ప్రధాన మెనూను తెరువు

Coordinates: 12°59′55″N 77°35′32″E / 12.998529°N 77.592103°E / 12.998529; 77.592103

బెంగళూరు రాజప్రాసాదం

బెంగుళూరు ప్యాలెస్, భారతదేశములోని బెంగుళూరు నగరంలో ఉన్న ఒక రాజప్రాసాదం. ఇది ఇంగ్లాండులోని విండ్సర్ కాసిల్ యొక్క ఒక చిన్న నమూనా లాగా ఉండేటట్లు నిర్మించబడింది.[1][2] బెంగుళూరులోని సెంట్రల్ ఉన్నత పాఠశాల మొదటి ప్రిన్సిపాల్ అయిన రెవరెండ్ గారెట్ దీనిని నిర్మించారు, ఈ కాలేజీ ప్రస్తుతం సెంట్రల్ కాలేజీగా ప్రసిద్ధి చెందింది.[3]

ఆ రాజప్రాసాదం నిర్మాణం 1862లో ప్రారంభమై 1944లో పూర్తి అయింది. 1884లో, మైసూరు మహారాజు చామరాజ వడయార్ దీనిని కొన్నారు.[3] ప్రస్తుతం మైసూరు రాజ కుటుంబం యొక్క ప్రస్తుత వారసుడు, శ్రీకంఠ దత్త నరసింహరాజ వడయార్ ఆధీనంలో ఉన్న ఈ రాజప్రాసాదానికి ఇటీవలే పునర్నిర్మాణం జరిగింది.

ప్యాలెస్ గ్రౌండ్స్సవరించు

ఈ రాజప్రాసాదం చుట్టుపక్కల విస్తరించిన మైదానం సంగీత కచేరీలతో సహా బహిరంగ కార్యక్రమముల కొరకు ఉపయోగించబడుతుంది.

