బాలకృష్ణ భగవంత్ బోర్కర్

సాహిత్య అకాడెమీ పురస్కృత కొంకణీ రచయిత

బాలకృష్ణ భగవంత్ బోర్కర్ (1910 నవంబర్ 30 - 1984 జూలై 8) గోవాకు చెందిన కవి. [1] అతన్ని బా-కి-బాబ్ అని కూడా పిలుస్తారు.

బాలకృష్ణ భగవంత్ బోర్కర్
పుట్టిన తేదీ, స్థలంబోరిమ్
(1910-11-30)1910 నవంబరు 30
మరణం1984 జూలై 8(1984-07-08) (వయసు 73)
వృత్తిస్వాతంత్ర్య యోధుడు, కవి, రచయిత, భాషా ఉద్యమ కారుడు
భాషమరాఠీ, కొంకణి
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతీయుడు
పురస్కారాలుపద్మశ్రీ

బోర్కర్ చిన్న వయస్సులోనే పద్యాలు రాయడం ప్రారంభించాడు. రచయిత విష్ణు సఖారామ్ ఖండేకర్ తొలినాళ్ళలో బోర్కర్ కవిత్వానికి అభిమాని. బోర్కర్ 1950 లలో గోవా స్వాతంత్ర్య పోరాటంలో చేరాడు. పూణే వెళ్ళి అక్కడ రేడియోలో పనిచేశాడు. అతని సాహిత్యంలో ఎక్కువ భాగం మరాఠీలో రాసినప్పటికీ, కొంకణిలో కూడా రచనలు కూడా చేసాడు. గద్య రచయితగా కూడా రాణించాడు. అతని సుదీర్ఘ కవితలు మహాత్మాయాన్ , గాంధీకి అంకితమైన అసంపూర్తి పద్యం, తమఃస్తోత్ర (మధుమేహం, వృద్ధాప్యం కారణంగా అంధత్వం ఏర్పడే అవకాశం గురించి) ప్రసిద్ధి చెందాయి. అతని ప్రసిద్ధ కవితలలో ఒకటి "మాఝా గావ్", అంటే "నా గ్రామం".

బోర్కర్ మరణం తరువాత, పురుషోత్తమ్ లాక్ష్మణ్ దేశ్‌పాండే, అతని భార్య సునీతాబాయి బోర్కర్ కవితలను బహిరంగ వేదికలపై చదివారు.

జీవితం, కెరీర్ మార్చు

 
గోవాలో బాకీబాబ్ విగ్రహం

బాలకృష్ణ భగవంత్ బోర్కర్ 1910 నవంబరు30 న గోవా లోని బోరిమ్ గ్రామంలో జన్మించాడు. ఇది జువారి నది ఒడ్డున ఉంది. అతని ఇంట్లో వాతావరణం, భజనలు, కీర్తనలు, పవిత్ర గ్రంథాలు, మహారాష్ట్ర సాధువుల పాటలతో చాలా పవిత్రంగా ఉండేది. ప్రతి పిల్లవాడు కొత్త అభంగాలను బట్టీపట్టడం ఆఇంట్లో నియమంగా

బోర్కర్ ఒకప్పుడు కొత్త అభంగ్ నేర్చుకోవడం మర్చిపోయాడనీ, తన వంతుగా చదవాల్సి అయినప్పుడు, అతను అప్పటికప్పుడు ఒక కొత్త అభంగ్‌ను రాసాడనీ అంటారు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. అంత చిన్నవాడు అలా రాయగలడని నమ్మలేకపోయారు. మరొక అభాంగ్ రాయమని అతన్ని అడిగారు. మరో అభంగ్ రాసి వారిని మళ్లీ ఆశ్చర్యపరిచాడు దానిని " బాకీ మ్హనే " (బాకీ కూడా చెప్పాడు) అనే పద్యంతో ముగించాడు.

