బిషంభర్ నాథ్ పాండే

భారత రాజకీయ నాయకుడు

బిషంభర్ నాథ్ పాండే (1906 డిసెంబర్ 23 – 1998 జూన్ 1) [1] భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, పార్లమెంటేరియన్. పాండే తన జీవితాన్ని జాతీయ సమైక్యతకు, గాంధేయ జీవన విధాన వ్యాప్తికీ అంకితం చేసాడు.

బిషంభర్ నాథ్ పాండే

ఒడిశా గవర్నరు
పదవీ కాలం
1983 ఆగస్టు 17 – 1988 నవంబరు 20

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
వృత్తి రాజకీయ నాయకుడు

జీవితం మార్చు

బిఎన్ పాండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడు, భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ లకు సన్నిహితుడు. అతను గాంధేయ తత్వాన్ని అనుసరించాడు. గాంధీ స్మృతి, దర్శన్ సమితి (GSDS) కి 18 సంవత్సరాల పాటు వైస్ ఛైర్మనుగా పనిచేసాడు. ఈ సంస్థ గాంధీ సూత్రాలను, తత్వశాస్త్రాన్నీ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 

పాండే, మోహన్ దాస్ గాంధీ జీవితం గురించి, అతని ఆదర్శాల గురించీ జపాన్, రష్యా, జర్మనీ, కెనడా వంటి దేశాలలో ఉపన్యాసాలు ఇచ్చి ప్రచారం చేసాడు.

పురస్కారాలు మార్చు

1976 లో, సామాజిక సేవా రంగంలో సాధించిన విజయాలకు గాను, పాండేకు పద్మశ్రీ పురస్కారం లభించింది. 

భారతదేశంలో హిందూ-ముస్లిం ఐక్యత విషయంలో సాధించిన విజయాలకు గాను, 1996 లో భారత ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు పాండేకు ఇందిరాగాంధీ పురస్కారం అందించాడు. భారతదేశ మిశ్రమ సంస్కృతిపై చేసిన కృషికి గాను, అతనికి ఖుదాబక్ష్ పురస్కారం కూడా లభించింది. [2]

రాజకీయ జీవితం మార్చు

పుస్తకాలు మార్చు

భారతదేశంలోని వివిధ మతాల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో పాండే తన జీవితంలో ఎక్కువ భాగాన్ని లౌకికవాదంపై పరిశోధన కోసం అంకితం చేశాడు. తన పరిశోధనలో భాగంగా, అతను అనేక పుస్తకాలు రాశాడు. వాటిలో కొన్ని:

  • భారత జాతీయ కాంగ్రెసు 1885-1985 శతాబ్ది చరిత్ర
  • భారత జాతీయ కాంగ్రెసు సంక్షిప్త చరిత్ర, 1947–1985 (1986)
  • ఇందిరా గాంధీ
  • ఇస్లాం, భారతీయ సంస్కృతి
  • ఔరంగజేబ్

మూలాలు మార్చు

  1. Faruqi, M H (July 1998). "The Muslim Rule in India". Impact International. 28.
  2. "Freedom fighter dead". The Tribune. 1 April 2000. Retrieved 12 November 2011.