చరిత్రసవరించు

సెంట్రల్ హై స్కూల్ యొక్క మొదటి ప్రిన్సిపాల్ Rev. గారెట్, 45,000 చదరపు అడుగుల (4200 చదరపు మీటర్లు) భూ వైశాల్యముతో ఈ రాజప్రాసాదాన్ని నిర్మించారు. రాజప్రాసాదం మరియు దాని చుట్టూ పక్కల మైదానములు 454 ఎకరాలలో (183 హెక్టార్లు) విస్తరించాయి.[4] యువరాజు చామరాజ వడయార్ కు విద్య నేర్పటానికి నియమించబడిన బ్రిటిష్ అధికారులు 1873 A.D.లో అతని వద్ద నుండి ఈ రాజప్రాసాదాన్ని 40,000 రూపాయలకు కొని ఆ తరువాత దానిని బాగుచేశారు. ఆ రాజప్రాసాదం దుర్గములతో కూడిన బురుజులు, కోట కొమ్ములు మరియు బురుజు మీది చిన్న గదులతో ట్యూడర్ తరహా నిర్మాణ కళలో నిర్మించబడింది. అంతర్భాగములు సొంపైన కొయ్య బొమ్మలు, పువ్వుల నమూనాలు, చూరులు మరియు పై కప్పుల పైన స్వస్థత కూర్చే తైలవర్ణ చిత్రములతో అలంకరించబడ్డాయి. నియో-క్లాసికల్, విక్టోరియన్ మరియు ఎడ్వర్డియన్ రీతిలో ఉన్న సామాగ్రి జాన్ రాబర్ట్స్ మరియు లజారస్ నుండి కొనుగోలు చేయబడింది. ఉద్యానవనముల బాగోగులు చూసుకోవటం హార్టికల్చరిస్ట్ (తోటల పెంపకంలో నిపుణుడు) గుస్తవ్ హెర్మాన్ క్రంబీజెల్ బాధ్యత. ఆ రాజప్రాసాదం మొత్తం మీద 35 గదులు నిర్మించబడ్డాయి, వాటిలో చాలా వరకు పడక గదులు.[4] పునరుద్ధరణలో జనరల్ ఎలెక్ట్రిక్ నుండి మాన్యువల్ (మనుష్యుల సాయంతో నడిచేది) లిఫ్ట్ మరియు కొయ్య ఫ్యాన్ లతో పాటు, ప్రత్యేకించి ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న అద్దకము వేసిన గాజు మరియు అద్దములు కూడా చేరాయి.[5] 1970లో మహారాజు జయచామరాజేంద్ర వడయార్ మరణించే వరకు ఆ రాజప్రాసాదం వడయార్ల ఆధీనంలో ఉండేది. 1970లో జయచామరాజేంద్ర వడయార్ ఆ ఆస్తి పై అధికారాన్ని అధికారులకు సన్నిహితుడైన చామరాజు అనే సివిల్ కాంట్రాక్టర్ చే ప్రచారం చేయబడిన రెండు వ్యాపార సంస్థలకు బదిలీ చేసాడని వినికిడి. ఈ రెండు వ్యాపారసంస్థలు చాముండి హోటల్స్ (P) లిమిటెడ్ (110 ఎకరాలు) మరియు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజెస్ (p) లిమిటెడ్ ( 344 ఎకరాలు). అనుకున్న రోజుకి ఆ సంస్థలు ఇంకా చట్టబద్ధంగా సంస్థగా ఏర్పడలేదు మరియు అక్కడ విక్రయ పత్రం కూడా లేదు. అది ఒక మోసపూరిత వ్యవహారము. మహారాజు యొక్క ఏకైక కుమారుడు శ్రీకంఠ దత్త నరసింహరాజ వడయార్ ఈ లావాదేవీకి వ్యతిరేకంగా సివిల్ (ఆస్తి సంబంధిత) వ్యాజ్యాన్ని వేసారు. కానీ 1974 లో ఆ మహారాజు మరణించారు. ఆ న్యాయపోరాటం కొనసాగింది మరియు అదే సమయంలో శ్రీకంఠ దత్త నరసింహరాజ వడయార్ 1983లో రమణ మహర్షి రోడ్డుతో పాటు తన ఐదుగురు సోదరీమణులు దివంగత గాయత్రీ దేవి, మీనాక్షి దేవి, కామాక్షి దేవి, ఇంద్రాక్షి దేవి మరియు విశాలాక్షి దేవిలకు 28 acres (110,000 మీ2) ఒక్కొక్కటి ఇచ్చివేశారు. వారికి సంబంధించిన భాగములు వారి ఆధీనంలో ఉన్నాయి మరియు రాక్ షోలు, ప్రదర్శనలు, వివాహములు, టెన్నిస్, క్రికెట్, గోల్ఫ్ మరియు హార్స్ అకాడెమిల వంటి పలు కార్యక్రమములు ఈ విభాగములలో జరుగుతాయి. శ్రీకంఠ దత్త నరసింహరాజ వడయార్ చిట్టచివరకు 1990 మరియు 1994 సంవత్సరములలో చామరాజు వర్గంతో రాజీ పడి, 45 acres (180,000 మీ2) మినహా ప్రధాన రాజప్రాసాదంతో సహా ఆస్తిలో తన భాగాన్ని తిరిగి పొందాడు. జయమహల్ రోడ్ తో పాటు ఆ ఒక్క భాగం ఇప్పటికీ చామరాజు వర్గం ఆధీనంలోనే ఉంది. అప్పటి నుండి కర్ణాటక ప్రభుత్వము భూ ఆక్రమణ చట్టం 1894 మరియు అర్బన్ ల్యాండ్ ( గరిష్ఠ మితి & నియంత్రణ) చట్టం 1976 క్రింద ఆ ఆస్తిని జప్తు చేయాలని వివిధ ప్రయత్నములు చేస్తూ ఉంది. వారి ఎత్తుగడలలో విజయవంతం కాలేక, చిట్టచివరకు Mr. H.D. దేవేగౌడ నేతృత్వంలో ప్రభుత్వం బెంగుళూరు ప్యాలెస్ (ఆర్జన & బదిలీ) చట్టం 1996 ను ప్రవేశపెట్టింది. ఈ వివాదం ఇప్పటికీ సుప్రీం కోర్టులో నడుస్తూ ఉంది.

అంతర అలంకరణసవరించు

క్రింది అంతస్తులో ఫ్లోరసెంట్ నీలి రంగు సెరామిక్ పలకల[5]తో కప్పబడిన గ్రానైట్ ఆసనములతో కూడిన బహిరంగ చావడి ఉంది. ఇక్కడ వ్యక్తిగత వేడుకలను నిర్వహించటానికి ఒక బాల్ రూమ్ కూడా ఉంది. మొదటి అంతస్తులో దర్బార్ హాల్గా పిలవబడే ఒక పెద్ద హాలు ఉంది. అలంకరించబడిన మెట్లు ఎక్కి ఈ హాలుకి చేరుకోవచ్చు. ఈ హాలులోనే రాజు దర్బారు నిర్వహించేవాడు. మెట్ల పక్కన ఉన్న గోడలు తైల వర్ణ చిత్రములతో అలంకరించబడ్డాయి మరియు దర్బార్ హాల్లో ఒక భారీ ఏనుగు తల అతికించబడి ఉంటుంది. హాలులో ఒక వైపు గోతిక్ రీతిలో ఉన్న కిటికీలు ఉన్నాయి. పసుపు రంగు విస్తారంగా వాడబడింది మరియు హాలులోని సోఫా సెట్ పసుపు రంగుది. ఒక మూల ఉన్న తెర, మహిళలు ఏకాంతములో కూర్చుని సభా కార్యక్రమములను వీక్షించే స్థలాన్ని విడిగా ఉంచుతుంది. రాజా రవి వర్మ యొక్క తైలవర్ణ చిత్రములు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి.[5]

