బార్క్లేస్
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
బార్క్లేస్ PLC (మూస:Lse, NYSE: BCS) యునైటెడ్ కింగ్డంలోని లండన్ ప్రధాన స్థావరంగాగల ఒక ప్రపంచ స్థాయి ఆర్ధిక సేవల సంస్థ. 2010 నాటికి, ఇది ప్రపంచం యొక్క 10వ-అతిపెద్ద బాంకింగ్ మరియు ఆర్ధిక సేవల సమూహం మరియు ఫోర్బ్స్ పత్రిక యొక్క మిశ్రమ ప్రమాణాన్ని అనుసరించి 21వ-అతిపెద్ద సంస్థ.[3] ఇది ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలలో 50 దేశాలు మరియు భూభాగాలలో కార్యకలాపాలను కలిగి, సుమారు 48 మిలియన్ల ఖాతాదారులను కలిగి ఉంది.[4] 2010 జూన్ 30 నాటికి దీని మొత్తం ఆస్తులు €1.94 ట్రిలియన్లుగా ఉన్నాయి, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా ఆస్తులు ఉన్న మూడవ అతిపెద్ద బ్యాంకు (BNP పారిబస్ మరియు HSBC తరువాత).[5]
210px | |
రకం | Public limited company మూస:Lse బరువు త్తగాలి |
---|---|
స్థాపితం | 1690 |
ప్రధానకార్యాలయం | One Churchill Place, Canary Wharf, London, United Kingdom |
సేవా ప్రాంతము | Worldwide |
కీలక వ్యక్తులు | Marcus Agius (Group Chairman) Robert Diamond (Group Chief Executive) |
పరిశ్రమ | Banking Financial services |
ఉత్పత్తులు | Retail banking Commercial banking Investment banking Investment management Private Equity |
ఆదాయం | £29.954 billion (2009)[1] |
నిర్వహణ రాబడి | £4.585 billion (2009)[1] |
మొత్తం ఆదాయము | £3.511 billion (2009)[1] |
ఆస్తులు | £1.378 trillion (2009)[1] |
మొత్తం ఈక్విటీ | £47.27 billion (2009)[1] |
ఉద్యోగులు | 145,000 (2010)[2] |
అనుబంధ సంస్థలు | Barclays Bank PLC |
వెబ్సైటు | Barclays.com |
బార్క్లేస్ ఒక సార్వత్రిక బ్యాంకు మరియు రెండు వ్యాపార 'సమూహాలతో' వ్యవస్థీకృతమైఉంది: కార్పోరేట్& ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్, మరియు గ్లోబల్ రిటైల్ బ్యాంకింగ్.[6] కార్పోరేట్ & ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సమూహం మూడు వ్యాపార విభాగాలను కలిగి ఉంది: బార్క్లేస్ కాపిటల్ (ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్), బార్క్లేస్ కార్పోరేట్ (కమర్షియల్ బాంకింగ్) మరియు బార్క్లేస్ వెల్త్ (వెల్త్ మేనేజ్మెంట్).[6] గ్లోబల్ రిటైల్ బ్యాంకింగ్ సమూహం నాలుగు వ్యాపార విభాగాలను కలిగి ఉంది: బార్క్లేకార్డ్ (క్రెడిట్ కార్డ్ మరియు ఋణ ఏర్పాటు), బార్క్లేస్ ఆఫ్రికా, UK రిటైల్ బ్యాంకింగ్ అండ్ వెస్ట్రన్ ఐరోపా రిటైల్ బ్యాంకింగ్.[6]
దీని ప్రాథమిక లిస్టింగ్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో జరింగింది మరియు ఇది FTSE 100 ఇండెక్స్ లో భాగం. దీని సెకండరీ లిస్టింగ్ న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో జరిగింది.
చరిత్రసవరించు
ప్రారంభ సంవత్సరాలుసవరించు
జాన్ ఫ్రిం మరియు థామస్ గోల్డ్ లండన్‌లోని లోమ్బార్డ్ స్ట్రీట్‌లో బంగారపుపని బ్యాంకర్లుగా వర్తకాన్ని 1690లో ప్రారంభించినప్పటి నుండి ఈ బ్యాంకు తన మూలాలను పొందింది. స్థాపకులలో ఒకరైన జాన్ ఫ్రేం అల్లుడైన జేమ్స్ బార్క్లే, వ్యాపారంలో భాగస్వామిగా మారిన 1736వ సంవత్సరం నుండి "బార్క్లేస్" అనే పేరు ఈ వ్యాపారంతో జతచేయబడింది. [7] 1728లో, ఈ బ్యాంకు 54 లోమ్బార్డ్ స్ట్రీట్‌కి మారింది, ఇది 'నల్ల విప్పుకున్న రాబందు చిహ్నం'తో గుర్తించబడి, కాలాంతరంలో ఈ బ్యాంకు యొక్క గుర్తింపులో కీలక భాగంగా మారింది.[8]
1776లో ఈ సంస్థ "బార్క్లే, బెవాన్ అండ్ బెనింగ్"గా రూపుదిద్దుకొని 1785 వరకు ఆ విధంగా కొనసాగింది, ఆ సమయంలో బార్క్లే కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకున్న జాన్ ట్రిట్టాన్, మరొక భాగస్వామిగా అనుమతించబడ్డాడు, ఈ వ్యాపారం అప్పుడు "బార్క్లే, బెవాన్, బార్క్లే మరియు ట్రిట్టాన్"గా మారింది.[9]
1896లో లండన్ మరియు ఇంగ్లీష్ విభాగాలలోని అనేక బ్యాంకులు, ప్రత్యేకించి డార్లింగ్టన్ యొక్క బ్యాక్ హౌస్'స్ బ్యాంక్ మరియు నార్విచ్ యొక్క గుర్నే'స్ బ్యాంక్, బార్క్లేస్ అండ్ కో., అనే జాయింట్-స్టాక్ బ్యాంకు క్రింద విలీనమయ్యాయి. 1905 మరియు 1916 మధ్య చిన్న ఇంగ్లీష్ బ్యాంకులను కలుపుకోవడం ద్వారా బార్క్లేస్ తన శాఖల నెట్‌వర్క్‌ను విస్తృతపరచుకుంది.
1918లో బార్క్లేస్ యొక్క సంయోగం లండన్, ప్రొవిన్షియల్ అండ్ సౌత్ వెస్ట్రన్ బ్యాంక్తోను మరియు 1919లో బ్రిటిష్ లినెన్ బ్యాంక్‌ను, బార్క్లేస్ బ్యాంక్ స్వాధీనం చేసుకున్నపుడు మరింత విస్తరణ జరిగింది, అయితే బ్రిటిష్ లినెన్ బ్యాంక్ ఒక ప్రత్యేక బోర్డ్ అఫ్ డైరక్టర్లను నిలుపుకొని తన స్వంత బ్యాంకు నోట్లను జారీచేయడం కొనసాగించింది (చూడుము పౌండ్ స్టెర్లింగ్ యొక్క బ్యాంకు నోట్లు). 1924లో నేషనల్ బ్యాంక్ అఫ్ కింగ్స్టన్ యొక్క స్వాధీనం పూర్తి కావచ్చింది, కానీ ముగింపుకు మూడు రోజుల ముందు నిలిచిపోయింది.
యుద్ధానంతర పరిస్థితులుసవరించు
1965లో బార్క్లేస్ US అనుబంధ సంస్థ, శాన్ ఫ్రాన్సిస్కోలోని బార్క్లేస్ బ్యాంక్ అఫ్ కాలిఫోర్నియాను స్థాపించింది.
1966లో UKలోని మొట్టమొదటి క్రెడిట్ కార్ట్ అయిన బార్క్లే కార్డ్ ప్రారంభించబడింది మరియు 1967లో బార్క్లేస్ ప్రపంచంలోని మొదటి నగదు యంత్రం ATMను ఉత్తర లండన్‌లోని ఎన్ఫీల్డ్లో స్థాపించింది. బ్రిటిష్ నటుడు రెగ్ వార్నే ఈ ATMను మొట్టమొదట ఉపయోగించాడు.
1969లో మార్టిన్స్ బ్యాంక్ మరియు లాయిడ్స్ బ్యాంక్‌తో విలీనం, మెర్జర్స్ అండ్ మొనోపోలీస్ కమిషన్ ద్వారా అడ్డగించబడింది, అయితే మార్టిన్స్ బ్యాంక్‌ను తనకు తానుగా స్వాధీనపరచుకోవడం అంగీకరించబడింది. అదే సంవత్సరంలో బ్రిటిష్ లినెన్ బ్యాంక్ అనుబంధసంస్థ బ్యాంక్ అఫ్ స్కాట్ లాండ్కు 25% వాటా మారకంతో అమ్మివేయబడింది, ఈ వ్యవహారం మార్చి 1971 నుండి అమలులోకి వచ్చింది.
1974లో, ద్వితీయ బ్యాంకింగ్ రంగం పడిపోయిన తరువాత, బార్క్లేస్ మర్కెంటైల్ క్రెడిట్ కంపెనీని కొనుగోలు చేసింది.
