రోజుల్లో ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కి దిగిపోతుంది. చలికాలపు రాత్రి ఉష్ణోగ్రత అత్యల్పంగా 8 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. వేసవిలో, సర్వ సాధారణంగా ఇక్కడ ఉండే పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ మించిపోతుంది. నవంబరు నెలలో సాధారణంగా, బారామతిలో మంచి ఆహ్లాదభరితమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయాన్ని ( మరాఠీలో గులాబీ ఠండీ) సంతులిత శీతల గాలులు అంటారు.

ఆర్థిక వ్యవస్థసవరించు

 
డైనమిక్స్ డైరీ ప్లాంట్ బారామతి

బారామతి, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. ఈ ప్రాంతపు నేల చాలా సారవంతమైనది. నీరా నదీ జలాల నించి ఏర్పడిన కాలువలు వ్యవసాయ భూములకు సాగునీటిని అందిస్తాయి.

ముఖ్య పంటల్లో చెరకు, ద్రాక్ష, జొన్న, ప్రత్తి, గోధుమ కూడా ఉన్నాయి. ద్రాక్ష, పంచదార ఇక్కడ నించి ఎగుమతి అవుతాయి. సిటీలో ప్రత్తి, ఆహార ధాన్యాల కోసం అతి పెద్ద మార్కెట్ స్థలం ఉంది.

వ్యవసాయమే కాకుండా స్టీల్ ప్రోసెసింగ్ నించి వైన్ తయారీ వరకూ బారామతి మరెన్నో పరిశ్రమలకు పెట్టింది పేరు. శరద్ పవార్ తో కలిసి విజయ మాల్యా ఇక్కడ ఒక వైనరీ ప్రాజెక్టు నెలకొల్పబోతున్నారు.

బారామతి-భిగ్వాన్ రోడ్ లో, బారామతి టౌన్ మున్సిపల్ లిమిట్స్ కి అవతల 5 కిలోమీటర్ల వెలుపలి వరకూ విస్తరించి ఉన్న 800 హెక్టార్ల భూమిని బారామతి MIDC (మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) పారిశ్రామిక ప్రాంతంగా ఉపయోగిస్తోంది.

బారామతిలో ఇండియన్ సీమ్ లెస్ మెటల్ ట్యూబ్స్ 0}(ISMT){{/0}, భారత్ ఫోర్జ్, పియాగ్గియో ఆటోమొబైల్స్, డైనమిక్స్ డైరీ, బారామతి గ్రేప్ ఇండస్ట్రీస్ , స్పాంటెక్స్ లిమిటెడ్, సోమానీ టెక్స్ టైల్స్ వంటి పరిశ్రమలు నెలకొని ఉన్నాయి.

బారామతి పెద్ద పరిశ్రమలతో బాటు ఇతరత్రా లఘు తరహా పరిశ్రమలకూ, మధ్య తరహాకి చెందిన పరిశ్రమలకూ కూడా ఈ ప్రాంతంలో ఆతిథ్యం ఇచ్చింది.

జనాభాసవరించు

As of 2001భారత జనాభా [2] బారామతి జనాభా సంఖ్య 51,342. మొత్తం జనాభాలో పురుషుల శాతం 52%గా ఉంటే, స్త్రీల శాతం 48%గా ఉంది. బారామతి సగటు అక్షరాస్యతా ప్రమాణం 73%గా ఉండి, జాతీయ సగటు 59.5% కంటే హెచ్చు స్థాయిలో నిలబడింది. పురుషుల అక్షరాస్యతా ప్రమాణం56% కాగా, స్త్రీలలో ఆ శాతం 44%గా ఉంది. జనాభాలో 12% 6 ఏళ్ల లోపు వయసువారు ఉన్నారు.

రవాణాసవరించు

బారామతి రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రంలో గల పెద్ద నగరాలతో కలపబడింది. బారామతి పూణే నించి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రోడ్డు మార్గం ద్వారా ఎన్నో ప్రధాన రహదార్లతో అనుసంధానించబడి ఉంది. రైలు మార్గం ద్వారా కూడా బారామతి పూణేతో చక్కగా అనుసంధానింపబడి ఉంది. బారామతికి ఒక విమానాశ్రయం కూడా ఉంది. అందులో ప్రస్తుతం ఒక ఫ్లైయింగ్ స్కూల్ నడుస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో డొమిస్టిక్ ఎయిర్ పోర్ట్ నెలకొల్పడానికి బారామతి అయితేనే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. పెద్ద ఎయిర్ క్రాఫ్టు కి అనుకూలంగా ఉండేలా రన్ వే విస్తరింపబడింది. ముంబైకి చెందిన సిగ్మా సిక్స్ ప్రాజెక్ట్స్ ఆ నిర్మాణం చేపట్టింది. నగరంలో రోడ్ల నిర్వహణ చాలా బాగుంటుంది.నగరానికి చుట్టూరా కైవారం వెంబడే ఒక రింగ్ రోడ్ నిర్మించారు.

విద్యసవరించు

విద్యా రంగంలో బారామతికి తనకంటూ ఒక బలమైన ముద్ర ఉంది. గత దశాబ్ద కాలంలో ఇక్కడకి అనేకమైన స్కూళ్లూ, కాలేజీలూ మొదలుకొని ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, లా వరకూ అనేక విద్యా సంస్థలు రావడంతో బారామతి ఒక ప్రముఖమైన విద్యా కేంద్రంగా భాసిల్లుతోంది.