ఆ రాజప్రాసాదం లోపలి గోడలు కొన్ని గ్రీకు మరియు డచ్ పెయింటింగులతో సహా పందొమ్మిదవ శతాబ్దపు మధ్య భాగానికి చెందిన పురాతన పెయింటింగులతో అలంకరించబడ్డాయి. కొన్ని ఇతర ఆకర్షణలలో మైసూరు దివాన్, సర్ మిర్జా ఇస్మాయిల్ కు చెందిన ఒక డైనింగ్ టేబుల్ ఉంది . ఈ టేబుల్ లో ఉత్తమ జాతి ముత్యం తాపడంతో చైనీయుల లక్కపూసిన పనితనం ఉంది.

పునరుద్ధరణసవరించు

 
రాజప్రాసాదం యొక్క ప్రధాన ద్వారం

శ్రీకంఠ దత్త నరసింహరాజ వడయార్ ఆ రాజప్రాసాదం సొంతం చేసుకునే హక్కు సాధించిన తర్వాత దాని పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. కొయ్య పని తిరిగి చేయబడింది మరియు బాల్ రూం పునర్నిర్మాణం జరిగింది[3]. ఇత్తడి-అమరికలు మరియు దీపముల స్థానంలో కొత్తవి పెట్టబడ్డాయి మరియు కొత్త గృహోపకరణములు ఉంచబడ్డాయి. ప్రస్తుతం ప్యాలెస్ లో ఉన్న 30,000 ఫోటోగ్రాఫులలో, సుమారు 1,000 సరిచేసి ప్రదర్శనకు ఉంచబడ్డాయి. రాజ కుటుంబం ఉపయోగించిన పట్టు మరియు ఇతర దుస్తులను ప్రదర్శించటానికి ఒక గది బోటిక్ గా మార్చబడింది. ఈ రాజప్రాసాదమును సందర్శించటానికి స్థానికులు 175 రూపాయలు మరియు విదేశీయులు 350 రూపాయలు చెల్లించాలి. కెమెరా రుసుములు : స్టిల్ ఫోటోగ్రఫి కొరకు 500 రూపాయలు మరియు వీడియో కెమెరా కొరకు 1000 రూపాయలు. వ్యక్తిగత వేడుకల కొరకు మరియు రాజ కుటుంబీకులు ఉపయోగించిన పట్టు ఉత్తరీయములను, ఛాయా చిత్రములను మరియు ఇతర వస్తువులను విక్రయించటానికి బాల్ రూమ్ ను అద్దెకు ఇచ్చే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఆ రాజప్రాసాదమును దీపములతో అలంకరించటం మరియు మెక్సికన్ గడ్డిని ఉపయోగించి ఉద్యానవనములను పునరుద్ధరించటం జరుగుతూ ఉంది.

కచేరీలుసవరించు

రాజప్రాసాదం చుట్టూ విస్తరించి ప్యాలెస్ గ్రౌండ్స్గా ప్రసిద్ధి చెందిన మైదానములలో ఒకే సమయములో ఎక్కువ మంది ప్రజలు చేరటానికి అవకాశం ఉండటంతో ఇక్కడ బహిరంగ కార్యక్రమములకు మంచి వేదిక అయ్యాయి. ఈ మైదానములు ప్రసిద్ధ అంతర్జాతీయ బాండ్లతో సహా సంగీత కచేరీల నిర్వహణకు కూడా ఉపయోగించబడుతున్నాయి.

వీటిని కూడా చూడండిసవరించు

  • వడయార్

వివరా‌లుసవరించు

  1. Habib Beary (2003-04-03). "Stones prepare for India concert". Online webpage of the BBC, dated 2003-04-03. BBC, MMVII. Retrieved 2007-06-27.
  2. N. Niranjan Nikam. "Restoring royal glory". Online Edition of The Deccan Herald, dated 2007-06-04. 2007, The Printers (Mysore) Private Ltd. మూలం నుండి 2007-09-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-06-27.
  3. 3.0 3.1 3.2 "Wadiyar to restore Bangalore Palace". Online Edition of The Hindu, dated 2005-07-22. Chennai, India: The Hindu. 2005-07-22. Retrieved 2007-06-27.
  4. 4.0 4.1 "An Exclusive Interview with Srikantadatta Narasimharaja Wodeyar". Online webpage of BangaloreBest.com. Copyright © 2001 Indias-Best.Com Pvt. Ltd. Retrieved 2007-06-27.
  5. 5.0 5.1 5.2 Jangveer Singh. "The Indian Windsor castle". Online webpage of the Tribune, dated 2005-08-07. Retrieved 2007-06-27.