1980లో, వాణిజ్య ఋణాన్ని మరియు స్వాధీనం చేసుకోబడిన అమెరికన్ క్రెడిట్ కార్పోరేషన్‌ను తన కార్యకలాపాలలో చేర్చుకొని విస్తృత పరచుకోవడానికి బార్క్లేస్ బ్యాంక్ తన పేరును బార్క్లేస్అమెరికన్గా మార్చుకుంది.[10]
1982లో, శనివారం ఉదయం పూట తన బ్యాంక్ శాఖలను తెరచిన మొట్టమొదటి బ్యాంక్ బార్క్లేస్, ఇరవై సంవత్సరాల తరువాత ఈ పద్ధతి ముగిసింది. రెండు సంవత్సరాల తరువాత, 1984లో బార్క్లేస్ రికార్డుస్థాయిలో లాభాలను ఆర్జించింది.
తరువాత సంవత్సరంలో బార్క్లేస్ బ్యాంక్ మరియు బార్క్లేస్ బ్యాంక్ ఇంటర్నేషనల్ విలీనమయ్యాయి: సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా పూర్వ బార్క్లేస్ బ్యాంక్ PLC ఒక గ్రూప్ హోల్డింగ్ సంస్థగా మారి, బార్క్లేస్ PLCగా పేరు మార్చబడింది మరియు UK చిల్లర బ్యాంకింగ్ BBI క్రింద సమీకృతపరచబడి బార్క్లేస్ బ్యాంక్ PLCగా పేరుపెట్టబడింది.
1985లో బార్క్లేస్ యునైటెడ్ కింగ్డంలో మొదటి డెబిట్ కార్డ్ అయిన కనెక్ట్ ను ప్రవేశపెట్టింది. ఈ కనెక్ట్ బ్రాండ్ జూలై 2010వరకు బార్క్లేస్ యొక్క అన్ని డెబిట్ కార్డ్‌లపై ఉపయోగించబడింది.
దక్షిణ ఆఫ్రికా వ్యాపార అమ్మకంసవరించు
దక్షిణ ఆఫ్రికా మరియు దాని వర్ణ వివక్ష ప్రభుత్వంలో జోక్యానికి వ్యతిరేకంగా నిరసనలను ఎదుర్కున్న తరువాత, 1986లో బార్క్లేస్, బార్క్లేస్ నేషనల్ బ్యాంక్ అనే పేరు క్రింద నిర్వహించబడుతున్న తన దక్షిణ ఆఫ్రికా వ్యాపారాన్ని అమ్మివేసింది. అదే సంవత్సరంలో, BZWను స్థాపించి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ పై బిగ్ బాంగ్ ప్రయోజనాన్ని పొందటానికి జోటే & బెవాన్ మరియు వెడ్ డుర్లచెర్లను కొనుగోలు చేసింది.
1988లో బార్క్లేస్, బార్క్లేస్ బ్యాంక్ అఫ్ కాలిఫోర్నియాను వెల్ల్స్ ఫార్గో బ్యాంక్, N.A.కు అమ్మివేసింది.
ఎడ్గార్ పియర్స్, ది "మర్డి గ్రాస్ బాంబర్", ఈ బ్యాంక్ మరియు సూపర్ మార్కెట్ శ్రేణి సైన్స్బరీ'స్పై 1994లో ఉగ్రవాద ప్రచారాన్ని ప్రారంభించాడు.[11]
1996లో, బార్క్లేస్, వెల్స్ ఫార్గో నిక్కో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ (WFNIA) ను కొనుగోలు చేసి దీనిని BZW ఇన్వెస్ట్మెంట్ మానేజ్మెంట్తో విలీనం చేసి బార్క్లేస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ను స్థాపించింది.[12]
రెండు సంవత్సరాల తరువాత- 1998లో- BZW వ్యాపారం చెదిరిపోయి, దీని భాగాలు క్రెడిట్ సుయిస్సే ఫస్ట్ బోస్టన్‌కు అమ్మివేయబడ్డాయి: బార్క్లేస్ ఋణ వ్యాపారాన్ని నిలుపుకొని, ప్రస్తుత బార్క్లేస్ కాపిటల్కు పునాదిని వేసుకుంది.[13]
1999లో, ఆ కాలంలో ఉచిత ISPల కొరకు ఉన్న ధోరణిలో భాగంగా ఒక అసాధారణ చర్యలో బార్క్లేస్, బార్క్లేస్.నెట్‌గా పిలువబడే ఒక అంతర్జాల సేవను ప్రారంభించింది: ఈ సంస్థ 2001లో బ్రిటిష్ టెలికామ్ ద్వారా స్వాధీనం చేసుకోబడింది.[14]
నూతన సహస్రాబ్దిసవరించు
2000లో వూల్విచ్ plc (గతంలో వూల్విచ్ బిల్డింగ్ సొసైటీ) స్వాధీనం చేసుకోబడింది.[15] 2001 బార్క్లేస్ UKలో 171 శాఖలను మూసివేసింది, వీటిలో అధికభాగం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి: బార్క్లేస్, తనను తాను "ది బిగ్ బ్యాంక్"గా వ్యవహరించుకుంది, అయితే అనేక అవమానకరమైన ప్రచార పర్వాల తరువాత ఇది వెంటనే మరుగున పడిపోయింది.[16]
2003లో, బార్క్లేస్, అమెరికన్ క్రెడిట్ కార్డు సంస్థ అయిన జునిపెర్ బ్యాంక్‌ను CIBC నుండి కొనుగోలుచేసి, దానికి "బార్క్లేస్ బ్యాంక్ డెలవార్" అని పేరుపెట్టింది.[17] అదే సంవత్సరంలో 11వ స్పానిష్ బ్యాంక్, బ్యాంకో జరగోజానో స్వాధీనం చేసుకోబడింది.[18]
బార్క్లేస్ 2004లో ప్రిమియర్ లీగ్ యొక్క సమర్పణను బార్క్లేకార్డు నుండి స్వాధీనం చేసుకుంది.[19] మే 2005లో, బార్క్లేస్ తన సమూహ ప్రధాన కార్యాలయాన్ని లండన్ నగరంలోని లోమ్బార్డ్ స్ట్రీట్ నుండి కానరీ వార్ఫ్‌లోని వన్ చర్చిల్ ప్లేస్‌కు మార్చింది. 2005లోనే, బార్క్లేస్ £2.6 బిలియన్లతో దక్షిణ ఆఫ్రికా యొక్క అతిపెద్ద రిటైల్ బ్యాంక్ అయిన అబ్సా గ్రూప్ లిమిటెడ్‌ను స్వాధీనం చేసుకొని, 2005 జూలై 27న 54% వాటాను పొందింది.[20]
2006లో, బార్క్లేస్, HomEq సర్విసింగ్ కార్పోరేషన్ ను $469 మిలియన్ల నగదుతో వాచోవియా కార్పోరేషన్ నుండి కొనుగోలు చేసింది.[21] అదే సంవత్సరంలో కంపేర్దిలోన్[22] వెబ్సైట్ స్వాధీనం చేసుకోబడింది మరియు బార్క్లేస్, వూల్విచ్ శాఖలకు బార్క్లేస్గా పేరు పెట్టడానికి, వూల్విచ్ వినియోగాదారులను బార్క్లేస్ ఖాతాలకు తీసుకు వెళ్ళడానికి మరియు కార్యాలయ కార్యకలాపాలను బార్క్లేస్ సిస్టమ్స్‌లోకి మార్చడానికి ప్రణాళికలను ప్రకటించింది - వూల్విచ్ బ్రాండ్ బార్క్లేస్ తనఖాలకు ఉపయోగించబడుతుంది.[23]
జనవరి 2007 బార్క్లేస్, బ్రూక్లిన్, న్యూయార్క్‌లో 18,000 సీట్ల సామర్ధ్యం కల ప్రతిపాదిత బార్క్లేస్ సెంటర్‌కు, ఆ పేరు పై హక్కులు కొన్నామని ప్రకటించింది, ఇక్కడికి న్యూ జెర్సీ నెట్స్‌ను మార్చాలని భావించింది.[24] బార్క్లేస్, టోక్యో స్టాక్ఎక్స్చేంజ్లో తన రెండవ లిస్టింగ్‌ను 2008లో రద్దుచేసుకుంది.
ABN AMROతో ప్రణాళికాయుత విలీనంసవరించు
మార్చి 2007లో బార్క్లేస్, నెదర్లాండ్స్ యొక్క అతిపెద్ద బ్యాంక్ అయిన ABN AMROతో విలీనానికి ప్రణాళికలను ప్రకటించింది.[25][26] ఏదేమైనా, 2007 అక్టోబరు 5న, ABN వాటాదారుల అసంపూర్ణ మద్దతును సాకుగా చూపుతూ, బార్క్లేస్, తాను వేలాన్ని వదలివేస్తున్నట్లు ప్రకటించింది[27]. 80% కంటే తక్కువ వాటాలు మాత్రమే బార్క్లే యొక్క కాష్-అండ్-షేర్స్ ప్రతిపాదనకు నమోదయ్యాయి.[28] ABN AMROకు వ్యతిరేకంగా తన వేలం ధర అయిన $99.9 సెంట్లతో రాయల్ బ్యాంక్ అఫ్ స్కాట్లాండ్ ముందుకు వెళ్ళడానికి ఇది వీలుకలిగించింది.
