బాష్పీభవన స్థానం
బాష్పీభవన స్థానం (జర్మన్: Siedepunkt, ఆంగ్లం: Boiling point, ఫ్రెంచ్: Point d'ébullition, స్పానిష్: Punto de ebullición) ఒక ద్రవ పదార్థం ఆవిరిగా మారే ఉష్ణోగ్రత.[1] ఇక్కడ ఆవిరి పీడనం చుట్టూ వున్న వాతావరణ పీడనంతో సమానం అవుతుంది.[2][3] ఒక ద్రవం యొక్క బాష్పీభవన స్థానం శూన్యంలో తక్కువగాను, అధిక పీడనం ఉన్న ఎత్తైన ప్రదేశాలలో ఎక్కువగాను ఉంటుంది. అనగా ఇది చుట్టూ వున్న వాతావరణ పీడనం మీద ఆధారపడి వుంటుంది.[4]
సాధారణ బాష్పీభవన స్థానాన్ని సముద్రమట్టం వద్దనున్న వాతావరణం పీడనం (పీడనం 1) వద్ద 'వాతావరణ బాష్పీభవన స్థానం' అని కూడా అంటారు.[5][6] ఆ ఉష్ణోగ్రత వద్ద వాయువు పీడనం అధికమై బుడగలుగా ద్రవం మొత్తం నుండి బయటకు వస్తుంది. en:IUPAC ప్రకారం ప్రమాణిక బాష్పీభవన స్థానం (Standard Boiling point) 1 బార్ పీడనం వద్ద ద్రవాలు మరిగే ఉష్ణోగ్రత.[7]
బాష్పీభవన ఉష్ణం అనగా ఒక సంతృప్త ద్రావణం పూర్తిగా ఆవిరికావడానికి అవసరమైన వేడిమి.[8]
చాలా ద్రవ పదార్ధాలు బాష్పీభవన స్థానం కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా పరిశోషణము (జర్మన్: Verdunstung, ఆంగ్లం: Evaporation, ఫ్రెంచ్ Évaporation, స్పానిష్: Evaporación) చెందుతాయి. పరిశోషణంలో ద్రవాల ఉపరితలంలోని అణువులు మాత్రమే ఆవిరిగా మారతాయి.[9] అయితే బాష్పీభవన స్థానం వద్ద మొత్తం ద్రవంలో ఎక్కడ వున్న అణువులైనా ఆవిరిగా మారి బుడగలుగా తయారౌతాయి.
మూలాలుసవరించు
- ↑ Joachim Buddrus und Bernd Schmidt (2015). Grundlagen der Organischen Chemie (De Gruyter Studium) (5. Auflage ed.). De Gruyter. ISBN 978-3-110-30559-3. Seite 79
- ↑ David.E. Goldberg (1988). 3,000 Solved Problems in Chemistry (First Edition ed.). McGraw-Hill. ISBN 0-07-023684-4.CS1 maint: extra text (link) Section 17.43, page 321
- ↑ Louis Theodore, R. Ryan Dupont and Kumar Ganesan (Editors) (1999). Pollution Prevention: The Waste Management Approach to the 21st Century. CRC Press. ISBN 1-56670-495-2.CS1 maint: extra text: authors list (link) Section 27, page 15
- ↑ Danielle Baeyens-Volant et Nathalie Warzée (2015). Chimie générale - Exercices et méthodes. Dunod. ISBN 978-2-100-72073-6. pp. 179-184
- ↑ General Chemistry Glossary Purdue University website page
- ↑ Kevin R. Reel, R. M. Fikar, P. E. Dumas, Jay M. Templin, and Patricia Van Arnum (2006). AP Chemistry (REA) - The Best Test Prep for the Advanced Placement Exam (9th Edition ed.). Research & Education Association. ISBN 0-7386-0221-3.CS1 maint: multiple names: authors list (link) CS1 maint: extra text (link) Section 71, page 224
- ↑ Notation for States and Processes, Significance of the Word Standard in Chemical Thermodynamics, and Remarks on Commonly Tabulated Forms of Thermodynamic Functions See page 1274
- ↑ Jan Hoinkis (2015). Chemie für Ingenieure (14. Auflage ed.). Wiley-VCH Verlag GmbH & Co. KGaA. ISBN 978-3-527-33752-1. Seite 71
- ↑ Fernando Ignacio de Prada Pérez de Azpeitia, Ana Cañas Cortázar, y Aureli Caamaño Ros (2015). Física y química. 3 ESO. Savia. Ediciones SM. ISBN 978-8-467-57637-5.CS1 maint: multiple names: authors list (link) pp. 41-59