బిట్రా శ్రీనివాసరావు

బిట్రా శ్రీనివాసరావు ప్రముఖ చిత్రకారుడు. ఇతడు 1924లో భట్టిప్రోలు గ్రామంలో బాపయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించాడు[1]. ఇతడు ప్రముఖ సినిమా ఆర్ట్ డైరెక్టర్ గొట్టిముక్కల కోటేశ్వరరావు వద్ద చిత్రకళను అభ్యసించాడు. 1951లో భట్టిప్రోలులోని టి.ఎం.రావు ఉన్నత పాఠశాలలో చిత్రకళోపాధ్యాయుడిగా చేరాడు. తరువాత గుంటూరు హిందూ కళాశాల హైస్కూలులో చిత్రకళోపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇతడు గాంధేయవాది. ఎప్పుడూ ఖద్దరు వస్త్రాలనే ధరించేవాడు. ఇతడు ఎందరో విద్యార్థులను చిత్రకారులుగా తీర్చిదిద్దాడు. గుంటూరులో అడివి బాపిరాజు పేరు మీద ఉన్న కళాపీఠం పునరుద్ధరణకు తోడ్పడ్డాడు.

ఇతడు వేసిన తైలవర్ణ చిత్రాలు హిందూ కాలేజీలో, విజయవాడ గాంధీ కొండమీది మ్యూజియమ్‌లో ఉన్నాయి. ఇతడు చిత్రించిన కొన్ని తైలవర్ణ చిత్రాలు:

  • సరస్వతి
  • కోదండరాముడు
  • గీతోపదేశం
  • పొట్టి శ్రీరాములు
  • గాంధి
  • నెహ్రూ
  • ఆంధ్రకేసరి
  • జిల్లెలమూడి అమ్మ మొదలైనవి.

సన్మానాలుసవరించు

మూలాలుసవరించు

  1. బోనేపల్లి, మురళి (15 June 1980). "రూప చిత్రకారుడు శ్రీ బిట్రా శ్రీనివాసరావు". ఆంధ్రపత్రిక దినపత్రిక (సంపుటి 67, సంచిక 75). Retrieved 26 January 2018.