ABN AMRO కొరకు తన వేలానికి ఆర్ధిక సహాయార్ధం, బార్క్లేస్, చైనా డవలప్మెంట్ బ్యాంక్ లోని 3.1% వాటాను మరియు సింగపూర్ ప్రభుత్వం యొక్క పెట్టుబడి అంగమైన టెమసెక్ హోల్డింగ్స్‌లో 3% వాటాను అమ్మివేసింది.[29]
2007లోనే, బార్క్లేస్, రీజియన్స్ ఫైనాన్షియల్ కార్పోరేషన్ నుండి $225 మిలియన్లకు ఈక్విఫస్ట్ కార్పోరేషన్ కొనుగోలుకు అంగీకరించింది.[30] ఇదే సంవత్సరంలో, బార్క్లేస్ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ 900 మంది సిబ్బందిని తొలగిస్తూ, పీటర్‌బరోలోని తన కార్యకలాపాలను ఆపివేసి, గ్లాస్గోలో పునఃస్థాపిస్తామని ప్రకటించింది.[31]
పెట్టుబడిసవరించు
2007 ఆగస్టు 30న, బార్క్లేస్ బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ స్టెర్లింగ్ అత్యవసర సౌకర్యం నుండి £1.6బిలియన్లు ($3.2 బిలియన్లు) ఋణం తీసుకోవలసిందిగా ఒత్తిడిచేయబడింది. వారి దైనిక వ్యాపారంలో చివరగా బ్యాంకులు ఇతర బాంకుల రుణాలను తీర్చలేని స్థితిలో చివరి మజిలీగా ఇది అందచేయబడుతుంది.[32] బార్క్లేస్ యొక్క ద్రవ్యత్వం గురించి పుకార్లు ఉన్నప్పటికీ, వారి కంప్యూటరైజ్డ్ నెట్వర్క్ స్థిరీకరణతో ఉన్న సాంకేతిక సమస్య కారణంగా ఈ ఋణం వారికి అవసరమైంది. బార్క్లేస్ ప్రతినిధి ఈ విధంగా చెప్పారు, "U.K మార్కెట్లలో ద్రవ్యత్వ సమస్యలు లేవు. బార్క్లేస్ దానికదే ద్రవ్యత్వంతో సమృద్ధిగా ఉంది."[33]
2007 నవంబరు 9న, బార్క్లేస్ వాటాలు 9% పడిపోవడమే కాక స్వల్పకాలానికి నిలిపివేయబడ్డాయి, దీనికి కారణం USలో £4.8బిలియన్ల ($10బిలియన్ల) రాని బాకీలు ఉన్నాయని వెల్లడి కావడం. ఏదేమైనా, బార్క్లేస్ ప్రతినిధి ఒకరు ఈ పుకార్లను ఖండించారు.[34] ఆ తరువాత, ముందుగా భయపడిన దానికంటే చాలా తక్కువగా ఈ బ్యాంకు రద్దు చేసిన రుణాలు £1 బిలియన్లు ($1.9 బిలియన్లు) గా ప్రకటించబడ్డాయి.
జూలై 2008న, బార్క్లేస్ తన వారాంతపు టయర్ 1 మూలధన నిష్పత్తిని పెంచుకోవడానికి £4.5 బిలియన్లను సాంప్రదాయేతర హక్కుల జారీ ద్వారా సేకరించాలని ప్రయత్నించింది, దీనిలో భాగంగా అప్పటికే ఉన్న వాటాదారులకు రైట్స్ జారీ మరియు సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్పోరేషన్‌కు వాటా అమ్మకం ఉన్నాయి. కేవలం 19% వాటాదారులు మాత్రమే రైట్లను స్వీకరించగా మిగిలిన వాటితో చైనా డెవలప్మెంట్ బ్యాంక్ మరియు కతార్ ఇన్వెస్ట్మెంట్ అధారిటీ బ్యాంకులో తమ నియంత్రణ పెంచాయి.[35]
2008లో బార్క్లేస్, క్రెడిట్ కార్డ్ బ్రాండ్ గోల్డ్‌ఫిష్‌ను $70 మిలియన్లకు కొనుగోలుచేసి 1.7 మిలియన్ల వినియోగదారులను, $3.9 బిలియన్ల రాబడులను పొందింది.[36] బార్క్లేస్, రష్యన్ రిటైల్ బ్యాంక్ ఎక్స్పోబాంక్ నియంత్రణ వాటాలను $745 మిలియన్లకు కొనుగోలు చేసింది.[37] అదే సంవత్సరంలో తరువాత $100 మిలియన్ల ప్రారంభ ధనంతో బార్క్లేస్ తన పాకిస్తాన్ కార్యకలాపాలను ప్రారంభించింది.[38]
లేమన్ బ్రదర్స్ స్వాధీనంసవరించు
2008 సెప్టెంబరు 16న, దివాలా కొరకు దాఖలు చేసిన యునైటెడ్ స్టేట్స్ ఆర్ధిక సంస్థ, లేమన్ బ్రదర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మరియు వర్తక విభాగాల నియంత్రణ అనుమతులకు సంబంధించి కొనుగోలు ఒప్పందాన్ని చేసుకున్నట్లు బార్క్లేస్ ప్రకటించింది. ఈ ఒప్పందంలో, బార్క్లేస్, న్యూ యార్క్ నగరంలోని లేమన్ బ్రదర్స్ యొక్క కేంద్ర కార్యాలయాన్ని కూడా పొందుతుంది.
2008 సెప్టెంబరు 20న ఈ ఒప్పందం యొక్క పునశ్చరించబడిన రూపంలో, లేమన్ బ్రదర్స్ కీలక వ్యాపార స్వాధీనం కొరకు (ప్రధానంగా లేమన్ యొక్క $960 మిలియన్ల మిడ్ టౌన్ మన్ హట్టన్ కార్యాలయ ఆకాశహర్మ్యం, దాని 9,000 మంది పూర్వ ఉద్యోగులతో సహా) $1.35 బిలియన్ల (£700 మిలియన్ల) ప్రణాళిక బార్క్లేస్ plc కొరకు ఆమోదించబడింది. మన్‌హట్టన్ దివాలా న్యాయస్థాన న్యాయమూర్తి జేమ్స్ పెక్ 7 గంటలు వాగ్వివాదాలు విన్న తరువాత: "నేను ఈ లావాదేవీని ఆమోదించవలసినదే ఎందుకంటే ఇది ఒక్కటే అందుబాటులోని లావాదేవి. లేమన్ బ్రదర్స్ బలిపశువు అయ్యింది, సముద్ర తుఫానులో వాస్తవంగా ప్రసిద్ధి చెందినది పడిపోవటం వలన ఋణ మార్కెట్ల మీద దుష్ప్రభావాలను చూపించింది. నేను పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఇది అత్యంత ముఖ్యమైన దివాలా న్యాయవిచారణగా ఉంది. భవిష్య కేసుల కొరకు దీనిని ఎన్నటికీ దృష్టాంతంగా భావించరాదు. ఈ విధమైన అత్యవసర పరిస్థితిని ఊహించటం కూడా నాకు చాలా కష్టతరం" అని తీర్పుఇచ్చారు".[39]
ఋణదాతల కమిటీ సలహాదారు, లుక్ డెస్పిన్స్ మాట్లాడుతూ: "ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయ లోపం మీద ఆధారపడి నిజానికి మేము అభ్యంతరం చెప్పటం లేదు. మేము ఈ లావాదేవీకి మద్ధతు ఇవ్వటం లేదు ఎందుకంటే దీనిని పరిశీలించటానికి తగినంత సమయం లేదు."[39] బార్క్లేస్ సెక్యూరిటీలలో $ 47.4 బిలియన్లను సంలీనం చేసుకుంటుందని మరియు వాణిజ్య ఋణాలలో $ 45.5 బిలియన్లకు బాధ్యత వహిస్తుందని సవరణ కాబడిన ఒప్పందంలో ఉంది. లేమన్ న్యాయవాది, వీల్, గోట్షాల్ & మాన్జెస్ యొక్క హర్వే R. మిల్లర్ మాట్లాడుతూ "ఈ ఒప్పందం యొక్క రియల్ ఎస్టేట్ అంశాల కొనుగోలు ధర $ 1.29 బిలియన్లు ఉంటుంది, ఇందులో $ మిలియన్లు లేమన్ యొక్క న్యూయార్క్ ప్రధాన కార్యాలయాలకు $ 960 మిలియన్లు మరియు రెండు నూతన న్యూజెర్సీ సమాచార కేంద్రాలకు $330 ఉన్నాయి. లేమన్ యొక్క ప్రధాన కార్యాలయాల వాస్తవమైన విలువ $ 1.02 బిలియన్లుగా అంచనా వేయబడింది, కానీ CB రిచర్డ్ ఎల్లిస్ చేసిన మూల్యాంకనం కారణంగా దీని విలువ 900 మిలియన్లుగా ఈ వారం తెలుపబడింది."[40] అంతేకాకుండా, బార్క్లేస్, లేమన్ యొక్క ఈగల్ ఎనర్జీ విభాగాన్ని సంలీనం చేసుకోవట్లేదు, కానీ లేమన్ బ్రదర్స్ కెనడా Inc, లేమన్ బ్రదర్స్ సుడ్అమెరికా, లెమాన్ బ్రదర్స్ ఉరుగ్వే మరియు అధిక నెట్‌వర్త్ ఉన్న వ్యక్తుల కొరకు పెట్టుబడి నిర్వహణా (ప్రైవేట్ ఇన్వెస్టిమెంట్ మేనేజ్మెంట్) వ్యాపారం వంటివి సంలీనం చేసుకుంది. చివరికి, లేమన్ బ్రదర్స్ Incలోని $20 బిలియన్ల సెక్యూరిటీ ఆస్తులను లేమన్ నిలుపుకుంటుంది, వాటిని బార్క్లేస్కు బదిలీ చేయదు.[40] ఒకవేళ హామీ ఇచ్చిన 90 రోజులపాటు కొంతమంది లేమన్ ఉద్యోగస్థులను ఉంచుకోవాలని భావించనట్టయితే, సంబంధాన్ని పూర్తిగా తెంచుకోవటానికి బార్క్లేస్ సంభావ్య చెల్లింపుగా $ 2.5 బిలియన్లను చెల్లించవలసి ఉంది.[41][42]