బోర్కర్ మాతృభాష కొంకణి. అతను తన పాఠశాల విద్యను రెండవ తరగతి వరకు మరాఠీ మాధ్యమంలో చేశాడు. ఆ సమయంలో గోవా పోర్చుగీసుల వలస పాలనలో ఉండేది. బాకీ తన తదుపరి విద్యను పోర్చుగీస్ భాషలో పూర్తి చేయాల్సి వచ్చింది. అతను పోర్చుగీస్ టీచర్స్ డిప్లొమా పొందాడు. నిధుల కొరత కారణంగాను, ఉద్యోగం చూసుకోవాల్సిన కారణం గానూ పైచదువులు చదవలేకపోయాడు. 1930 నుండి 1945 వరకు గోవాలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత బొంబాయి (ముంబై) కి బయలుదేరాడు, అక్కడ కొంకణి పత్రికలు అమాచా గోమాతక్, పోర్జెచో అవాజ్‌లకు సంపాదకుడిగా పనిచేసాడు. 1955 నవంబరులో ఆకాశవాణిలో చేరాడు. 1970 లో పదవీ విరమణ చేసే వరకు అక్కడే పనిచేశాడు.

బాకీబాబ్ మొదటి కవితా సంకలనం " ప్రతిభ "ను 1930 లో ప్రచురించాడు. ఆ సమయంలో అతని వయస్సు కేవలం 20 సంవత్సరాలు. అతను ప్రకృతి పట్ల, ముఖ్యంగా గోవా యొక్క సహజ సౌందర్యం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇది అతని కవితల్లో, పనిలో కనిపిస్తుంది. డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా 1946 లో గోవా విముక్తి ఉద్యమాన్ని ప్రకటించినపుడు బాకిబాబ్ వెంటనే స్వాతంత్ర్య యిద్ద్ధం లోకి దూకాడు. అతని రచన గోయాన్ లోహియా అయిలోర్ (లోహియా గోవాకు వచ్చారు) బాగా ప్రసిద్ధి చెందింది. ఇంట్లో తన పోషణలో ఉన్న పది మందిని విడిచిపెట్టి, సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని త్యాగం చేసి హృదయపూర్వకంగా ఉద్యమంలోకి దూకాడు. తన కవితల ద్వారా దేశభక్తిని వ్యాప్తి చేసే లక్ష్యాన్ని చేపట్టాడు.

వైవిధ్యమైన భావుకత, అతని బహుళ వర్ణాంచితమైన భావ చిత్రాలు, జీవితంలోని సుఖ దుఃఖాలను ప్రదర్శించగల నేర్పు బాకీబాబ్ సొంతం. అతను ప్రకృతి, దేశభక్తి గురించి, దేహం, ఆత్మలు - ఐంద్రీయ, ధ్యానమయం, వ్యక్తి, సమాజం గురించీ రచించాడు. అతను గోవా కవి, మహారాష్ట్ర కవి. భారతదేశపు కవి. భారతదేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీని అప్పటి రాష్ట్రపతి ఎస్. రాధాకృష్ణన్ ప్రదానం చేశాడు,

బాలకృష్ణ భగవంత్ బోర్కర్ 1984 జూలై 8 న మరణించాడు.

