బిర్జూ మహరాజ్

భారతీయ నృత్య కారుడు

బిర్జూ మహరాజ్‌గా పిలువబడే బిర్జూ మోహన్‌నాథ్ మిశ్రా (ఫిబ్రవరి 4, 1938), భారతీయ కథక్ నాట్య కళాకారుడు. ఇతడు లక్నో కాల్కా-బిందాదిన్ ఘరానాకు చెందినవాడు. బిర్జూ కథక్ కళాకారుల కుటుంబంలో పుట్టాడు. ఈయన తండ్రి అచ్చన్ మహరాజ్, మేనమామలు శంభూ మహరాజ్, లచ్చూ మహరాజ్ లు పేరొందిన కథక్ కళాకారులు. చిన్నతనం నుండి నాట్యంపైనే మక్కువ ఉన్నా, బిర్జూ హిందుస్తానీ గాత్రంలో కూడా ఆరితేరినవాడు. కథక్ నాట్యానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చాడు. ఇతడు దేశవిదేశాల్లో వేలాది నాట్య ప్రదర్శనలనిచ్చి, ఎందరో విద్యార్థులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దాడు.

బిర్జూ మహరాజ్‌
Pandit Birju Maharaj.jpg
వ్యక్తిగత సమాచారం
జననం (1938-02-04) 1938 ఫిబ్రవరి 4 (వయస్సు: 82  సంవత్సరాలు)
వారణాసి, ఉత్తర ప్రదేశ్
మూలంభారతదేశం
రంగంహిందుస్తానీ సంగీతము
వృత్తిశాస్త్రీయ నృత్యకారుడు
వెబ్‌సైటుhttp://www.birjumaharaj-kalashram.com/main.asp

బాల్యంసవరించు

తండ్రి అచ్చన్ మహరాజ్ రాయ్‌ఘర్ ఆస్థాన నర్తకుడు. తండ్రి వద్దనే కాక, మేనమామలు, లచ్చూ మహరాజ్, శంభూ మహరాజ్‌ల వద్ద తొలి నాట్య పాఠాలను నేర్చుకొన్నాడు. తన ఏడవ యేట, తొలి నాట్య ప్రదర్శన నిచ్చాడు.

నాట్య ప్రస్థానంసవరించు

బిర్జూ మహరాజ్ తన పదమూడవ ఏటి నుండే, న్యూఢిల్లీ లోని సంగీత భారతిలో నాట్యాచార్యుడిగా పనిచేయడం ప్రారంభించాడు. తరువాత భారతీయ కళాకేంద్ర, సంగీత నాటక అకాడమీ లో ప్రధాన నాట్యాచార్యుడిగా ఉండి, 1998 లో రిటైర్ అయ్యాడు. బిర్జూ మహరాజ్ సత్యజిత్ రే సినిమా షత్రంజ్ కే ఖిలారి లో సంగీతం సమకూర్చి, పాడాడు. దేవ్‌దాస్ (2002) సినిమాలో, కాహె ఛేడ్ మొహె అనే పాటకు నాట్యం చేశాడు.

అవార్డులు, గౌరవ పురస్కారాలుసవరించు

సినిమాలుసవరించు

  • 1. దేవ్‌దాస్ (2002)
  • 2. గదర్ 2001
  • 3. దిల్ తో పాగల్ హై
  • 4. షత్రంజ్ కే ఖిలారి

వనరులుసవరించు

  1. అచ్చన్ మహరాజ్
  2. బిర్జూ మహరాజ్ - కథక్
  3. బిర్జూ మహరాజ్

బయటి లింకులుసవరించు