ఇటీవల అభివృద్ధిసవరించు
రాయిటర్స్ నివేదిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం £40 బిలియన్లను ($69 బిలియన్లు) మూడు బ్యాంక్‌లకు అందిస్తుందని ప్రకటించింది, వీటిలో £7 బిలియన్లకుపైన కోరుతున్న బార్క్లేస్ కూడా ఉంది.[43] తరువాత బార్క్లేస్ ప్రభుత్వ ప్రతిపాదనను తాను తిరస్కరించానని నిర్ధారించి, దానికి బదులుగా £6.5 బిలియన్ల నూతన మూలధనాన్ని సేకరిస్తానని ప్రకటించింది (£2 బిలియన్లను డివిడెండ్ రద్దుచేయడం ద్వారా మరియు £4.5 బిలియన్లను ప్రైవేట్ పెట్టుబడిదారుల నుండి).[44]
జనవరి 2009లో పత్రికలు, మరింత మూలధనం అవసరమవుతుందని మరియు ప్రభుత్వం దీనిని అందించడానికి ఇష్టపడినప్పటికీ, కతారి స్టేట్ నుండి పూర్వపు మూలధన పెట్టుబడిలోని అక్టోబరు 2008లో నిబంధన ప్రకారం కతార్ తన వాటాల విలువ పరిహారం పొందకుండా ఏ మూడవ పార్టీ మరింత మూలధనం ప్రవేశపెట్టలేక పోవడంతో ఈ విధంగా చేయలేకపోయింది అని తెలియచేశాయి.[45]
2008 మార్చిలో AIGతో ఇన్షూరెన్స్ సర్దుబాట్ల ద్వారా బార్క్లేస్ బిలియన్ల డాలర్లు అందుకుందని, అందులో $8.5 బిలియన్ల నిధులు యునైటెడ్ స్టేట్స్చే AIGకి హామీగా ఇవ్వబడ్డాయి.[46][47]
2009 జూన్ 12న, తన ఎక్స్చేంజ్ వర్తక నిధి వ్యాపారం, i షేర్స్లతో కూడి ఉన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ విభాగాన్ని బార్క్లేస్ $13.5 బిలియన్లకు బ్లాక్‌రాక్‌కు అమ్మివేసింది.[48]
స్టాండర్డ్ లైఫ్ అక్టోబరు 2009లో తన స్టాండర్డ్ లైఫ్ బ్యాంక్ plcని బార్క్లేస్ plcకి అమ్మివేసింది. ఈ అమ్మకం 2010 జనవరి 1న పూర్తయింది.[49]
2009 నవంబరు 11న, బార్క్లేస్ మరియు సమాచార వాణిజ్యం యొక్క ప్రపంచ సాంకేతిక కల్పనాదారు అయిన ఫస్ట్ డేటా, ఒక ఒప్పందంలోకి ప్రవేశించారు, బార్క్లేస్, కార్డ్పోర్ట్ ఫోలియోలను ఫస్ట్ డేటా యొక్క జారీ మరియు వినియోగ విత్త వేదికకు బదిలీ చేస్తుంది.[50]
2010 ఫిబ్రవరి 13న, బార్క్లేస్, తాను £2 బిలియన్లకు పైన బోనస్‌లను చెల్లిస్తానని ప్రకటించింది.[51]
కార్యకలాపాలుసవరించు
బార్క్లేస్ సమూహంలోని భాగాలుసవరించు
- బార్క్లేస్ బ్యాంక్ PLC
- మెర్సెర్స్ డెట్ కలెక్షన్ ఏజెన్సీ
- బార్క్లేస్ బ్యాంక్ డెలవరె (గతంలో బార్క్లే కార్డు US, ప్రారంభంలో జునిపెర్ బ్యాంక్, 2003లో స్వాధీనంచేసుకోబడింది)
- బార్క్లేస్ రిటైల్ బ్యాంక్ — UK క్లియరింగ్ బ్యాంక్
- బార్క్లేస్ కార్పోరేట్ — ప్రపంచవ్యాప్తంగా ఉన్న మధ్య మరియు భారీ వ్యాపారాలతో వ్యవహరిస్తుంది.
- బార్క్లేస్ వెల్త్ — స్టాక్ బ్రోకర్లు, ఆఫ్ షోర్ మరియు ప్రైవేట్ బ్యాంక్
- బార్క్లేస్ ప్రైవేట్ క్లైంట్స్ ఇంటర్నేషనల్ Ltd. — ఐల్ అఫ్ మాన్ స్థావరంగా ఈ అనుబంధభాగం, ఛానల్ ఐ లాండ్స్ లో శాఖలను కలిగి ఉంది.
- బార్క్లేస్ ప్రైవేట్ ఈక్విటీ
- బార్క్లేకార్డ్ — ప్రపంచ క్రెడిట్ కార్డ్ వ్యాపారం
- బార్క్లేకార్డ్ US —బార్క్లేకార్డ్ ప్రపంచ కార్యకలాపాల నుండి భిన్నమైనది, ఇది సంస్థ యొక్క US క్రెడిట్ కార్డ్ విభాగం (గతంలో "జునిపెర్ బ్యాంక్"గా పిలువబడేది). US ఎయిర్వేస్, మిడ్వెస్ట్ ఎయిర్‌లైన్స్, ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ మాస్టర్‌కార్డ్, ఎయిర్ట్రాన్ ఎయిర్వేస్ వీసా కార్డ్, మరియు ఆపిల్ స్టోర్ వీసా మరియు మాస్టర్‌కార్డ్ ఖాతాల వంటి బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీచేస్తుంది.
- బార్క్లేస్ కాపిటల్ — ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
- వూల్విచ్ plc — UK తనఖా బ్రాండ్
- బార్క్లేస్ ఆఫ్రికా
- బార్క్లేస్ స్పెయిన్ (550 శాఖలు) [52]
- బార్క్లేస్ పోర్చుగల్ (162 శాఖలు) [52]
- బార్క్లేస్ ఫ్రాన్స్
- బార్క్లేస్ మొరాకో
- బార్క్లేస్ బ్యాంక్ LLC (రష్యా)
- బార్క్లేస్ పాకిస్తాన్
- అబ్సా గ్రూప్ లిమిటెడ్ (దక్షిణ ఆఫ్రికా)
- ఫస్ట్ప్లస్ ఫైనాన్షియల్ గ్రూప్ PLC
- బార్క్లేస్ పార్ట్నర్ ఫైనాన్స్ (గతంలో క్లిడెస్డలే ఫైనాన్షియల్ సర్వీసెస్)
- బార్క్లేస్ ఇండియా
- బార్క్లేస్ టెక్నాలజీ సెంటర్ చైనా
- బార్క్లేస్ టెక్నాలజీస్ సెంటర్ ఇండియా
- PT బ్యాంక్ బార్క్లేస్ ఇండోనేసియా, గతంలో PT బ్యాంక్ అకితాగా పిలువబడేది (బార్క్లేస్ బ్యాంక్ ఇండోనేసియాగా పేరు మార్చవలసిఉంది) [53][54]
- బార్క్లేస్ క్రొవేషియా
- బార్క్లేస్ షేర్డ్ సర్వీసెస్ (BSS)
బార్క్లేస్, గ్లోబల్ ఎలయన్స్ యొక్క భాగంసవరించు
బార్క్లేస్, గ్లోబల్ ATM ఎలయన్స్ యొక్క భాగం, అనేక పెద్ద అంతర్జాతీయ బ్యాంకుల ఈ ఉమ్మడి వ్యాపారం, వినియోగదారులు అంతర్జాతీయ ప్రయాణాలలో వారి ATM కార్డ్ లేదా చెక్ కార్డ్‌లను గ్లోబల్ ATM ఎలయన్స్తో ఉన్న ఏ ఇతర బ్యాంక్తోనైనా ATM వినియోగించినందుకు రుసుము చెల్లించకుండానే ఉపయోగించవచ్చు. దీనిలో సభ్యులుగా ఉన్న ఇతర బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ అమెరికా (యునైటెడ్ స్టేట్స్), BNP పారిబాస్ (ఫ్రాన్స్), ఉక్ర్సిబ్బంక్ (ఉక్రెయిన్), చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్ (చైనా), డ్యూయిష్ బ్యాంక్ (జర్మనీ), సాన్టెండర్ సెర్ఫిన్ (మెక్సికో), స్కాటియాబంక్ (కెనడా) మరియు వెస్ట్ పాక్ (ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్) ఉన్నాయి.