ప్రచురించిన రచనలు - మరాఠీ మార్చు

కవితా రచన

  • "ప్రతిభ" (1930): ప్రచురణకర్త: కాశీనాథ్ శ్రీధర్ నాయక్ (ముంబై)
  • "జీవనసంగీతం" (1937) భరత్ గౌరవ్ గ్రంథమాల (ముంబై)
  • "దూద్‌సాగర్" (1947)
  • "ఆనంద్ భైరవి" (1950) కాంటినెంటల్ ప్రకాశన్ (పూణే)
  • "చిత్రవీణ" (1960), 4 వ ఎడిషన్ 1985, మౌజ్ ప్రకాశన్ (ముంబై)
  • "బోర్కరాంచి కవిత" (1960), మౌజ్ ప్రకాశన్ (ముంబై)
  • "గిటార్" (1965), 2 వ ఎడిషన్ 1984, మౌజ్ ప్రకాశన్ (ముంబై)
  • "చైత్రపునవ్" (1970), మౌజ్ ప్రకాశన్ (ముంబై)
  • "చందన్వేల్" (1972), 2 వ ఎడిషన్ 1984, ఎడిటర్లు: కుసుమగ్రాజ్, GM కులకర్ణి, కాంటినెంటల్ ప్రకాశన్ (పూణే)
  • "మేఘదూత్" (1980) - కాళిదాస్ రచన అనువాదం, శ్రీవిద్య ప్రకాశన్ (పూణే)
  • "కాంచన్ సంధ్య" (1981), మౌజ్ ప్రకాశన్ (ముంబై)
  • "అనురాగిణి" (1982), సురేష్ ఏజెన్సీ (పూణే)
  • "చిన్మయీ" (1984), సురేష్ ఏజెన్సీ (పూణే)
  • "బోర్కరాంచి ప్రేమ్ కవిత" (1984), ఎడిటర్: RC ధేరే, సురేష్ ఏజెన్సీ (పూణే)
  • "కైవల్య చే జాద్" (1987), సురేష్ ఏజెన్సీ (పూణే)

చిన్న కథలు

  • "కాగాడి హోద్య" (1938), శ్రీ శివాజీ ముద్రణాలయ్, నవే గోయ్
  • "చాంద్యాచే కవద్సే" (1982), మెజెస్టిక్ బుక్ స్టాల్, ముంబై
  • "పావలా పూర్త ప్రకాష్" (1982), అలోక్ ప్రకాశన్, కొల్లాపూర్
  • "ఘుమతవర్లే పర్వ్" (1986), బందోద్కర్ పబ్లికేషన్ హౌస్, గోవా

నవలలు

  • "మావల్తా చంద్ర" (1938) మహారాష్ట్ర గ్రంథ్ భండార్, కొల్హాపూర్. 3 వ ఎడిషన్ 1986 బందోకర్ పబ్లిషింగ్ హౌస్, గోవా
  • "అంధరంతిల్ లాటా" (1943) దామోదర్ మోఘే, కొల్హాపూర్. 2 వ ఎడిషన్ 1986 బందోద్కర్ పబ్లిషింగ్ హౌస్, గోవా
  • "భవిన్" (1950) కాంటినెంటల్ ప్రకాశన్, పూణే
  • "ప్రికామ" (1983) సురేష్ ఏజెన్సీ, పూణే

జీవిత చరిత్రలు

  • "ఆనందయాత్రి రవీంద్రనాథ్: సంస్కార్ అని సాధన" (1964), 2 వ ఎడిషన్ సురేష్ ఏజెన్సీ (పూణే)
  • "మహమానవ్ రవీంద్రనాథ్" (1974), పూణే యూనివర్సిటీ

అనువాదాలు

  • "జల్తే రహస్య" (స్టీఫెన్ ఈవింగ్) 1945, VN మోఘే, కొల్హాపూర్
  • "కచేచి కిమయా" (స్టీఫెన్ ఈవింగ్) 1945, పిఆర్‌ధామ్‌ధేర్, పూణే
  • "బాపూజీ చి ఓజార్తి దర్శనే" (కాకాసాహెబ్ కాలేల్కర్) 1950
  • "అమ్హి పాహిలేలే గాంధీజీ" (చంద్రశేఖర్ శుక్లా) 1950
  • "మాjీ జీవన యాత్ర" (ఆత్మకథ-జంకి దేవి బజాజ్) 1960, ప్రముఖ ప్రకాశన్, ముంబై

సవరించిన పని

  • "రసయాత్ర" - కుసుమగ్రాజ్ పద్యాలు (1969) కాంటినెంటల్, పూణే

ప్రచురించిన రచనలు - కొంకణి మార్చు

కవితా రచన

  • "పైంజనా", 1960, ప్రముఖ ప్రకాశన్, ముంబై.
  • "ససాయ్", 1980, కులగర్ ప్రకాశన్, మడ్గావ్.
  • "కాంతమణి", జాగ్ ప్రకాశన్, ఇండియా