బారామతీ , దానికి చుట్టుప్రక్కల మూడు ప్రధాన ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలోకెల్లా పేరు మోసిన విద్యా సంస్థలు ఉన్నాయి.

విద్యా ప్రతిష్ఠాన్[3] ప్రాథమిక విద్య నించీ మాస్టర్స్ డిగ్రీ వరకూ వివిధ కోర్సులని అందిస్తోంది. విద్యానగరిలో ప్రాథమిక పాఠశాలతో బాటు ఆర్ట్స్, కామర్స్, సైన్సు కాలేజీలతో బాటు లా కాలేజీ, ఇంజనీరింగ్ [4], కాలేజీ, స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, ఎం.బి.ఏ., ఎం.సి.ఎ.కోర్సులు కూడా నడుస్తున్నాయి.

తుల్జారామ్ చతుర్ చంద్ కాలేజీకి ఉన్న జూనియర్ కాలేజీ సీనియర్ కాలేజీలు తగినంత మంది స్టాఫ్ తో , మార్కెట్ లో ఉన్న అధునాతమైన పద్ధతులను అనుసరించి నడుస్తున్నాయి. ఇక్కడి జూనియర్ కాలేజీ జిల్లాలో బెస్ట్ కాలేజీగా FC, వాడియా కాలేజీలతో పోటీ పడుతుంది. సీనియర్ కాలేజీ కూడా సైన్సు, కామర్స్, ఆర్ట్స్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ కోర్సులు నిర్వహిస్తోంది.

శారదాబాయి పవార్ క్యాంపస్ కేవలం బాలికల కోసమే ప్రత్యేకంగా కాలేజీ నడుపుతోంది. ఇక్కడి కోర్సుల్లో జూనియర్ కాలేజీలో బేసిక్ ఎడ్యుకేషన్ కోర్సు, ఇంకా ఎడ్యుకేషన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సు కూడా అందిస్తున్నారు.

మాలేగావ్ [5] క్యాంపస్ టెక్నాలజీ, మేనేజ్ మెంట్ రంగాల్లో, ఎక్కువ కోర్సులు అందిస్తోంది. క్యాంపస్ కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒక మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్, ఒక ఫార్మసీ కాలేజీ ఉన్నాయి.

బారామతిలో ఒక టెక్నికల్ హై స్కూల్ కూడా ఉంది. అక్కడ అందించే వివిధ రకాలైన టెక్నికల్ కోర్సులు ఇంజనీరింగ్ కి కావలసిన మేధో సంపదని పాఠశాల స్థాయిలోనే దృఢతరం చేస్తాయి.

బారామతిలో M.E.S.( మహారాష్ట్ర ఎడ్యుకేషనల్ సొసైటీ) ఉన్నత పాఠశాల 100 ఏళ్ల పురాతనమైనది. ఈ M.E.S. ఉన్నత పాఠశాల 3 మార్చి 1911 నాటి నించీ ఉంది. ఇప్పుడు ఈ స్కూల్ వందేళ్ల కాలావధిని పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది వేడుకలు జరుపుకుంటోంది. బారామతి లోని పటాస్ రోడ్ , శ్రీ ఛత్రపతి శాహు ఉన్నత పాఠశాల & జూనియర్ కాలేజీలో శరద్ పవార్ 1954-55 విద్యా సంవత్సరంలో 8వ క్లాస్ పూర్తి చేశారు. ఇదే స్కూల్ లో ఆగస్టు, 1967లో శరద్ పవార్ ప్రతిభాతాయిని వివాహమాడారు కూడా.బారామతిలో శ్రీ ఛత్రపతి శాహు హై స్కూల్ & జూనియర్ కాలేజీ , పద్మభూషణ్ డా. కర్మవీర్ పేగొండ పాటిల్ (అన్నా)శాహు బోర్డింగ్ తో కలిసి 1954లో మొట్టమొదట నెలకొల్పారు. విద్యా రంగంలో గొప్ప పేరు గాంచిన 'రాయత్ శిక్షణ సంస్థ, సతారా'కి ఈ స్కూల్ ఒక శాఖ. ఈ వివరాలు ఘవాలే డి.ఎ. అసిస్టెంట్ టీచర్ శ్రీ ఛత్రపతి షాహు ఉన్నత పాఠశాల & జూనియర్ కాలేజీ , బారామతి ద్వారా అందించబడ్డాయి.

సుప్రసిద్ధ వ్యక్తులుసవరించు

బారామతిలోని కటేవాడీ భారత రాజకీయాల్లో పేరెన్నిక గన్న నేత , ప్రస్తుత ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ శాఖామాత్యులుగా ఉంటున్న శ్రీ శరద్ పవార్ స్వగ్రామం. బారామతిలో శ్రీ సోమేశ్వర మహారాజ్ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది.

అనికేత్ మైండ్ ఫ్రం హోల్, బారామతి

ఇవి కూడా చూడండిసవరించు

సూచనలుసవరించు

  1. 2] ^ ఫాలింగ్ రైన్ జెనోమిక్స్, ఇంక్ - బారామతి
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. మూలం నుండి 2004-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-01. Cite web requires |website= (help)
  3. [6] ^ విద్యా ప్రతిష్ఠాన్
  4. [7] ^ విపిసిఓఇ బారామతి
  5. [8] ^ ఎస్ వి పి ఎమ్ సంస్థలు

బాహ్య లింకులుసవరించు


మూస:Pune-geo-stub

"https://te.wikipedia.org/w/index.php?title=బారామతి&oldid=2693828" నుండి వెలికితీశారు