వ్యవస్థాపరమైన నిర్మాణంసవరించు
బార్క్లేస్ సమూహ ఛైర్మన్ అయిన మార్కస్ అగియాస్ నేతృత్వంలో ఉంది, ఈయన బోర్డ్ లో 2006 సెప్టెంబరు 1లో చేరారు, ఈయన తరువాత మాథ్యూ బారెట్ 2007 జనవరి 1న ఛైర్మన్ అయ్యారు. అగియాస్ BBCకి కూడా సీనియర్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు గతంలో BAA PLC ఛైర్మన్‌గా ఉన్నారు, లండన్‌లోని లజార్డ్ యొక్క ఛైర్మన్ మరియు 2006 డిసెంబరు 31 వరకు లజార్డ్ LLC యొక్క డిప్యూటీ ఛైర్మన్.
గ్రూప్ చీఫ్ ఎక్జిక్యూటివ్ అయిన జాన్ వర్లె, గ్రూప్ ఛైర్మన్‌కి నేరుగా నివేదిస్తారు, ఈయన బార్క్లేస్ కార్యకలాపాల వ్యూహాత్మక దిశానిర్దేశం మరియు ప్రణాళికలకు బాధ్యత వహిస్తారు. వర్లె ఈ స్థానంలో సెప్టెంబరు 2004లో నియమింపబడ్డారు, దీనికి ముందు ఆయన డిప్యూటీ చీఫ్ ఎక్జిక్యూటివ్ (జనవరి–సెప్టెంబరు 2004) మరియు గ్రూప్ ఫైనాన్స్ డైరెక్టర్ (2000–2003) గా సేవలందించారు.
నవంబరు 2009లో జాన్ వర్లె, బార్క్లేస్ యొక్క వ్యాపారాన్ని గ్లోబల్ రిటైల్ బ్యాంకింగ్ మరియు కార్పోరేట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్లుగా పునఃవిభజన చేసారు. గ్లోబల్ రిటైల్ బ్యాంకింగ్‌లో UK రిటైల్ బ్యాంకింగ్, బార్క్లే కార్డ్, పశ్చిమ ఐరోపాలోని రిటైల్ కార్యకలాపాలు మరియు ఉద్భవిస్తున్న మార్కెట్ల వ్యాపారం, మరియు రిటైల్ కార్యకలాపాలు, సాంకేతికత ఉంటాయి. కార్పోరేట్ మరియు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్లలో, బార్క్లేస్ కాపిటల్, బార్క్లేస్ కమర్షియల్ బ్యాంక్ మరియు బార్క్లేస్ వెల్త్ ఉంటాయి. దీని ఫలితంగా నాయకత్వ జట్టులో కొన్ని మార్పులు చేయబడ్డాయి మరియు గ్రూప్ ఎక్జిక్యూటివ్ కమిటీ (ExCo) విస్తరించబడింది.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు ఎక్జిక్యూటివ్ కమిటీసవరించు
నవంబరు 2009 నాటికి ExCo వీరిని కలిగి ఉంది:
- రాబర్ట్ E. డైమండ్, జూనియర్ - గ్రూప్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎక్జిక్యూటివ్, బార్క్లేస్ PLC; మరియు CEO, బార్క్లేస్ కార్పోరేట్ & ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్.
- క్రిస్ లుకాస్ - గ్రూప్ ఫైనాన్స్ డైరెక్టర్, బార్క్లేస్ PLC.
- అంటోనీ జెన్కిన్స్ - చీఫ్ ఎక్జిక్యూటివ్, గ్లోబల్ రిటైల్ బ్యాంకింగ్[55]
- జెర్రీ డెల్ మిస్సిఎర్ - కో-చీఫ్ ఎక్జ్జిక్యూటివ్, బార్క్లేస్ కార్పోరేట్ & ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్.
- రిచ్ రిక్కి - కో-చీఫ్ ఎక్జిక్యూటివ్, బార్క్లేస్ కార్పోరేట్ & ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్.
- టాం కలారిస్ - చీఫ్ ఎక్జిక్యూటివ్, బార్క్లేస్ వెల్త్ మేనేజ్మెంట్.
- మరియా రామోస్ - CEO, అబ్సా.
- మార్క్ హార్డింగ్ [1] - గ్రూప్ జనరల్ కౌన్సెల్, బార్క్లేస్ PLC.
- రాబర్ట్ లే బ్లాంక్ [2] - చీఫ్ రిస్క్ ఆఫీసర్, బార్క్లేస్ PLC.
- కాథీ ట్యూనర్ [3] - గ్రూప్ హ్యూమన్ రిసోర్సెస్ డైరెక్టర్, బార్క్లేస్ PLC.
[1]రాబర్ట్ డైమండ్‌కు నివేదిస్తారు.
[2]క్రిస్ లుకాస్‌కు నివేదిస్తారు.
[3] మానవ వనరులు, వ్యూహం, కార్పోరేట్ వ్యవహారాలు, బ్రాండ్ & మార్కెటింగ్‌లకు బాధ్యత వహిస్తారు మరియు రాబర్ట్ E. డైమండ్, జూనియర్‌కు నివేదిస్తారు.
ఈ సంస్థకు COO లేదా CIO లేరు. గతంలో COOగా ఉన్న పాల్ ఇడ్జిక్, సంస్థను పునర్ రూపకల్పన చేయడాన్ని పూర్తిచేసాడు, దీనిలో IT కార్యకలాపాలు - గ్లోబల్ రిటైల్ & కమర్షియల్ బ్యాంకింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి కీలకవ్యాపార విభాగాలకు బదిలీ చేయబడ్డాయి-ఈ పని పూర్తికాగానే ఇడ్జిక్ తన పదవికి రాజీనామా చేసారు.
ఈ క్రిందివారు బోర్డ్ సభ్యులుగా ఉన్నారు:[56]
- మార్కస్ అగియాస్ - ఛైర్మన్
- డేవిడ్ బూత్ - నాన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్
- సర్ రిచర్డ్ బ్రాడ్ బెంట్ - సీనియర్ ఇండిపెండెంట్ డైరెక్టర్
- లీ క్లిఫోర్డ్ - నాన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్
- ఫుల్వియో కొంటి - నాన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్
- ప్రొఫెసర్ సర్ ఆండ్రూ లికియర్మాన్ - నాన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్
- సర్ మిచెల్ రేక్ - నాన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్
- స్టీఫెన్ రస్సెల్ - నాన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్
- సర్ జాన్ సందర్ల్యాండ్ - నాన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్
- పాటిఎన్స్ వీట్క్రాఫ్ట్ - నాన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్
- సైమన్ ఫ్రేజర్ - నాన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్
శాఖలుసవరించు
బార్క్లేస్ UKలో 1800 పైన (గతంలో వూల్విచ్ శాఖలతో కలుపుకొని) ప్రధాన శాఖలను కలిగి ఉంది మరియు ఇది పోస్ట్ ఆఫీసు సమీపంలో నివసించే వినియోగదారులకు వ్యక్తిగత బ్యాంకింగ్ సౌకర్యాలను కల్పించడానికి మరియు సెక్యూర్డ్ మరియు అన్ సెక్యూర్డ్ రుణాల వంటి ఆర్ధిక సేవలు కావలసిన వారి కొరకు అది పోస్ట్ ఆఫీస్ Ltdతో కలిసింది.
ప్రపంచవ్యాప్తంగా, బార్క్లేస్ 50 దేశాలలో 4,750 శాఖలకు పైన కలిగి ఉంది.[57]
అధికభాగం బార్క్లేస్ శాఖలు 24/7 నగదు యంత్రాలను కలిగి ఉన్నాయి. బార్క్లేస్' వినియోగదారులు మరియు అనేక ఇతర బ్యాంక్‌ల వినియోగదారులు రుసుము చెల్లింపుతో బార్క్లేస్ ATMలను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు, ఘనాలో బార్క్లేస్, వారి ATM నుండి ప్రతి విత్ డ్రాయాల్ కు gh¢0.25 మరియు ఇతర బ్యాంక్ కార్డు వారి ATMలో ఉపయోగించినపుడు gh¢1.00 వసూలు చేస్తుంది.