అనువాదాలు

  • "గీత ప్రవచన్" (వినోబా), పార్ధమ్, పావ్నార్, 1956
  • "గీతాయ్", 1960, పాపులర్, ముంబై
  • "వాసవదత్-ఏక్ ప్రణయ్ నాట్య" (అరవింద్ ఘోష్), 1973, జాగ్ ప్రకాశన్, ప్రియోల్ (గోవా)
  • "పైగంబర్" (ఖలీల్ జిబ్రాన్), 1973, జాగ్ ప్రకాశన్, ప్రియోల్ (గోవా)
  • "సంశయ్ కల్లోల్" (GB దేవల్), 1975, జాగ్ ప్రకాశన్, ప్రియోల్ (గోవా)
  • "భగవాన్ బుద్ధుడు" (ధర్మానంద్ కోసాంబి), సాహిత్య అకాడమీ
  • "కొంకణి కావ్య సంగ్రహ", 1981, సాహిత్య అకాడమీ [2]

సాహిత్యం

  • "బా. భా. బోర్కర్: వ్యక్తి, వాంజ్ఞ్మయం" - మనోహర్ హిర్బా సర్దేస్సాయ్ 1992, గోమంతక్ మరాఠీ అకాడమీ, పనాజీ
  • "మాండోవి"- కవివర్య బా.భా. బోర్కర్ 60 వ పుట్టినరోజు ప్రత్యేక సంచిక, 1970, ఎడిటర్: శ్రీరామ్ పాండురంగ్ కామత్, గోవా.

అవార్డులు మార్చు

  • 1934 - కవిత కోసం గోల్డ్ మెడల్ మరాఠీ సాహిత్య సమ్మేళన్
  • 1950 - నవల "భవిన్" కోసం గోల్డ్ మెడల్ గోమంతక్ మరాఠీ సాహిత్య సమ్మేళన్
  • 1950 - అధ్యక్షుడు - కోకాని సాహిత్య సమ్మేళన్
  • 1957– రాష్ట్రపతి - మరాఠీకవి సమ్మేళన్, షోలాపూర్
  • 1961-అధ్యక్షుడు-ఠాగూర్ సెంటినరీ సాహిత్య శాఖ
  • 1956 -ప్రెసిడెంట్ -గోమంతక్ మరాఠీ సాహిత్య సమ్మేళన్
  • 1963-రాష్ట్రపతి సాహిత్యకర్ సంసద్, అలహాబాద్
  • 1964–1970- ప్రెసిడెంట్- ఇనిస్టిట్యూట్ మెనెజెస్ బ్రాగంజా, పనాజీ, గోవా
  • 1963 - శ్రీలంకలోని సాహితిక్ శిష్టమండల్ సభ్యుడు
  • 1967 - పద్మశ్రీ - భారత ప్రభుత్వం
  • 1968 - అధ్యక్షుడు - అఖిల్ భారతీయ కోకాని పరిషత్
  • 1970– ప్రెసిడెంట్-రెండవ మరాఠీ సాహిత్య పరిషత్ యొక్క సాహిత్య సమ్మేళన్, మహాబలేశ్వర్
  • 1970-ప్రెసిడెంట్- 20 వ ముంబై సబర్బన్ సాహిత్య సమ్మేళన్
  • 1970- ప్రెసిడెంట్- 72 వ ముంబై మరాఠీ గ్రంథసంగాలయ వార్షిక ఫంక్షన్

మూలాలు మార్చు

  1. "Bakibab Prathishtan". sites.google.com/site/goapoetry/bakibabprathishtan. Bakibab Prathishtan.
  2. Borkar, Balkrishna Bhagwant (1981). Koṅkaṇī kāvyasaṅgraha (in హిందీ). Sāhitya Akādemī.