బెల్లాన చంద్రశేఖర్
బెల్లాన చంద్రశేఖర్ భారతీయ రాజకీయ నాయకుడు. అతను భారతదేశ 17వ సార్వత్రిక ఎన్నికలలో విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం నుండి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందాడు. [1]
బెల్లాన చంద్రశేఖర్ | |||
భారత పార్లమెంటు సభ్యులు
విజయనగరం | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 17 జూన్ 2019 | |||
ముందు | పూసపాటి అశోక్ గజపతి రాజు | ||
---|---|---|---|
తరువాత | కలిశెట్టి అప్పలనాయుడు | ||
నియోజకవర్గం | విజయనగరం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | సింహాచలం | ||
జీవిత భాగస్వామి | శ్రీదేవి | ||
సంతానం | వంశీకృష్ణ | ||
పూర్వ విద్యార్థి | ఎస్‌డీఎస్ అటానమస్ డిగ్రీ కళాశాల | ||
వృత్తి | న్యాయవాది | ||
మతం | హిందూ |
జీవిత విశేషాలు
మార్చుబెల్లాన చంద్రశేఖర్ గరివిడి ఎస్‌డీఎస్ అటానమస్ డిగ్రీ కళాశాలలో 1980–1983 వరకు డిగ్రీ చదివిన రోజుల్లో విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశాడు. 1990–1993లో మహారాజా కళాశాలలో బీఎల్ చదివాడు. అతను చీపురుపల్లిలో గల మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేసాడు. అతను గతంలో జెడ్.పి.టి.సి గా, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశాడు. అతని తండ్రి సింహాచలం న్యాయవాది. అతను రెండు దశాబ్దాల పాటు చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పని చేశాడు. బెల్లాన చంద్రశేఖర్ భార్య శ్రీదేవి చీపురుపల్లి మేజర్ పంచాయతీకి పదేళ్లు సర్పంచ్‌గా పనిచేసింది. [2]
బెల్లాన చంద్రశేఖర్ 2014లో చీపురుపల్లి శాసనసభా నియోజకవర్గం నుండి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసాడు. కానీ ఓడిపోయాడు. [3]
మూలాలు
మార్చు- ↑ "Vizianagaram (Andhra Pradesh) Election 2019". Times Now. 23 May 2019. Retrieved 24 May 2019.
- ↑ "బెల్లాన చంద్రశేఖర్ (MP), విజయనగరం పార్లమెంట్ లోక్‌సభ అభ్యర్థి". Archived from the original on 2019-06-16. Retrieved 2019-07-10.
- ↑ "Lok Sabha Election result 2019: YSRCP's Bellana Chandrasekhar takes lead in Andhra Pradesh's Vizianagaram".