బార్క్లేస్ కాపిటల్ అనేది బార్క్లేస్ బ్యాంక్ PLC యాజమాన్యంలోని బలమైన పెట్టుబడి సంస్థ. బార్క్లేస్ కాపిటల్ ప్రతిరోజు బిలయన్ల పౌండ్లు, i షేర్లతో వ్యవహరించే పెట్టుబడి నిధుల వ్యాపారాన్ని సృష్టించింది. విస్తృతంగా చర్చించిన తరువాత, బార్క్లేస్ అధ్యక్షుడు బాబ్ డైమండ్, ఇతర బార్క్లేస్ ఉన్నతాధికారులతో కలిసి మూలధనం మరింత పెంచుకోవడానికి iషేర్ల వ్యాపారం అమ్మివేయాలని నిర్ణయించారు. ఈ వ్యాపారానికి ప్రాథమిక విలువ £౩బిలియన్లు, బార్క్లేస్కు అధిక ధరకు అమ్మగలిగిన అవకాశం ఉన్నప్పటికీ, నిర్ణీత గడువులోపు పోటీదారులు ఆసక్తి చూపవలసి ఉంది.
బార్క్లేస్ సమూహంలోని మరొక అనుబంధ సంస్థ అయిన బార్క్లేస్ కార్పోరేట్, £5 మిలియన్ల పైన వార్షిక టర్నోవర్ కలిగిన సంస్థలకు బ్యాంకింగ్ పరిష్కారాలను అందిస్తుంది. ఈ పరిష్కారాలలో డిపాజిట్లు మరియు ద్రవ్యత్వం, నగదు నిర్వహణ మరియు వర్తకం, ఫైనాన్సింగ్, విదేశీ మారకం, హాని నిర్వహణ మరియు ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్నాయి.[58] ఇది ప్రపంచ వ్యాప్తంగా 23 దేశాలలో 8000కు పైన సంస్థలకు సేవలను అందిస్తుంది.[58]
బార్క్లేస్, గ్లోబల్ ATM అలయెన్స్‌లో సభ్యురాలు.[59]
ప్రాయోజితాలుసవరించు
బార్క్లేస్, ప్రీమియర్ లీగ్‌ను 2004 నుండి, మరియు చర్చిల్ కప్‌ని 2006 నుండి సమర్పించింది. బార్క్లేస్ 1987 నుండి 1993 వరకు ఫుట్ బాల్ లీగ్ ప్రాయోజిత సంస్థగా ఉంది, ఇది టుడే వార్తాపత్రిక నుండి దీనిని స్వీకరించింది మరియు ఎండ్స్ లే భీమాకు దీనిని అప్పగించింది. ఇది 2008 దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లను కూడా సమర్పించింది.[60] 2009లో ఇది టెన్నిస్ మాస్టర్స్ కప్ యొక్క అధికారిక సమర్పకురాలు.
బార్క్లేస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రధాన వృత్తిపరమైన గోల్ఫ్ పోటీలకు సమర్పకురాలు, 2002 నుండి లోచ్ లోమొండ్ వద్ద యూరోపియన్ టూర్లో బార్క్లేస్ స్కాటిష్ ఓపెన్, 2005-2006 నుండి PGA టూర్లో సమర్పిస్తున్న బార్క్లేస్ క్లాసిక్ 2007లో ది బార్క్లేస్గా మారింది, ఫెడ్ ఎక్స్ కప్ యొక్క మొదటి నాలుగు ప్లే ఆఫ్ టోర్నమెంట్లు, మరియు 2006 నుండి ఆసియాలోనే సంపన్నమైన సింగపూర్ ఓపెన్ యొక్క టైటిల్ సమర్పకురాలు, మరియు 2009 యూరోపియన్ టూర్ సహ-సమర్పించబడింది. PGA టూర్ యొక్క ప్రముఖ ఆటగాడు ఫిల్ మికెల్సన్ మరియు యూరోపియన్ టూర్ ఆటగాడు డారెన్ క్లార్క్‌లకు కూడా బార్క్లేస్ సమర్పకురాలుగా ఉంది.
వివాదంసవరించు
వర్ణవివక్ష పాలనలో ఉన్న దక్షిణ ఆఫ్రికాతో జోక్యంసవరించు
బార్క్లేస్ బ్యాంక్ 1980లలో అనేకమందిచే[by whom?] 'బోఎర్క్లేస్ బ్యాంక్'గా పిలువబడేది, దీనికి కారణం వర్ణవివక్ష పాలనలో ఉన్న దక్షిణ ఆఫ్రికాలో నిరంతరం జోక్యం చేసుకోవడం.[61] ఈ బ్యాంక్ ను విద్యార్థులు బహిష్కరించడం UK విద్యార్థి మార్కెట్లో దాని వాటా 27 శాతం నుండి 1986లో అది ఉపసంహరించుకొనే సమయానికి 15 శాతానికి పడిపోయింది.[62]
2006లో ఒక దక్షిణ ఆఫ్రికన్ కార్యకర్తల సమూహం, ఖులుమని సపోర్ట్ గ్రూప్ మద్దతు ఇచ్చిన జూబిలీ సౌత్ ఆఫ్రికా, బార్క్లేస్తోపాటు సిటిగ్రూప్, BP, రాయల్ డచ్ షెల్, ఫోర్డ్, GM, మరియు డ్యూయిష్ బ్యాంక్‌లను 1970 మరియు 1980ల మధ్యదక్షిణ ఆఫ్రికాలోని వర్ణవివక్ష ప్రభుత్వాన్ని పరోక్షంగా సమర్ధించినందుకు అపరాధ రుసుములు చెల్లించాలని కోరింది. న్యూ యార్క్‌లోని సెకండ్ సర్క్యూట్ కోర్ట్ అఫ్ అప్పీల్స్ వద్ద న్యాయపరమైన ప్రక్రియ జరిగింది, దక్షిణ ఆఫ్రికా యొక్క న్యాయమంత్రిత్వ శాఖ తమ దేశ సార్వభౌమత్వానికి బలహీనపరుస్తుందనే కారణంతో ఈ కేసును కొట్టివేయాలని కోరింది.[63]
జింబాబ్వే ప్రభుత్వానికి ఆర్ధిక సహాయంసవరించు
బార్క్లేస్, జింబాబ్వేలోని రాబర్ట్ ముగాబే ప్రభుత్వానికి నిధులను అందించడానికి సహాయం చేసింది.[64] బార్క్లేస్ అందించిన £30 మిలియన్ల ఋణం భూ సంస్కరణలను కొనసాగించడానికి, సహాయపడి ముగాబే శ్వేత జాతీయుల-యాజమాన్యంలోని భూములను మూసివేసి 100,000 పైగా నల్లవారిని తమ గృహాల నుండి వెళ్ళగొట్టడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ప్రత్యర్థులు బ్యాంకు యొక్క జోక్యాన్ని మానవ హక్కుల ఉల్లంఘన వలన బాధపడిన అనేక మిలియన్ల మందికి 'అవమానకరం' మరియు 'దూషణ'గా పేర్కొన్నారు.[65] బార్క్లేస్ ప్రతినిధి మాట్లాడుతూ జింబాబ్వేలో బ్యాంకు అనేక దశాబ్దాలుగా ఖాతాదారులను కలిగి ఉందని, వారిని వదలివేయడం విషయాలను మరింత దారుణంగా చేస్తుందని 'పనిచేయడానికి కష్టమైన ఆ విధమైన పరిస్థితులలో మేము మా ఖాతాదారులకు సేవలను అందించడానికి నిశ్చయించుకున్నాము" అన్నారు.[66]
జింబాబ్వే పై యూరోపియన్ యూనియన్ నిబంధనలను ఉల్లంఘించి, బార్క్లేస్, ముగాబే యొక్క ఇద్దరు అనుచరులకు కూడా బ్యాంకు ఖాతాలను కల్పించింది.[67] వీరిద్దరూ ఇలియట్ మాన్యిక మరియు ప్రజా సేవల మంత్రి నికోలస్ గోచే. 67%-యాజమాన్యం కలిగిన తన జింబాబ్వియన్ అనుబంధ సంస్థ EU పరిధికి వెలుపల స్థాపించబడటం వలన దానికి EU నియమాలు వర్తించవని బార్క్లేస్ తన వైఖరిని సమర్ధించుకుంది.[68]
నగదు బదిలీ ఆరోపణలుసవరించు
మార్చ్ 2009లో, బార్క్లేస్ అంతర్జాతీయ నగదు బదిలీ-వ్యతిరేక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలను ఎదుర్కుంది. (NGO) స్వచ్ఛంద సంస్థ గ్లోబల్ విట్నెస్ ప్రకారం, బార్క్లేస్ యొక్క పారిస్ శాఖ ఈక్వెటోరియల్ గినియన్ అధ్యక్షుడు టేయోదోరో ఒబియంగ్' పుత్రుడు, తేయోదొరిన్ ఒబియంగ్ యొక్క ఖాతాను 2004లో ప్రభుత్వ చమురు నిధులను ఒబియంగ్ తరలించాడనే సాక్ష్యాలు ఉన్న తరువాత కూడా కొనసాగించింది. గ్లోబల్ విట్నెస్ తెలిపిన దాని ప్రకారం, ఒబియంగ్ ఈ ఖాతాలోని నిధులతో ఒక ఫెరారీ కొన్నాడు మరియు మాలిబులో ఒక భవంతిని నిర్వహిస్తున్నాడు.[69]
వాల్ స్ట్రీట్ జర్నల్ యొక్క 2010 నివేదిక, క్రెడిట్ సుయిస్సే, బార్క్లేస్, లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్, మరియు ఇతర బ్యాంకులు, అలావి ఫౌండేషన్, బ్యాంక్ మెల్లి, ఇరాన్ ప్రభుత్వం, మరియు/లేదా ఇతరులు నిర్దిష్ట దేశాలతో ఆర్ధిక వ్యవహారాలను నిషేధించిన US చట్టాలను తప్పించుకున్నాయని తెలిపింది. వారు సమాచారాన్ని వైర్ బదిలీల నుండి 'తొలగించి' నిధుల యొక్క మూలాన్ని దాచి ఉంచడం ద్వారా ఈ విధంగా చేసారు. బార్క్లేస్ ప్రభుత్వంతో $298,000,000కు ఒప్పందం చేసుకుంది.[70]
సీనియర్ మేనేజ్మెంట్ బోనస్లుసవరించు
2008లో బార్క్లేస్ కాపిటల్ £2.3బిలియన్ల లాభాన్ని సాధించడంతో, US జాతీయుడైన బార్క్లేస్ కాపిటల్ అధినేత రాబర్ట్ డైమండ్, £14.8 మిలియన్ల బోనస్ పొందాలనుకున్నారు, అయితే USలోని సబ్ ప్రైమ్ తనఖా సంక్షోభం 2007లో ఈ విభాగాన్ని £1.6 బిలియన్లకు వత్తిడి చేసింది.[71]
పన్ను ఎగవేతసవరించు
మార్చ్ 2009లో, బార్క్లేస్, ది గార్డియన్ కు వ్యతిరేకంగా తన వెబ్సైట్ నుండి రహస్య వెల్లడింపు పత్రాలను తొలగించవలసిందిగా న్యాయస్థాన ఉత్తర్వులను పొందింది, ఈ పత్రాలు SCM, బార్క్లేస్' నిర్మిత కాపిటల్ మార్కెట్ల విభాగం ఏ విధంగా, "కేమన్ ఐలాండ్స్ సంస్థలు, US భాగస్వామ్యాలు మరియు లక్జెంబర్గ్ అనుబంధ సంస్థల" ద్వారా £11 బిలియన్ల కంటే ఎక్కువ ఋణాలను ఉపయోగించి మిలియన్ల కొద్దీ పన్ను ప్రయోజనాలను సృష్టించడానికి ప్రణాళిక రచించిందో వివరించాయి.[72] ఈ సంచికలోని ఒక సంపాదకీయలో, గార్డియన్, వనరులు సరితూగకపోవడంతో, పన్ను-సేకరణకర్తలు (HMRC) ప్రస్తుతం అటువంటి పత్రాలను పొందటానికి వికిలీక్స్ వంటి వెబ్సైట్ల పై ఆధారపడవలసి వస్తుందని ఎత్తిచూపింది, [73] నిజానికి ఈ సమస్యలోని పత్రాలు ప్రస్తుతం వికిలీక్స్లో ఉంచబడ్డాయి.[74][75] ప్రత్యేకించి, కొన్ని రోజుల తరువాత మరొక బార్క్లేస్ ప్రత్యర్థి, SCM వ్యవహారాలు ఒక సంవత్సరంలో £900 మరియు £1 బిలియన్ పన్ను ఎగవేతను సృష్టించాయని పేర్కొన్నాడు, ఇంకా "ఈ వ్యవహారాలు పన్నుతో మొదలయ్యాయని ఆ తరువాత వాటికి వాణిజ్య ప్రయోజనం చేర్చబడిందని తెలిపాడు."[76]
ఆయుధ వర్తకంతో సంబంధాలుసవరించు
డిసెంబరు 2008లో బ్రిటిష్ పేదరిక-వ్యతిరేక సంస్థ వార్ ఆన్ వాంట్, బార్క్లేస్ మరియు ఇతర UK బ్యాంకులు ఆయుధసంస్థలలో ఎంత వరకు పెట్టుబడులు పెట్టి, బ్యాంకింగ్ సేవలను అందించి, ఋణాలను ఇస్తాయో తెలిపే పత్రాలతో నివేదికను విడుదల చేసింది. ఆయుధాల తయారీదారులతో £7.3 బిలియన్ల వాటాలను కలిగి బార్క్లేస్ ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ పెట్టుబడిదారు అని ఈ సంస్థ నివేదికలో ప్రకటించింది. ఇంకా ఈ నివేదిక సామూహిక ఆయుధ సంపత్తి మరియు యురేనియం తరుగుదలల గురించి కూడా వివరించింది.[77]
గ్రంథ పట్టికసవరించు
వీటిని కూడా చూడండిసవరించు
- యూరోపియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రౌండ్‌టేబుల్
- PINsentry
- యునైటెడ్ కింగ్డంలోని బ్యాంకుల జాబితా
- సబ్‌ప్రైమ్ తనఖా సంక్షోభం
- బార్క్లేస్ ప్రీమియర్ లీగ్
- బార్క్లేస్ బ్యాంక్ కెనడా
వివరాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Preliminary Results 2009
- ↑ Key facts
- ↑ "The Global 2000 - 1-100". Forbes. 21 April 2010. Retrieved 11 December 2010. Cite news requires
|newspaper=
(help) - ↑ "Key facts". Barclays PLC. Retrieved 4 September 2010. Cite web requires
|website=
(help) - ↑ "BNP Grows to Biggest Bank as France Says Size Doesn't Matter". Bloomberg. 4 November 2010. Retrieved 11 December 2010. Cite news requires
|newspaper=
(help) - ↑ 6.0 6.1 6.2 "Group organisation". Barclays PLC. Retrieved 13 December 2010. Cite web requires
|website=
(help) - ↑ "Company History". Barclays Newsroom: Business History. Barclays. Retrieved 2007-01-30. ఇది కూడా చూడండి: బార్క్లేస్: ది బిజినెస్ అఫ్ బ్యాంకింగ్, 1690-1996 బై మార్గరెట్ అక్రిల్ అండ్ లెస్లీ హన్నా; కేంబ్రిడ్జ్ UP, 2001 ISBN 0-521-79035-2
- ↑ "Company History". Barclays.lk. Barclays. Retrieved 2008-05-11. Text " About us: Our History " ignored (help); Text " 1690-1972 " ignored (help)
- ↑ (గాంబుల్ 1923,46).
- ↑ "Barclays plc". Funding Universe. Retrieved 2009-03-28.
- ↑ మార్డి గ్రా బాంబర్ ఖైదుచేయబడ్డాడు
- ↑ బార్క్లేస్ త్వరలోనే వెల్స్ ఫార్గో నిక్కో ను కొనవచ్చు
- ↑ వెల్లడింపు: క్రెడిట్ సుయస్సే BZW గురించి ఏమి ఆలోచిస్తోంది
- ↑ Internet Archive Wayback Machine
- ↑ బార్క్లేస్ తన పోటీదారు వూల్విచ్ను కొంటుంది
- ↑ బార్క్లేస్లో ప్రతి విషయము పెద్దదే
- ↑ బార్క్లేస్ US క్రెడిట్ కార్డ్ భీమాదారుకు $293 మిలియన్లు చెల్లిస్తుంది
- ↑ బార్క్లేస్, స్పానిష్ బ్యాంక్‌ను కొనడానికి నగదు ఒప్పందం కుదుర్చుకుంది
- ↑ బార్క్లేస్, FA ప్రీమియర్ లీగ్ సమర్పణను పొందింది
- ↑ బార్క్లేస్, అబ్సా స్టేక్ కొనుగోలు చేయాలని భావిస్తోంది
- ↑ బార్క్లేస్, వాచోవియా విభాగాన్ని $469 మిలియన్లకు కొంటుంది
- ↑ కంపేర్దిలోన్ - చీప్ హోంఓనర్ లోన్స్ , కంపేర్ లోన్స్, UK సెక్యూర్డ్ లోన్స్
- ↑ బార్క్లేస్, వూల్విచ్ యొక్క బ్రాండ్ మార్చాలని ఆలోచిస్తోంది
- ↑ నెట్స్' నూతన ప్రాంగణం బార్క్లేస్ సెంటర్‌గా పిలువబడుతుందని తెలియవచ్చింది
- ↑ బార్క్లేస్ మరియు ABN AMRO ప్రాథమిక చర్చల విషయాన్ని వివరించాయి
- ↑ ABN Amro స్వాధీనంపై బార్క్లేస్ బ్యాంక్ విచారణ చేయిస్తుంది- న్యూ యార్క్ టైమ్స్
- ↑ BBC న్యూస్ | బిజినెస్ |బార్క్లేస్, ABN అమ్రో ప్రతిపాదనను తిరస్కరించింది
- ↑ ఉచిత ప్రివ్యూ - WSJ.com
- ↑ బార్క్లేస్, ABN AMRO కొనుగోలుకు నిధుల కొరకు తూర్పువైపు చూస్తోంది
- ↑ బార్క్లేస్ సబ్-ప్రైం లెండర్ ను కొనుగోలు చేయనుంది
- ↑ పీటర్ బరో స్థల మూసివేత ప్రకటించబడింది
- ↑ వందల మిలియన్ల అప్పు చేసినట్లు బార్క్లేస్ అంగీకరించింది
- ↑ బ్లూమ్‌బర్గ్.కామ్: U.K. & ఐర్లాండ్
- ↑ BBC న్యూస్ | బిజినెస్ |బార్క్లేస్ రానిబాకీల పుకార్లను ఖండించింది
- ↑ బార్క్లేస్ వాటా అమ్మకం £4.5 బిలియన్లు పెరిగింది
- ↑ US Group క్రెడిట్ కార్డ్స్ పై సమయం అడిగినందువలన బార్క్లేస్ గోల్డ్‌ఫిష్‌ను కొనుగోలుచేస్తుంది
- ↑ బార్క్లేస్ రష్యాలో ఎక్స్పో బ్యాంక్ ఒప్పందాన్ని మూసివేసింది
- ↑ బార్క్లేస్ బ్యాంక్ UK, పాకిస్తాన్ లో కార్యకలాపాలను ప్రారంభించింది
- ↑ news.bbc.co.uk, $1.3bn లేమన్ ఒప్పందాన్ని న్యాయమూర్తి ఆమోదించారు
- ↑ reuters.com, లేమన్, బార్క్లేస్ ఒడంబడికను న్యాయమూర్తి ఆమోదించారు
- ↑ ap.google.com, లేమన్ తన విభాగాలను బార్క్లేస్కు అమ్మవచ్చని న్యాయమూర్తి తెలిపారు
- ↑ guardian.co.uk, లేమన్ ఆస్తులను బార్క్లేకు అమ్మటాన్ని US న్యాయమూర్తి ఆమోదించారు
- ↑ రాయిటర్స్, బ్రిటిష్ బ్యాంక్ లు 40 బిలియన్ పౌండ్ల రక్షణను ఏర్పరచాయి: ఆధారాలు
- ↑ బ్యాంకు ingtimes.co.uk, బార్క్లేస్ £6.5 బిలియన్ల నిధులసమీకరణను ఆమోదించింది
- ↑ వాటా విలువ పడిపోవడంతో బార్క్లేస్ జాన్ వర్లె కలవరపడ్డాడు టైమ్స్ ఆన్లైన్, 23 జనవరి 2009
- ↑ AIG చెల్లింపుల ముఖ్య గ్రహీతలలో యూరోపియన్ బ్యాంకులు ఉన్నాయి
- ↑ ^బిలియన్ల బెయిల్ అవుట్ ను AIG విదేశాలకు పంపుతుంది, ది పోలిటికో, మార్చ్ 15, 2009
- ↑ Press Association (12 June 2009). "US giant BlackRock buys arm of Barclays bank | Business | guardian.co.uk". London: Guardian. Retrieved 2010-02-21. Cite news requires
|newspaper=
(help) - ↑ బార్క్లేస్, స్టాండర్డ్ లైఫ్ బ్యాంక్‌ను కొనుగోలుచేస్తుంది BBC న్యూస్. 26 అక్టోబర్ 2009
- ↑ ఫస్ట్ డేటా బార్క్లేస్ ఒప్పందాన్ని తెలియచేసింది
- ↑ "Barclays bank bonuses expected to reach £2bn". BBC News. 2010-02-13. Retrieved 2010-02-21. Cite news requires
|newspaper=
(help) - ↑ 52.0 52.1 బార్క్లేస్ స్పానిష్ భీమా స్టేక్ అమ్మకాన్ని ఆలోచిస్తోంది
- ↑ దిగిన తరువాత బార్క్లేస్ పక్కకు తొలగింది
- ↑ మూస:Id"Bank Akita News". Retrieved 2009-12-30. Cite web requires
|website=
(help) - ↑ http://group.బార్క్లేస్.com/About-us/Management-structure/బార్క్లేస్-Executive-Committee/Biography/1231783377802.html
- ↑ బార్క్లేస్: ది బోర్డ్, 6 మే 2009న పొందబడింది
- ↑ బార్క్లేస్ గురించి కీలక వాస్తవాలు
- ↑ 58.0 58.1 "అవర్ సర్వీసెస్", బార్క్లేస్.co.uk. 28డిసెంబర్ 2010న పొందబడినది.
- ↑ "ఐదు పెద్ద బ్యాంకులు గ్లోబల్ ATM ఎలయన్స్ ను స్థాపించాయి", ATMmarketplace.com. 9 జనవరి 2002 22 జూన్ 2007న తిరిగి పొందబడింది.
- ↑ దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్
- ↑ వర్ణ వివక్ష బ్యాంకర్ కొరకు దేశబహిష్కారం కొరకు తిరిగిరావడం
- ↑ బార్క్లేస్ వర్ణవివక్ష న్యాయస్థానా చర్యను ఎదుర్కొంటుంది
- ↑ బార్క్లేస్ వర్ణవివక్ష న్యాయస్థానా చర్యను ఎదుర్కొంటుంది. జూలియా కోల్లెవే, 21 జనవరి 2006.
- ↑ ముగాబే యొక్క క్రూర పాలనకు బార్క్లేస్ బ్యాంక్రోల్స్
- ↑ ముగాబే పాలనకు ఆధారం ఇవ్వడానికి బార్క్లేస్ మిలియన్లు సహాయం చేసింది
- ↑ బార్క్లేస్ 'ముగాబే పాలన నిధులకు సహాయం అందిస్తుంది'
- ↑ బార్క్లేస్ 'ముగాబే పాలన నిధులకు సహాయం చేస్తుంది'
- ↑ రాబర్ట్ ముగాబే సేవకుడికి బార్క్లేస్ ఆసరా ఇచ్చింది
- ↑ Shankleman, Martin (11 March 2009). "Barclays 'corrupt regime' claim". BBC News. Retrieved 2009-03-09.
- ↑ "ప్రోబ్ సర్కిల్స్ గ్లోబ్ టు ఫైండ్ డర్టీ మెనీ, కారిక్ మోలేన్ కాంప్, వాల్ స్ట్రీట్ జర్నల్, 2010 9 3
- ↑ Treanor, Jill (20 February 2008). "Barclays director lands £14.8m bonus". The Guardian. London. Retrieved 27 March 2010.
- ↑ ది గార్డియన్ , 17 మార్చ్ 2009, పన్నుపై బార్క్లేస్ గార్డియన్‌ను వంచించింది
- ↑ The Guardian , 17 March 2009, http://www.guardian.co.uk/commentisfree/2009/mar/17/బార్క్లేస్-tax-secret-documents
- ↑ Wikileaks ,16 March 2009, http://www.wikileaks.org/wiki/The_Guardian:_Censored_బార్క్లేస్_tax_avoidance_leaked_memos%2C_16_Mar_2009
- ↑ NRC Handelsblad ,17 March 2009, http://weblogs3.nrc.nl/klaver/2009/03/17/guardian-moet-documenten-van-site-verwijderen/
- ↑ ది గార్డియన్ , 19 మార్చ్ 2009, న్యూ విజిల్ బ్లోయర్ £1 బిలియన్ పైన బార్క్లేస్ పన్ను వ్యవహారాలను ఆరోపించారు
- ↑ వార్ ఆన్ వాంట్, బ్యాంకింగ్ ఆన్ బ్లడ్‌షెడ్
- ↑ 1972లో బార్క్లేస్ బ్యాంక్ లిమిటెడ్ లండన్ చే ప్రచురించబడిన బార్క్లేస్ బ్యాంక్ లిమిటెడ్ 1926-1969 యొక్క కాపీ నుండి ISBN సూచిక లేకుండా 167 పేజీలతో గట్టి అట్టతో
- ↑ బార్క్లేస్ బ్యాంకు లిమిటెడ్ (స్ప్రెడ్ ఈగిల్) లండన్ చే 1951 లో ప్రచురించబడిన ది ఈగల్ లుక్స్ బాక్ నుండి ఒక కాపీ ISBN లేకుండా
సూచనలుసవరించు
- "The Forbes Global 2000". 2008 list. Retrieved 2008-04-13.
- "Top 1000 World Banks 2006". The Banker. Retrieved 2006-09-03.
- "Barclays Newsroom". Barclays plc. Retrieved 2007-01-27. Cite web requires
|website=
(help) - ఆడ్రీ నోన గామ్బుల్, ఎ హిస్టరీ ఆఫ్ ది బెవాన్ ఫ్యామిలీ (1923).
బాహ్య లింకులుసవరించు
Wikimedia Commons has media related to బార్క్లేస్. |
- "Barclays' corporate website". Cite web requires
|website=
(help) - "Barclays UK Branch Locations". Cite web requires
|website=
(help) - "Barclays Wealth website". Cite web requires
|website=
(help) - "Barclays Wealth International Offshore website". Cite web requires
|website=
(help) - "Barclays Wealth International Expatriate website". Cite web requires
|website=
(help) - "Barclays Wealth International Resident Non Domicile website". Cite web requires
|website=
(help) - "Barclays Stockbrokers website". Cite web requires
|website=
(help) - "Profile for Barclays plc". Yahoo! Finance. Cite web requires
|website=
(help) - "Profile for Barclays plc". Google Finance. Cite web requires
|website=
(help)
మూస:Barclays
మూస:UK banks
మూస:"Big Four" UK banks
మూస:50 largest US banks
మూస:FTSE 100 Index constituents
మూస:Members of Euro Banking Association